Showing posts with label KAMJU PITTALA FARMING. Show all posts
Showing posts with label KAMJU PITTALA FARMING. Show all posts

Saturday, 27 June 2015

కౌజు పిట్టల పెంపకం


కౌజు పిట్టల పెంపకం వలన కలిగే లాభాలు

  1. అతి తక్కువ స్ధలం కావాలి
  2. తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
  3. కౌజు పక్షులు వేరే పక్షుల కంటే బలిష్టమైన పక్షులు.
  4. తక్కువ వయసులోనే అమ్మకానికి పెట్టవచ్చు. అంటే 5 వారాల వయసులోనే
  5. త్వరగా ఎదుగుతాయి . ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
  6. అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి - సంవత్సరానికి 280 గుడ్లు.
  7. కోడిపిల్ల మాంసం కంటే కూడ కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడ తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
  8. పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
  9. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం మరియు గుడ్లు ఒక పౌష్టికాహారం

పెంపక కేంద్రము

  1. రెల్లుగడ్డి పరచిన స్ధలం
    • 6 కౌజు పిట్టలను 1 చదరపు అడుగు స్ధలంలో పెంచవచ్చు.
    • రెండు వారాల తరువాత, కౌజు పిట్టలను, పంజరాలలో పెట్టి పెంచవచ్చు. అనవసరంగా పక్షులు, అటూ యిటూ తిరగలేక పోవడం వలన, మంచి శరీర బరువు వస్తుంది.
  2. పంజరం పద్ధతి






కౌజు పిట్టల పంజరంలో పెట్టి పెంచే విధానం
వయసు (age)
పంజరం పరిమాణం (case size)
పక్షుల సంఖ్య
మొదటి రెండు వారాలు
3x2.5x1.5 అడుగుల (feet)
100
మూడు నుండి ఆరు వారాల వరకు
4x2.5x1.5 అడుగుల (feet)
50
  • ప్రతీ పంజరం సుమారు 6 అడుగుల పొడవు మరియు 1 అడుగు వెడల్పు కలిగి, తిరిగి ఆరు చిన్న పంజరాలుగా విభజింపబడుతుంది.
  • స్ధలం ఆదా చేయుటకు, పంజరాలను 6 అరలుగా ఏర్పాటు చేయవచ్చు. 4 నుండి 5 పంజరాలు ఒక వరుసలో వచ్చేటట్లు చూడవచ్చు.
  • పంజరం అడుగుభాగం, చెక్కపలకతో అమర్చబడి, పక్షుల రెట్టలను శుభ్రపరచడానికి వీలుగా ఉంటుంది.
  • పొడవైన, సన్నని మూతిగల మేత తొట్టెలను పంజరాల ముందు ఏర్పాటు చేస్తారు. నీటి తొట్టెలను, పంజరం వెనుకభాగం వైపు ఏర్పాటు చేస్తారు.
  • వ్యాపారానికి పనికి వచ్చే, గుడ్లు పెట్టె పక్షులను, సాధారణంగా, 10 – 12 పక్షులను ఒక పంజరానికి చొప్పున సముదాయంగా పెంచుతారు. సంతానోత్పత్తి కొరకు, మగ కౌజు పిట్టలను పంజరంలోనికి 1 మగపక్షి, 3 ఆడ పక్షుల నిష్పత్తిలో ప్రవేశపెడ్తారు.

మేత (ఆహారం) నిర్వహణ

మేత ఈ విధంగా తయారు చేయబడుతుంది
మేతలోని పదార్ధాలు (feed ingedicuts)
పక్షిపిల్ల (కూనకు) కావలసిన గుజ్జుమేత (chick mash)
పెరుగుతున్నపక్షిపిల్లకు కావలసిన గుజ్జుమేత

0 – 3 వారాలు
4 - 6 వారాలు
మొక్కజొన్నలు (maige)
27
31
జొన్నలు (sorghum)
15
14
నూనె తీసివేసిన ధాన్యపు పొట్టు (deoiled bran)
8
8
వేరు శనగ పిండి (ground nut cake)
17
17
పొద్దుతిరుగుడు పిండి (sunflower cake)
12.5
12.5
సోయా పిండి (soya meal)
8
-
చేపల మేత (fish meal)
10
10
ఖనిజ లవణాల మిశ్రమం (mineral mineral mix)
2.5
2.5
గుల్లల పొట్టు (shell grill)
-
5
  • మేత చిన్న రేణువులుగా కలిపి చేయబడుతుంది.
  • ఒక 5 వారాల వయసున్న కౌజు పిట్ట, సుమారు 500 గ్రాముల మేత తీసుకుంటుంది.
  • 6 మాసాల వయసున్న కౌజు పిట్టలు, ఒక రోజుకు సుమారు 30 – 35 గ్రాముల మేతను తింటాయి.
  • కౌజు పిట్టలకు, 12 గుడ్లును పెట్టడానికి సుమారు 400 గ్రాముల మేత అవసరం.
  • మాంసం కొరకు పెంచే పక్షులకు మొదటి మేతలో, 5 కేజీల తెలగ పిండి కలిపి 75 మేతలను ఇవ్వవచ్చు. మేతలో ఉండే రేణువులను, ఇంకొకసారి నూరడం వలన వాటిని ఇంకొంచెం మెత్తగా చేయవచ్చు.

