Monday, 29 June 2015

zoonoses day

ముద్దొచ్చే జంతువులతో ముంచుకొచ్చే ముప్పు
ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఎంత పాత మాటో అంత పదునైన మాట కూడా. రోగాలతో అల్లాడాలని, జబ్బులతో డబ్బులు వదిలించుకోవాలని ఎవరూ కోరుకోరు. ఆరో గ్యంగా, ఆనందంగా వుండాలనే ప్రతి ఒక్కరు ఆశపడతారు. అయితే ఆశ ఒక్కటే వుంటే చాలదు కదా. అందుకు తగిన ఆచరణ కూడా ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటూ, చక్కని వ్యాయామం చేస్తూ, క్రమశిక్షణగా జీవిస్తే చాలు... ఆరోగ్యంగా వుండొచ్చు అనుకుం టారు చాలామంది. అది నిజమే కాని... అది మాత్రమే నిజం కాదు. అవన్నీ పాటించినా కూడా రోగాలు రెచ్చిపోవటానికి, జబ్బులు జబ్బలు చరచటానికి, వ్యాధులు విజృంభించ టానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం కలలోనైనా వూహించలేం. కాబట్టే కొత్త జబ్బుల బారిన పడుతూవుంటాం.

సగటు మనిషి, రైతులు, బీదాబిక్కి, కూలీనా లీలతో పాటు విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా తెలిసోతెలియకో రోజూ రోగాల రాజ మార్గంలో నడుస్తూ వుంటారు. అలాంటి వారందరినీ అప్రమత్తం చేసి, వారు ఆశపడే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకునేలా చెయ్యటమే మా ప్రయత్నం.
జూలై 6 తేదీ వరల్డ్ జూనోసిస్ డే (ప్రపం సాంక్రమిక వ్యాధుల దినం) నాలుగు మం చిమాటలు తెలుసుకొని, నాలుగు రోజులు అదనంగా ఆరోగ్యంగా వుందాం.

నిమ్న శ్రేణి జీవుల నుండి మనుషులకు, మనుషుల నుండి నిమ్న శ్రేణి జీవులకు సహ జసిద్ధంగా సంక్రమించే వ్యాధులను జూనోసి స్‌’ అంటారు. ఇలాంటి జూనోటిక్ వ్యాధులు దాదాపు 200 వరకు వున్నాయి. వీటిలో రేబిస్‌’ (పిచ్చి కుక్క కాటు వల్ల సోకే వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంత మైన వ్యాధి. లూరుూస్ పాశ్చర్ అనే ప్రముఖ శాస్తవ్రేత్త... పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6, 1885 తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ రేబిస్ టీకాను ఇచ్చారు. ఇది విజ యవంత మైంది. చారిత్రకం గా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరి త్రపుటల్లో చిరస్థా యిగా నిలిచిపోయే రోజును (జూలై 6) రోజు నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డే (ప్రపంచ సాంక్ర మిక వ్యాధుల దినం) గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమిచే జూనో టిక్ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించటం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారి పడకుండా చేయటం వరల్డ్ జూనోసిస్ డే యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
జంతువులు, పక్షులను పెంచుకునే ేవారు వాటితో సన్నితంగా వుంటారు. పాలను, పాల ఉత్పత్తులను, మాంసం, జంతు ఉత్పత్తులను ఉపయోగించని వారు బహుశా ఎవరూ ఉండరు. క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్ వ్యాధి బారిన పడే అవకాశం ప్రతి ఒక్కరికి వుంటుంది. కాబట్టి, వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, వ్యాధుల పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి వరల్డ్ జూనోసిస్ డే నాడు పశు సంవర్ధక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది.

hen

జూనోటిక్ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటంటే... మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెలు - మేకల పెంపకం, కోళ్ళ పెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా, అవసరార్థం, ఆసక్తితో, ఆకర్షణతో కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుతూవుంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు. అయితే... అందమైన గులాబి పక్కనే గుచ్చుకునే ముళ్ళు ఉన్నట్టు, తియ్యని తేనెపట్టు చుట్టూ కాటేసే ఈగలు ఉన్నట్టు, ఆదాయాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచి వుంటాయి.

వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసేవారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూవుంటా రు. అలాంటప్పుడు జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధా రణ సమస్యల నుండి ప్రాణహానిని కూడా కలిగించే అవకాశం వుం టుంది. కాబట్టి పశువులు, జంతువులు, కో ళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగ శాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలలో పనిచేసే వారు, పశు వైద్య సిబ్బంది, చర్మం, తోళ్ళ పరి శ్రమలలో పనిచేసేవారు, ధాన్య గిడ్డంగులలో పనిచేసేవారు జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

బ్యాక్టీరియా, వైరస్, ప్రొటోజోవా, ఫంగస్, క్లామిడే వంటి జీవుల వలన జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యక్తుల యొక్క వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వంటి అంశాలను అనుసరించి, వ్యా ధులు సోకటం, వాటి తీవ్రత, అవి కలిగించే హాని ఆధారపడి వుంటాయి. అలాగే వ్యాధి కా రకం మనిషికి ఎంతవరకు హాని కలిగించగ లుతుంది అనేది, వ్యాధి కారకం రకం, జా తి పైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించ టం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

వైరస్ ద్వారా సంక్రమించే జూనోటిక్ వ్యాధులు: రేబిస్, మ్యాడ్ కౌ, గాలి కుంటు
బ్యాక్టీరియా వల్ల వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: బ్రూసెల్లస్, క్షయ, సాల్మొనెల్లోసిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్.
పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: ఏంకైలో స్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా (గజ్జి), అమీబియాసిస్, బాలండీటియోసిస్, టాక్సోప్లాస్మా.

కొన్ని ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వాటి వివరాలు...
1.
రేబిస్: పిచ్చి కుక్క కాటు వలన వ్యాధి కలుగుతుంది. మనదేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది వ్యాధి వలన చనిపోతున్నట్టు ఒక అంచనా.
2.
మెదడువాపు: జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి పందుల శరీరం పైన వుండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్నపిల్లలు వ్యాధి వలన మరణిస్తున్నారు.
3.
మ్యాడ్ కౌ వ్యాధి: ఒకప్పుడు ఇంగ్లండ్లో వ్యాధి వలన విపరీతమైన జన నష్టం జరిగింది.

జూనోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
dogw
1.
వ్యాధి సోకిన జంతువులు, కోళ్ళ మాంసం తినకూడదు.
2.
పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి.
3.
సరిగా ఉడకని గ్రుడ్లను తినకూడదు.
4.
వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు.
5.
చెడిపోయిన, అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు.
6.
పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా వుంచాలి.
7.
పాలను బాగా మరిగించి తాగాలి.

8.
పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు కాలాణుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
9.
పాలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి.
10.
పశువులు, జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకునే విధానం సక్రమంగా అమలు చెయ్యాలి.
11.
పోస్ట్మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి.
12.
వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
13.
రేబిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్ వంటి వ్యాధుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
14.
పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఏంటీ రేబిస్ టీకాను వేయించాలి.

15.
కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీ రేబిస్ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
16.
పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి.
17.
పందులకు గ్రామ శివారుల్లో ఆవాసం ఏర్పాటు చేయాలి.
18.
మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో, సున్నం చల్లి పూడ్చి పెట్టాలి.
20.
జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమి సంహారకాలతో శుభ్రం చెయ్యాలి.
21.
పశు సంవర్ధక శాఖ, ఆరోగ్య శాఖ, పంచాయితీ, మున్సిపల్ అధికారులు రేబిస్ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
22.
స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి.
23.
జూనోసిస్ డేను విజయవంతం చేసి, ప్రజలలో అవగాహన పెంచటంలో అందరూ సహకరించాలి.

ఏయే వృత్తులలో... ఏయే జూనోటిక్ వ్యాధి...


వృత్తి / పని / సందర్భం              జూనోటిక్వ్యాధి
1.
పిచ్చి కుక్క కాటు వలన            రేబిస్
2.
కుక్కపిల్లలతో ఆడేవారికి             టాక్సో కారియాసిస్
3.
కుక్కలను, లేగదూడలను తాకినప్పుడు   గజ్జి, చర్మవ్యాధులు
4.
పందులు, దోమల వలన            మెదడువాపు వ్యాధి
5.
అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు, మాంసం   బ్రూసెల్లోసిస్
6.
ఎలుకల వలన                   ప్లేగు
7.
పశువులతో సన్నిహితంగా మెలగడం     క్షయవ్యాధి
8.
ఉన్ని, తోళ్ళ పరిశ్రమలలో పని చేసేవారికి దొమ్మరోగం (ఆంత్రాక్స్‌)
9.
సరిగా ఉడకని గ్రుడ్లు, మాంసం వలన    సాల్మొనెల్లోసిస్
10.
పంది మాసం వలన              టీనియా సోలియం
11.
కర్ర కోత పనిచేసేవారికి             సాల్మొనెల్లోసిస్
12.
గొర్రెలు, మేకల కాపరులకు          గజ్జి, దురద
13.
కోళ్ళ ద్వారా                  రాణికెట్‌, సిట్టకోసిస్
14.
మాంసపు పరిశ్రమలలోని కూలీలకు     క్యూ ఫీవర్

No comments:

Post a Comment