Saturday, 27 June 2015

టర్కీ కోళ్ల పెంపకం

టర్కీ కోళ్ల పెంపకం



మన భారత దేశంలో టర్కీ కోళ్ళ జాతులు

టర్కీ కోళ్ళ రకాలు ఇవీ:
  1. బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్:
    నిజానికి ఈ రకం టర్కీ కోళ్ళ ఈకలు కంచు(బ్రాంజ్) రంగులో కాక, నల్ల రంగులో వుంటాయి. ఆడ కోళ్ళకు రొమ్మువద్ద తెల్ల మొనలున్న నల్లని ఈకలుంటాయి. కేవలం 12 వారాల వయసుకే అది ఆడకోడి అని గుర్తించడానికి ఇవి తోడ్పడతాయి.
  2. బోర్డ్ బ్రెస్టెడ్ వైట్:
    ఈ రకం బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ కోడి మరియు సాంకర్యం వల్ల తెల్ల ఈకల వైట్ హాలండ్ కోడి, కలిగే సంకరజాతి టర్కీ కోఢి. ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి కనుక, భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఈ తెల్ల ఈకల కోళ్ళు బాగా అనువుగా వుంటాయనిపిస్తుంది. ఇంతేకాకుండా, ఈకలు తీసి, డ్రెస్సింగ్ చేసిన కోడి శుభ్రంగా, చూడడానికి ఇంపుగా వుంటుంది.
  3. తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె:
    రంగులో, ఆకారపు తీరులో ఇది , బోర్డ్ బ్రెస్టెడ్ వైట్ రకం కోడిని బాగా పోలివుంటుంది. అయితే, సైజులో చిన్నదిగా వుంటుంది. బరువైన రకాలతో పోలిస్తే, గుడ్లు పెట్టగలగడంలో, గుడ్ల ఉత్పత్తిలో, పొదగడంలో ఇవి మేలనిపిస్తాయి. అయితే, పొదిగిన తర్వాత మొదటి 4 వారాలలోపు తన పిల్లల ఆలన పాలన చూసుకునే (బ్రూడింగ్) విషయంలో మాత్రం ఈ రకం కోళ్ళు మెరుగు కాదనిపిస్తాయి.
  4. నందనం టర్కీ 1:
    నందనం టర్కీ 1 అనేది, దేశవాళీ నల్లకోడి, మరియు విదేశీ రకానికి చెందిన తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె కోడి సాంకర్యంవల్ల పుట్టే సంకరజాతి కోడి. తమిళనాడు వాతావరణ పరిస్థితులకు ఇది అనువుగా వుంటుంది.

టర్కీ కోళ్ళ పెంపకంలో ఆర్ధికాంశాలు

పుంజుపెట్ట నిష్పత్తి
1:5
గుడ్డు సగటు బరువు
65 గ్రాములు
అప్పుడే పుట్టిన కోడిపిల్ల సగటు బరువు
50 గ్రాములు
జత కలవడానికి శారీరక ఎదుగుదల వయసు (మెచ్యూరిటి)
30 వారాలు
సగటు గుడ్ల సంఖ్య
80 - 100
పొదగడానికి పట్టే సమయం
28 రోజులు
20 వారాలకు సగటు బరువు
పుంజు …………………………………….. 
పెట్ట…………………………………………
7 - 8 కిలోలు
4.5-5.0 కిలోలు
గుడ్లు పెట్టే వ్యవధి
24 వారాలు
అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) వయసు
పుంజు …………………………………….. 
పెట్ట…………………………………………
14 - 15 వారాలు
17 - 18 వారాలు
అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) బరువు
పుంజు …………………………………….. 
పెట్ట…………………………………………
7.5 కిలోలు
5.5 కిలోలు
ఆహార సామర్ధ్యం
2.7 - 2.8
అమ్మదగిన (మార్కెట్‌చేయదగిన) వయసు వరకు సగటున తినే దాణా 
పుంజు …………………………………….. 
పెట్ట…………………………………………

24-26 కిలోలు
17-19 కిలోలు
మొదటి 4 వారాలలోపు చనిపోయే కోడిపిల్లల శాతం
3 - 4 %

టర్కీ కోళ్ళ పెంపకంలో యాజమాన్య పద్ధతులు


పొదగడం

టర్కీ జాతి కోళ్ళు పొదగడానికి పట్టే కాలం 28 రోజులు. పొదగడం రెండు రకాలు.

