Showing posts with label goat farming. Show all posts
Showing posts with label goat farming. Show all posts

Saturday, 14 December 2019

మేకపిల్లల పెంపకం :


  • మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంద్ర్హాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి.
  • మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాయిల్ ను చల్లాలి.
  • ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రోజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు)
  • ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి నిచ్చే ఆంటి బాడీలు, విటమున్లు ఎక్కువగా వుంటాయి. మొదటిసారి ముర్రు పాలను జన్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాగించాలి.
  • రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చి మేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి.
  • మేక పిల్లలు రెండు వారాలు దాటగానే వాటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతి రోజు 100 గ్రా. చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి.
  • మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి.
  • మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి.
  • మేక పిల్లల షెడ్ లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పొడి సున్నం చల్లాలి.
  • మూడు మాసాల వయసు దాటిన మేకపిల్లకు నట్టల నిర్మూలన మందులు త్రాగించాలి.
  • ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.
  • పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకొట్టాలి, దీని వలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.

విత్తనపు మేకపోతుల పోషణ

మేకల్లో సంపర్కం :


  • మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలుండాలి.
  • ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి.
  • మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి.
  • మేకలు ఎదలో 1-3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమీ చేసిన మేకపోతును వదలాలి. ఇది ఎదలో వున్న మేకలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
  • ఎదలో వున్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మేకలకు సరిపోతుంది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి,కడప.

Saturday, 27 June 2015

goat farming

భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతి ప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి.

ఎవరు మొదలుపెట్టవచ్చు?

  • చిన్న మరియు సన్నకారు రైతులు
  • భూమి లేని రైతుకూలీలు
  • అందరికీ అందుబాటులో ఉండే పచ్చికబయళ్ళు ఉన్న ప్రదేశాలలో

మొదలు పెట్టేందుకు గల కారణాలు

  • ఎక్కువ మొత్తంలో పెట్టుబడి,త్వరగా వచ్చే లాభాలు
  • చిన్న,మరియు సాధారణ పాక సరిపోతుంది
  • పాకలో ఉంచి పెంచే పద్ధతి లాభదాయకము
  • అధికఫలవంతమైన మేకల ఉత్పాదకత
  • ఏడాది పొడవునా పని | ఉపాధి వుంటుంది
  • పలుచని మాంసం,తక్కువ క్రొవ్వుపదార్ధాలు వుండటంతో,అందరూ ఇష్టపడతారు.
  • ఎప్పుడైనా వెంటనే అమ్మి సొమ్ముచేసుకొనవచ్చు.

ఏజాతివి మీకు సరైనవి?

జమునాపరి
  • సాధారణంగా కాస్త ఎత్తుగా ఉంటుంది.
  • బలమైన,వంపుదిరిగినముక్కు, సుమారు 12 అంగుళాల పొడవుండే ఊగులాడే చెవులు బాగా ఎదిగిన జమునాపరి మేకలకు ఉంటాయి.
  • మేకపోతు 65-85 కిలోగ్రాములు, ఆడ మేక 45-60 కిలోగ్రాములు తూగుతాయి
  • ప్రతి ఈతకూ ఒక మేక ఆరు నెలలవయసున్న మేకపిల్ల సుమారు 15 కిలోగ్రాముల బరువుంటుంది.
  • రోజుకి 2-2.5 లీటర్ల పాలనిస్తాయి





తెల్లిచెరి
  • మేకలు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి
  • ప్రతి ఈతకూ 2-3 పిల్లలు
  • మగమేక 40-50 కిలోగ్రాములు, ఆడగొర్రె 30 కిలోగ్రాములు తూగుతాయి






బోయర్
  • మాంసం కోసం ఈజాతిని ప్రపంచమంతా పెంచుతున్నారు
  • అత్యంతశీఘ్రంగా ఎదుగుతాయి
  • మగమేక 110-135 కిలోగ్రాములు, ఆడమేక 90-100 కిలోగ్రాములు, తూగుతాయి
  • మేకపిల్లలు 90 రోజుల్లో 20-30 కిలోగ్రాములు తూగుతాయి