కౌజు పిట్టల పెంపక నిర్వహణ

  1. ఆరు వారాల వయసులో, ఆడ కౌజు పిట్టలు, సామాన్యంగా 175 - 200 గ్రాముల బరువు, మగ కౌజు పిట్టలు 125 - 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.
  2. ఆడ కౌజు పిట్టలు, 7 వారాల నుండి గుడ్లను పెట్టడం మొదలు పెట్టి, 22 వారాల వయసు వరకూ పెడ్తూనే ఉంటాయి.
  3. సాధారణంగా రోజు లోని సాయంత్రం సమయంలో కౌజు పిట్టలు గుడ్లు పెడ్తాయి.
  4. కౌజు పిట్టల గుడ్లు సామాన్యంగా సుమారు 9 – 10 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.
  5. మాములుగా, మగ కౌజు పిట్ట ఛాతీ చిన్నగాఉండి, గోధుమ రంగు మరియు తెల్లటి ఈకలతో సరిసమానంగా కప్పబడి ఉంటుంది. కాని, ఆడ కౌజు పిట్ట ఛాతీ వెడల్పుగా ఉండి, గోధుమ రంగు ఈకలు, వాటిపై నల్లని చుక్కలతో ఉంటుంది.
  6. ఆడ మరియు మగ కౌజు పిట్టలు, నాలుగు వారాల వయసులో వేరు చేయ బడాలి.
  7. గుడ్లు పెట్టె కౌజు పిట్టలకి, రోజుకు 16 గంటల కాంతి అవసరం.

కౌజు పక్షుల పిల్లల పెంపకం

సామాన్యంగా, ఒక రోజు వయసు గల కౌజు పిట్ట పిల్ల 8 – 10 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. అందువలన, కౌజు పక్షి పిల్లలకు ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. చాలినంత ఉష్ణోగ్రత లేకపోవడం, వేగంగా వీచే చల్లటి గాలులకు గురికావడం వలన, పిల్లలు గుంపుగా చేరతాయి. దీని వలన ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది.

పునరుత్పత్తి

  • ఏడు వారాల వయసులో, కౌజు పిట్టలు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 8వ వారం వయసులోనే 50 శాతం గుడ్లు ఉత్పత్తి చేసే స్ధితికి చేరుకుంటాయి.
  • శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం, 8 – 10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచబడాలి.
  • మగ, ఆడ కౌజు పిట్టల నిష్పత్తి 1 : 5
  • కౌజు పిట్టలతో గుడ్లు పొదగ బడే సమయం 18 రోజులు
  • 500 ఆడ కౌజు పిట్టలతో, మనం వారానికి 1500 కౌజు పిట్టల పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.

కౌజు పిట్టలకు వచ్చే వ్యాధులు

  • సంతానోత్పత్తి దశలో ఉన్న కౌజు పిట్టలలో ఖనిజలవణాలు (minerals) మరియు విటమిన్లు (vitamins) లోపం ఉంటే, వాటి గుడ్ల నుండి పొదగబడిన పిల్లలు సాధారణంగా సన్నగా, బలహీనమైన కాళ్ళతో ఉంటాయి. ఇది జరగకుండా ఉండడానికి, గుడ్లు పెట్టబోయే ఆడ కౌజు పిట్టలకు సరిపడినంత ఖనిజలవణాలు (minerals) విటమిన్లను వాటి మేతతో కలిపి యివ్వాలి
  • కోడి పిల్లల కంటే సాధారణంగా కౌజు పిట్టలకు రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. అందువలన, రోగనిరోధక టీకాలు కౌజు పిట్టలకు వేయవలసిన అవసరం లేదు.
  • కౌజు పిట్టల పిల్లలను సక్రమంగా పెంచడం, పెంపక కేంద్రం వద్ద అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడడం, పరిశుభ్రమైన త్రాగునీరు, మంచి ప్రమాణాలు గల మేతను అందచేయడం వలన, కౌజు పిట్టల పెంపకం కేంద్రంలో వ్యాధులు ప్రబలవు.

కౌజు పిట్ట మాంసం








బ్రతికి ఉన్న కౌజు పిట్టలో 70 – 73 శాతం బరువు, కౌజు పిట్ట మాంసం కలిగి ఉంటుంది. సాధారణంగా, 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుండి 100 గ్రాముల కౌజు పిట్ట మాంసం వస్తుంది .

కౌజు పిట్టల పెంపకంలో ఎదురయ్యే సవాళ్ళు

  • మగ కౌజు పిట్టలు సామన్యంగా, విచిత్రమైన శబ్దాలు చేస్తాయి. అవి మనుష్యులకి చికాకు కలిగిస్తాయి.
  • మగ, ఆడ కౌజు పిట్టలను కలిపి పెంచినప్పుడు, మగ పక్షులు ఆడ పక్షులను ముక్కుతో పొడిచి గుడ్డి వాటిని చేస్తాయి. కొన్ని సమయాల్లో కౌజు పిట్టలు చనిపోవడం కూడ సంభవిస్తుంది.