ఎ) ప్రకృతి సహజంగా, కోడిపెట్ట పొదగడం.

టర్కీలు పొదిగే విషయంలో పేరుపొందినవి. పొదిగే పెట్ట ఒకేసారి 10 - 15 గుడ్లను పొదుగుతుంది. గుడ్ల పొదుగుదల 60 - 80 శాతం వరకు వుండి, పిల్లలు ఆరోగ్యవంతంగా వుండాలంటే, గుడ్డు ఆకారము, గుడ్డు పై పెంకు బాగా వుండి, శుభ్రంగా వుండే గుడ్లను మాత్రమే పొదగడానికి వుంచాలి.

బి) కృత్రిమంగా పొదగడం

గుడ్లను ఇంక్యుబేటర్లలో వుంచి యాంత్రికంగా పొదగడాన్ని, కృత్రిమంగా పొదగడం అంటారు. ఇంక్యుబేటర్ లోని సెట్టర్ హాచర్ లో వుండవలసిన ఉష్ణోగ్రత, గాలిలో తేమ వివరాలు.
ఉష్ణోగ్రత (ఫారన్ హీట్ డిగ్రీలు)గాలిలో తేమ (శాతం)
సెట్టర్ - 99.5
61-63
హాచర్ - 99.5
85 - 90
రోజూ ప్రతి గంటకొకసారి గుడ్లను పై భాగం కిందికి, కిందిభాగం పైకి తిప్పాలి. తడిలేకుండా చూడడానికి, గుడ్లు పగలకుండా నివారించడానికి, ఎక్కువ శాతం గుడ్లనుంచి పిల్లలు రావడానికి వీలుగా తరచుగా గుడ్లను సేకరించాలి.

బ్రూడింగ్

పుట్టిన దగ్గర నుంచి 4 వారాలపాటు తగినంత వేడిసోకే ప్రత్యేకమైన ఏర్పాటుతో కోడిపిల్లలను పెంచడాన్ని బ్రూడింగ్ అంటారు. టర్కీ కోళ్ళ విషయంలో బ్రూడింగ్ 0 - 4 వారాలపాటు వుంటుంది. అయితే, శీతా కాలంలో, ఇది మరికొంత పెరిగి, 5 - 6 వారాల వరకు వుంటుంది. దేశవాళీ కోడిపిల్లలతో పోలిస్తే, టర్కీ పిల్లలకు కూచోడానికి రెట్టింపు స్థలం అవసరమవుతుందనే విషయం మరచిపోకూడదు. టర్కీ పిల్లలను మొదటి రోజున పలుచటి ఎరుపురంగు (ఇన్ఫ్రా రెడ్) బల్బు కాంతిలో, లేదా గ్యాస్ బ్రూడర్ ద్వారా, లేదా సాంప్రదాయిక బ్రూడింగ్ పద్ధతులలో బ్రూడింగ్ చేయవలసి వుంటుంది.