పెంపకం కోసం మేకల ఎంపిక






ఆడమేక
  • ప్రతి ఈతకు 2-3 పిల్లలు కలగాలి
  • 6 - 9 నెలలకు ఎదకు వచ్చి ఉండాలి
మేకపోతు
ఎత్తుగా,విశాలమైన ఎదురురొమ్ముతో నాజూకయిన శరీరం తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో తోడుకోసం తయారవుతాయి ఆరునెలల వయసున్న పిల్లలను శరీరం బరువు చూసి ఎంపికచేసుకోవాలి. ప్రతి ఈతకు 2-3 పిల్లల నిచ్చే తల్లిమేక నుంచి ఎంపికచేసుకోవాలి.

మేకల పెంపకం

భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి.

ఎవరు మొదలుపెట్టవచ్చు?

  • చిన్న మరియు సన్నకారు రైతులు
  • భూమి లేని రైతుకూలీలు
  • అందరికీ అందుబాటులో ఉండే పచ్చికబయళ్ళు ఉన్న ప్రదేశాలలో

మొదలు పెట్టేందుకు గల కారణాలు

  • ఎక్కువ మొత్తంలో పెట్టుబడి,త్వరగా వచ్చే లాభాలు
  • చిన్న,మరియు సాధారణ పాక సరిపోతుంది
  • పాకలో ఉంచి పెంచే పద్ధతి లాభదాయకము
  • అధికఫలవంతమైన మేకల ఉత్పాదకత
  • ఏడాది పొడవునా పని | ఉపాధి వుంటుంది
  • పలుచని మాంసం,తక్కువ క్రొవ్వుపదార్ధాలు వుండటంతో,అందరూ ఇష్టపడతారు.
  • ఎప్పుడైనా వెంటనే అమ్మి సొమ్ముచేసుకొనవచ్చు.

ఏజాతివి మీకు సరైనవి?

జమునాపరి
  • సాధారణంగా కాస్త ఎత్తుగా ఉంటుంది.
  • బలమైన,వంపుదిరిగినముక్కు, సుమారు 12 అంగుళాల పొడవుండే ఊగులాడే చెవులు బాగా ఎదిగిన జమునాపరి మేకలకు ఉంటాయి.
  • మేకపోతు 65-85 కిలోగ్రాములు, ఆడ మేక 45-60 కిలోగ్రాములు తూగుతాయి
  • ప్రతి ఈతకూ ఒక మేక ఆరు నెలలవయసున్న మేకపిల్ల సుమారు 15 కిలోగ్రాముల బరువుంటుంది.
  • రోజుకి 2-2.5 లీటర్ల పాలనిస్తాయి
తెల్లిచెరి
  • మేకలు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి
  • ప్రతి ఈతకూ 2-3 పిల్లలు
  • మగమేక 40-50 కిలోగ్రాములు, ఆడగొర్రె 30 కిలోగ్రాములు తూగుతాయి
బోయర్
  • మాంసం కోసం ఈజాతిని ప్రపంచమంతా పెంచుతున్నారు
  • అత్యంతశీఘ్రంగా ఎదుగుతాయి
  • మగమేక 110-135 కిలోగ్రాములు, ఆడమేక 90-100 కిలోగ్రాములు, తూగుతాయి
  • మేకపిల్లలు 90 రోజుల్లో 20-30 కిలోగ్రాములు తూగుతాయి

పెంపకం కోసం మేకల ఎంపిక

ఆడమేక
  • ప్రతి ఈతకు 2-3 పిల్లలు కలగాలి
  • 6 - 9 నెలలకు ఎదకు వచ్చి ఉండాలి
మేకపోతు
ఎత్తుగా,విశాలమైన ఎదురురొమ్ముతో నాజూకయిన శరీరం తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో తోడుకోసం తయారవుతాయి ఆరునెలల వయసున్న పిల్లలను శరీరం బరువు చూసి ఎంపికచేసుకోవాలి. ప్రతి ఈతకు 2-3 పిల్లల నిచ్చే తల్లిమేక నుంచి ఎంపికచేసుకోవాలి.