బ్రూడింగ్ విషయంలో పాటించవలసిన అంశాలు

  • 0 - 4 వారాలపాటు ఒక్కొక్క టర్కీ కోడిపిల్లకు 1.5 చదరపు అడుగుల స్థలం (నేల) అవసరమవుతుంది
  • టర్కీ పిల్లలను తేవడానికి కనీసం రెండురోజులు ముందే, బ్రూడర్ గదిని సిద్ధం చేసుకోవాలి
  • నేలను తగినంత వేడిగా వుంచడానికి నేలపైన చల్లే పదార్ధాన్ని (లిట్టర్ మెటీరియల్) 2 మీటర్ల వ్యాసంలో గుండ్రగా చల్లాలి
  • వేడి సోకే ఎర్పాటు నుంచి పిల్లలు దూరంగా పోకుండా నివారించడానికి, కనీసం ఒక అడుగు ఎత్తున చుట్టూ కంచె వుండాలి
  • 95° ఫారన్ హీట్ ఉష్ణోగ్రతతో ప్రారంభించి, వారానికి 5° డిగ్రీల వంతున 4 వారాల వరకు తగ్గిస్తూ పోవాలి
  • నీరు పెట్టడానికి ఎక్కువ లోతులేని పాత్రలు వాడాలి
మొదటి నాలుగు వారాలలో సగటున 6 - 10% టర్కీ పిల్లలు చనిపోతాయి. పుట్టిన కొద్దిరోజులపాటు కోడిపిల్లలు తినడానికి, తాగడానికి సాధారణంగా ఇష్టపడవు. ఆ లేత వయసులో వాటి కంటి చూపు సరిగా వుండకపోవడం, అవి కొంత బెదురుతూ వుండడం ఇందుకు కారణం. అందువల్ల వాటిని బలవంతంగా తినిపించాలి.

బలవంతంగా తినిపించడం

బొత్తిగా ఆహారం తీసుకోకపోవడమనేది లేత వయసులో కోడిపిల్లలు చనిపోవడానికి ఒక ప్రధాన కారణం. అందువల్ల, వాటికి ఆహారం, నీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. బలవంతంగా ఆహారం అందించడంలో , మొదటి 15 రోజుల వరకు, లీటరు నీటికి 100 మిల్లీ లీటర్ల పాలు పట్టాలి. 10 పిల్లలకు ఒకటి వంతున ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. వాటి పోషణకు అవసరమైన మాంసకృత్తులను సమకూర్చడానికి, శక్తిని కలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి.
ఆహారం వున్న గిన్నెను వేళ్లతో నెమ్మదిగా తడుతూ, టర్కీ పిల్లలను దాణా వద్దకు రప్పించవచ్చు. దాణా పాత్రలలో, నీటి పాత్రలలో రంగు రంగుల గోలీలు వేసికూడా వాటిని ఆకర్షించవచ్చు. టర్కీలు ఆకుకూరలంటే ఎక్కువగా ఇష్టపడతాయి. అందువల్ల కత్తిరించిన ఆకులను కలిపిన దాణాను పెట్టడంవల్ల, అవి మరింత ఆహారం తీసుకునేలా చేయవచ్చు. మొదటి రెండురోజులపాటు కోడిగుడ్లను వుంచే రంగురంగుల ట్రేలను కూడా ఆహార పాత్రలుగా ఉపయోగించవచ్చు.

నేలను కప్పే (లిట్టర్) పదార్ధాలు

సాధారణంగా, రంపపుపొట్టు, వరి పొట్టు(ఊక), మెత్తటి కలప పీచు వంటివాటిని బ్రూడింగ్‌లో నేలను కప్పడానికి (లిట్టర్) వాడుతారు. వీటిని మొదట్లో 2 అంగుళాల మందంగా వేసి, రోజులుగడిచేకొద్దీ మందం పెంచుతూ 3 – 4 లింగుళాల మదం వరకు ఉంచచ్చు. ఈ పదార్ధాలు గట్టిపడిపోకుండా, వాటిని తరచు పైకి కిందికి మార్చుతుండాలి.

పెంపకం పద్ధతులు

టర్కీలను ఆరు బయట (ఫ్రీ రేంజ్) పెంచవచ్చు లేదా, గదిలో (ఇంటెన్సివ్ సిస్టం) లో పెంచవచ్చు

ఎ. ఆరుబయట పెంపకం

ఉపయోగాలు :
  • దాణా ఖర్చు సగం తగ్గుతుంది
  • పెట్టుబడి తక్కువ
  • ఖర్చు ఆదాయం నిష్పత్తి ఎక్కువ
ఆరు బయలు పద్ధతికింద, చుట్టూ కంచె వేసిన ఒక ఎకరా పొలంలో, 200 - 250 పెద్ద టర్కీలను పెంచవచ్చు. రాత్రి సమయంలో ఒక్కొక్క టర్కీకి 3 - 4 చదరపు అడుగుల వంతున అవి తలదాచుకోవడానికి వసతి కల్పించాలి. అవి చెత్తా చెదారం తినేటప్పుడు, శతృజంతువులు నుంచి వాటిని కాపాడాలి. నీడ మరియు చల్లగా వుండడానికి చెట్లు నాటితే మంచిది. పరాన్నజీవులవల్ల వ్యాధులు సోకకుండా, వాటిని అప్పుడప్పుడు ఒకచోటినుంచి మరోచోటికి మార్చుతుండడం అవసరం.

ఆరుబయలు పద్ధతిలో దాణా

టర్కీలు భూమిలోని పురుగులను, చెత్తాచెదారాన్ని బాగా తింటాయి. ఈ రకంగా, అవి వానపాములను, సూక్ష్మజీవులను, నత్తలను, చెదపురుగులను, వంటింటి వ్యర్ధపదార్ధాలను తినగలుగుతాయి. ఇవి అన్నీ మంచి మాంసకృత్తులు. ఇందువల్ల, దాణా ఖర్చు సగం కలిసి వస్తుంది. ఇవే కాకుండా, జనుము, స్టైలో, ఇతర పప్పుధాన్యపుజాతి మొక్కలనుకూడా వీటికి ఆహారంగా వేయవచ్చు. టర్కీలకు వచ్చే కాళ్ళ బలహీనతను, కుంటుపడడాన్ని కాల్షియం (సున్నం) వాడకంతో అరికట్టవచ్చు. ఆల్చిప్పలలో కాల్షియం ఎక్కువగా వుంటుంది. అందువల్ల, వారానికి ఒక్కొక్క టర్కీకి 250 గ్రాముల ఆల్చిప్పల వంతున ఇవ్వవలసి వుంటుంది. తిండి ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా 10 % ఆహారాన్ని కూరగాయల వ్యర్ధాల రూపంలో ఇవ్వవచ్చు.
ఆరోగ్య సంరక్షణ:
ఆరుబయలు పెంపకంలో టర్కీలకు ఆరోగ్యపరంగా, పొట్టలో ఏలికపాముల బెడద , బయట ఎర్రనల్లివంటి పురుగుల బెడద వుంటుంది. అందువల్ల టర్కీలు ఆరోగ్యంగా పెరగాలంటే, నెలకొకసారి నులిపురుగుల మందు (డివార్మింగ్, డిప్పింగ్) వాడడం తప్పనిసరి.
బి. షెడ్‌లో పెంపకం (ఇంటెన్సివ్ ఫార్మింగ్)
ప్రయోజనాలు:
  • గుడ్లుపెట్టే సామర్ధ్యం పెరుగుతుంది
  • మెరుగైన యాజమాన్యం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ
గదిలో పెంచడం:
  • గదిలో (షెడ్డులో) పెంచడంవల్ల టర్కీలకు, ఎండ, వాన, గాలి మరియు శతృ జీవులనుంచి రక్షణ లభిస్తుంది మరియు సౌకర్యంగా కూడా వుంటుంది.
  • మన దేశంలోని ఉష్ణప్రాంతాలలో, టర్కీల షెడ్ తూర్పు - పడమరలుగా (పొడవు) వుండడం అవసరం.
  • రెండు షెడ్ల మధ్య కనీసం 20 మీటర్ల దూరం వుండాలి; టర్కీ పిల్లల షెడ్, పెద్దటర్కీల షెడ్‌నుంచి కనీసం 50-100 మీటర్ల దూరంలో వుండాలి.
  • షెడ్ వెడల్పు 9 మీటర్లు మించరాదు.
  • గది ఎత్తు నేలనుంచి 2.6-3.3 మీటర్ల వరకు వుండవచ్చు.
  • వాననీరు షెడ్‌లోకి చిందకుండా, పైకప్పు గోడలపైన 1 మీటరు దిగువవరకు వుండేలా శ్రద్ధవహించాలి.
  • షెడ్ల నేల (ఫ్లోరింగ్) మన్నికగా, సురక్షితంగా వుంటూనే, చౌకగా వుండేలా చూడాలి. తేమపీల్చని కాంక్రీటు అయితే మేలు.
మందంగా లిట్టర్ పరచిన నేలపైన టర్కీలను పెంచడానికి సంబంధించిన సాధారణ యాజమాన్య పద్ధతులు, దేశవాళీ కోడిపిల్ల పెంపకంలో అనుసరించే మాదిరిగానే వుంటాయి. అయితే, టర్కీలు సాధారణ కోడిపిల్లలకంటె పెద్ద సైజులో వుంటాయికాబట్టి, అవి తిరుగాడే నేల విస్తీర్ణం, నీటి పాత్రలు, దాణా పాత్రల సైజు వాటికి అనువుగావుండేలా శ్రద్ధవహించాలి.