ఆహారపు నిర్వహణ

  • పచ్చికబయళ్లలో మేతతోపాటుగా శ్రద్ధగా పెట్టే దాణావల్ల ముమ్మరమైన ఎదుగుదల మాంసకృత్తులు సమ్మృద్ధిగా లభించే తుమ్మ,కస్సవె,లెకుయర్ని లాంటి ఆకుపచ్చటి దాణావల్ల ఆహారరూపములో నత్రజని బాగా లభిస్తుంది.
  • రైతులు పొలం గట్లవెంబడి అగతి,సుబాబుల్,గ్లారిసిదియ చెట్లను పెంచి ఆకుపచ్చటి దాణాగా వాడవచ్చు.
  • ఒక్క ఎకరం చేలో పండించే చెట్లు,ఇతరదాణా మొక్కలు 15-30 మేకలకు ఆహారంగా సరిపోతాయి
మిశ్రమదాణాన్ని ఇలా తయారు చెయ్యవచ్చు

దినుసులు
పిల్లల దాణా
ఎదుగుదలకు దాణా
పాలిస్తున్న మేకకు దాణా
సూడిమేకకు దాణా
మొక్కజొన్న
37
15
52
35
కాయధాన్యాలు
15
37
---
---
తెలకచెక్క
25
10
8
20
గోధుమ తవుడు
20
35
37
42
ఖనిజమిశ్రమం
2.5
2
2
2
ఉప్పు
0.5
1
1
1
మొత్తం
100
100
100
100
పిల్లలకు మొదటి పది వారాలు 50- 100 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. ఎదుగుతున్న వాటికి 100 -150 ద్రావణాన్ని ప్రతిరోజూ 3-10 నెలలపాటు ఇవ్వాలి. సూడి మేకలకు రోజూ 200 గ్రాముల ద్రావణాలను ఇవ్వాలి. ఒక కిలోగ్రాము పాలిస్తున్న మేకలకు 300 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. మేకలపాకల్లో ఖనిజాలదిమ్మలను మంచిరాగితో ( 950-1250 పిపియం) ఏర్పాటు చెయ్యాలి.

సంతతివృద్ధి నిర్వహణ





లాభదాయకమైన సంతతివృద్ధికి రెండేళ్ళకు మూడు ఈతలుండాలి శీఘ్రంగా ఎదిగే, భారీ పరిమాణములోని మేకలను సంతతివృద్ధికి వాడుకోవాలి. ఏడాది ఈడున్న ఆడమేకలను సంతతివృద్ధికి వాడాలి.
గర్భందాల్చాక ఆడమేక మూడు నెలలలోగా ఈనాలి. అలాగయితేనే రెండేళ్ళకు మూడుసార్లు ఈనుతాయి
మేకలు రమారమి ప్రతి 18 నుండి 21 రోజుల కొకసారి ఎదకొస్తాయి ఇది 24-72 గంటలపాటు ఉంటుంది
ఎదకొచ్చిన మేకలు ఎక్కువగా అరుస్తుంటాయి, కొన్ని బాధతోకూడిన కూతలు పెడుతుంటాయి. తోకను ఒక వైపు నుంచి మరొక వైపుకు ఆపకుండా ఊపుతూ ఉండటం ఎదకొచ్చిన వాటి లక్షణాలలొ మరొకటి. అదనంగా యోని రంధ్రం వాచినట్టు, ఎర్రగా కనిపిస్తుంది, మరియు యోనిస్రావాల వల్ల, తోకచుట్టూ తడిగా, మురిగ్గా కనిపిస్తుంది. దాణామీద యావ తగ్గి తరచూ మూత్రవిసర్జన చేస్తుంటాయి. ఎదకొచ్చిన ఆడమేక మరొక ఆడమేక, మగమేకలాగా మీద ఎక్కటమో, లేదా మరొక ఆడమేక ను తనమీద ఎక్కనివ్వటమో చేస్తుంటాయి.
  • ఎదకొచ్చిన 12-18 గంటలలో ఆడమేకను జతకట్టించవచ్చు.
  • కొన్ని ఆడమేకలలో ఎద లక్షణాలు 2-3 రోజులపాటు కొనసాగుతాయు, కాబట్టి వాటిని ఆ మరుసటి రోజు జతకట్టించవచ్చు.
  • గర్భధారణ సమయం రమారమి 145-150 రోజులు కానీ ఒకవారము అటూ ఇటూ కావడము సహజం,కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.