టర్కీలను పట్టడం

ఏ వయస్సు టర్కీలైన, వాటిని కర్రతో అదిలించి ఒకచోటినుంచి మరొకచోటికి తేలికగా పంపవచ్చు. టర్కీలను పట్టడానికి చీకటిగది అయితే మేలు. టర్కీని రెండుకాళ్లు పట్టుకుని పైకి ఎత్తాలి, ఇలా ఎత్తినందువల్ల వాటికి నొప్పివుండదు; అయితే, కూతకు వచ్చిన (మెచ్యూర్డ్) టర్కీని 3 - 4 నిమిషాలను మించి అలా తలకిందులుగా వేలాడేలా వుంచకూడదు.

టర్కీలకు అవసరమైన తిరుగాడే నేల, నీటి పాత్ర, దాణా పాత్ర పరిమాణాలు:

టర్కీ
వయస్సు
నేల విస్తీర్ణం
(చదరపు అడుగులు)
దాణా పాత్ర పొడవు (సెంటీమీటర్లు)
నీటిపాత్ర పొడవు (సెంటీమీటర్లు)
0-4 వారాలు
1.25
2.5
1.5
5-16 వారాలు
2.5
5.0
2.5
16-29 వారాలు
4.0
6.5
2.5
టర్కీ బ్రీడర్
5.0
7.5
2.5
టర్కీలు సహజంగా బెదురు స్వభావం కలవి . అందువల్ల అవి ఎప్పుడూ బెదిరిపోతుంటాయి. కాబట్టి, టర్కీలను పెంచే షెడ్‌లోకి ఇతరుల రాకపోకలను వీలున్నంత పరిమితంచేయాలి.

ముక్కు కత్తిరించడం

వాటి ఈకలు పీకుకోకుండా, తోటి టర్కీపిల్లలను చంపకుండా నివారించడానికి టర్కీ కోడిపిల్లల ముక్కు కత్తిరించడం అవసరం. పుట్టిన మొదటి రోజునైనా, 3 - 5 వారాల వయస్సులోనైనా సరే టర్కీల ముక్కు కత్తిరించవచ్చు. ముక్కు రంధ్రాలనుంచి ముక్కు పొడవులో సగం కత్తిరించవచ్చు.

ముక్కు కండను తొలగించడం (డి స్నూడింగ్)

టర్కీల ముక్కు మొదట్లో ముందుకు పొడుచుకు వచ్చినట్లుండే మాంసపు ముద్దను స్నూడ్ లేదా ద్యూబిల్ అంటారు. ఆ కండను పీక్కోవడంవల్లనో, పోట్లాటవల్లనో తలకు గాయంకాకుండా నివారించడానికి ఆ కండను తొలగించాలి. పుట్టిన మొదటిరోజున ఆ కండను వేలితో నొక్కి తొలగించవచ్చు; 3 వారాల వయసులో తలకు దగ్గరగా పదునైన కత్తెరతో దానిని కత్తిరించవచ్చు.

కాలి బొటనవేలి మొన అదిమివేయడం:

పుట్టిన మొదటిరోజున టర్కీ కాలి బొటన వేలి మొనను గోరుతో సహా, కాలి చివరివేలు సందులోకి నొక్కివేయాలి.