పొట్టలోని పురుగుల నిర్మూలన

చూలుకు ముందు ఆడమేకల పొట్టలోని పురుగుల నిర్మూలనం చెయ్యాలి పిల్లలకు ఒకనెల వయసులో పొట్టలోని పురుగుల నిర్మూలనం చెయ్యాలి. పురుగుల జీవితచక్రం మూడువారాలు కావున,రెండో నెలప్పుడు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించటం శ్రేయస్కరం.
ఈనేందుకు 2-3వారాల ముందు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించాలి. గర్భస్రావం జరక్కుండా ఉండేందుకు చూలుతొలినాళ్ళలో(రెండు మాసాలలోపు)ని ఆడమేకలకు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించరాదు.

వ్యాధి నిరోధక టీకాలు వేయించటం

పిల్లలకు ఎనిమిదివారాల వయసులో, మరలా పన్నెండువారాలకు ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.
ఆడమేకలకు చూలుకు 4-6 వారాల ముందు,ఈనిన తర్వాత 4-6 వారాలకు ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.
మేకపొతులకు ఏడాదికి ఒకసారి ఎంటెరోటాక్సేమియా మరియు టెట్నస్ వ్యాధినిరోధకటీకాలు వేయించాలి.

మేకలకు ఆవాసాలు

1. డీప్ లిట్టర్ పద్ధతి
  • ఒక చిన్న మేకలమందకు ఎదురెదురుగా గాలిప్రసారం జరిగేలా ఉండే ఒక చిన్నపాక సరిపోతుంది.
  • లిట్టర్ఎత్తు కనీసం ఆరు సెంటీమీటర్లు ఉండాలి.
  • రంపపుపొట్టు,వరి ఊక,వేరుశెనగతొక్కల తోలిట్టర్ ఉండవచ్చు.
  • పశువులపాకలోని ఘాటువాసనను పోగొట్టేందుకు తరచూ..... ముడిసరకును త్రిప్పుతుండాలి
  • లిట్టర్ ముడిసరకును రెండు వారాలకొకసారి మారుస్తుండాలి.
  • ఒక్కొక మేకకు 15చదరపు అడుగుల స్థలం కావాలి.
  • బయటనుంచి పరాన్నజీవులతోవ్యాధులు సంక్రమించకుండా తగుశ్రద్ధతీసుకోవాలి
  • ఎదిగిన ఒక్కొక్క మేక ఏడాదికి ఒక టన్ను ఎరువును ఉత్పత్తిచేస్తుంది.
2. ఎత్తైన అరుగు విధానము
  • నేలమట్టానికి3-4 అడుగుల ఎత్తున చెక్కపలకను గాని,తీగఉట్టిని ఉంచాలి.
  • ఈ పద్ధతివల్లబాహ్యపరాన్నజీవులతాకిడి తక్కువగా ఉంటుంది.





పెంపకం పద్ధతులు


1. అర్ధ సాంద్ర పద్ధతి
  • పచ్చిక బయళ్ళు తక్కువగా ఉన్నచోట, మేకలకు మేతతర్వాత, ముమ్మరంగా ఆకుపచ్చదాణా, ద్రావణాలనివ్వాలి
2. సాంద్ర పద్ధతి
  • పాకలోని మేకలకుఆకుపచ్చదాణా,ద్రావణాలనివ్వాలి
  • బయళ్ళలో తిప్పకూడదు
  • పాక డీప్ లిట్టర్ పద్ధతిలో గాని,ఎత్తైన అరుగు పద్ధతిలో గాని ఉండొచ్చు

మేకలభీమా

  • నాలుగవ నెల వయసు నుంచి సాధారణ భీమా కంపీనీలచే మేకలను భీమా చేయించవచ్చు.
  • వ్యాధులతోగానీ, ప్రమాదవశాత్తు గాని చనిపోతే భీమా సొమ్మును కోరవచ్చు.

భారతదేశములో మేకల పెంపకకేంద్రాలు

  • నాడుర్ మేకల పెంపకకేంద్రం
  • శివాజీ పార్క్ మేకల పెంపకకేంద్రం
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

మేకల పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు

వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి, సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఒక వేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది.పైగా జిల్లాలో అతివృష్టి, అనావృష్టి సమస్య ైరె తులను నిత్యం వేధిస్తోంది.ఈ నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టిసారిస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని, ముఖ్యంగా మేకల పెంపకం మంచి ఆదాయాన్నిస్తుందని పశుసంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎన్ రజనీకుమారి పేర్కొన్నారు. మేకల పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆమె వివరించారు.
మేకలను ఇలా మేపుకోవచ్చు
మేకలు స్వల్ప ఆహారం ఎక్కువసార్లు తీసుకుంటాయి.త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడా మేతను అందించాలి.రోజుకు 8-10 గంటల వరకు మేకలను మేపాల్సి ఉంటుంది.మేకలు ఉంచే ప్రాంతం చుట్టూ ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి.ఇవి ఎక్కువగా ఆకులు, అలములు, పండ్లు, తొక్కలు, కూరగాయల ఆకులను తింటాయి.అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్ మొదలైనవి నాటుకుని వాటి నుంచి ఆకులను కోసి మేపుతుండాలి.వీటితోపాటు కాయ జాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి.పచ్చి మేత వేసేటప్పుడు మూడు కిలోల ఇతర పశుగ్రాసాలను ఇవ్వాలి.
పిల్లల పోషణ ఇలా...
మేక పిల్లల పోషణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై పొరలను తీసివేయాలి.బొడ్డుకు టింకర్ అయోడిన్ పూయాలి.పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10 శాతం ఫినాయిల్ చల్లాలి.ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు తాగించాలి.ముర్రుపాలు బాగా తాగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు పాలు తాగించాలి.మొదటిసారి ముర్రుపాలను పుట్టిన ఆరుగంటల వ్యవధిలో తాగించాలి.
రెండు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి.తర్వాత తల్లి నుంచి వేరు చేసి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి.రెండు వారాల సమయంలో 10 గ్రాముల దాణా ఇవ్వాలి.పిల్లల షెడ్ లేదా పాక శుభ్రంగా ఉంచాలి.అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవుతాయి.షెడ్లు లేదా పాకల్లో ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేయాలి.ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి.మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు, లవణ మిశ్రమం ఉండేలా చేయాలి.
విత్తన మేకపోతుల పెంపకం
విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి.వసతి కల్పించాలి.ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దాణా ఇవ్వాలి.మేకలను దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాములు ఇవ్వాలి.రోజూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పోతులు, పెద్ద మేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 శాతం మొక్కజొన్నలు, 50 శాతం వేరుశనగ పిండి, 20 శాతం గోధుమ పొట్టు, 20 శాతం తవుడు, 18 శాతం బియ్యం నూకలు, జొన్నలు, సజ్జలు, రెండు శాతం లవణ మిశ్రమం, ఒక భాగం ఉప్పు ఉండాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావాల్సిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమం తయారు చేసుకోవచ్చు.
సకాలంలో టీకాలు వేయించాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి.ఈ పరిస్థితుల్ల తినే గడ్డి, ఇతర ఆకులతో పాటు ఏలిక పాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి పిప్పి చేస్తాయి.దీంతో మేకలు అనారోగ్యానికి గురై మరణించే ప్రమాదం ఉంది.సకాలంలో టీకాలు వేయించాలి.మూడు నెలలు దాటిన తర్వాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి.ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరరీంలో రక్తాన్ని పీల్చుతాయి.వీటి నివారణకు పశువైద్యాధికారిని సంప్రదించి వారు సూచించిన మందులను వాడాలి.మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులకు చిక్కంలాగా ఉట్టి లాంటి తాడు కట్టాలి.అలా చేయకపోతే మందును నాలుకతో నాకే ప్రమాదం ఉంది.