దాణా:

దాణా రెండురకాలుగా ఇవ్వవచ్చు. ఒకటి: దంచి ఇవ్వడం, రెండు: గుళికల రూపంలో ఇవ్వడం.
  • దేశవాళీ కోడిపిల్లలతో పోల్చిచూస్తే, టర్కీలకు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, శక్తిని ఇచ్చే పదార్ధాలు మరింతగా అవసరమవుతాయి
  • శక్తిని ఇచ్చే పదార్ధాలు, మాంసకృత్తులు అవసరమయ్యే పరిమాణం పుంజుకు ఒకరకంగా, పెట్టకు మరొక రకంగా వుంటుంది; అందువల్ల, వాటిని వేరువేరుగా పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు
  • దాణా పాత్రలోనే దాణాను వేయాలి; నేలమీద వేయకూడదు
  • ఒకరకమైన దాణాకు బదులు మరొక రకమైన దాణాఇవ్వవలసివస్తే, ఆ మార్పు క్రమేణా జరగాలి
  • టర్కీలకు శుభ్రమైన నీరు తెంపులేకుండా ఎప్పుడూ అందుబాటులో వుంచాలి
  • ఎండాకాలంలో మరిన్ని నీటిపాత్రలు పెట్టాలి
  • ఎండాకాలంలో పగటిపూట ఎండ తక్కువగావుండే వేళలలో దాణా మేపాలి
  • కాళ్లు చచ్చుబడిపోకుండా, ఒక్కొక్క టర్కీకి రోజుకు 30 - 40 గ్రాముల వంతున ఆల్చిప్పల పొడిని వేయాలి

మొక్కలు, గడ్డి మేపడం

షెడ్లలో పెంచే పద్ధతిలో, టర్కీకి మొత్తం దాణాలో 50 % మొక్కలను, ఆకులను దంచి ఇవ్వవచ్చు. ఏ వయసులో టర్కీకైనా, తాజా జనుము మొక్క మంచి బలవర్ధక ఆహారం. ఇంతేకాకుండా స్టైలో గడ్డిని, దేశ్‌మంతస్ మొక్కనుకూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపి దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు.

టర్కీ బరువు మరియు దాణా పరిమాణం

వయస్సు
(వారాలలో)
టర్కీ సగటు బరువు
(కిలోలు)
పుంజు పెట్ట
తినే మొత్తం దాణా (కిలోలు)
పుంజు పెట్ట
ఆ స్థాయి వరకు మొత్తం దాణా సామర్ద్యం
పుంజు పెట్ట
4 వారాల వరకు
0.72 0.63
0.95 0.81
1.3 1.3
8 వారాల వరకు
2.36 1.90
3.99 3.49
1.8 1.7
12 వారాల వరకు
4.72 3.85
11.34 9.25
2.4 2.4
16 వారాల వరకు
7.26 5.53
19. 86 15.69
2.8 2.7
20 వారాల వరకు
9.62 6.75
28.26 23.13
3.4 2.9

పునరుత్పత్తి పద్ధతులు

సహజంగా జతకూడడం:

కోడి పుంజు జతకోసం ఆరాటపడే తీరును కూతకు రావడం (స్ట్రట్) అంటారు. ఆ సమయంలో అది తన రెక్కలను విచ్చుకుని, ప్రత్యేకమైన రీతిలో అరుస్తుంది. సహజంగా జతకూడే విషయంలో పుంజు : పెట్ట నిష్పత్తి మధ్యరకం టర్కీలైతే 1:5, పెద్దరకం టర్కీలయితే 1:3. జతకూడిన పెద్ద ఆడటర్కీ సగటున ఒక్కొక్కటి 40-50 గుడ్లు పెడుతుంది. ఏడాది వయస్సు నిండిన మగ టర్కీలలో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది, అందువల్ల వీటిని వీలున్నంతవరకు జతకూడడానికి ఉపయోగించకూడదు. ఎదిగిన మగ టర్కీలలో, ఏదో ఒక ఆడ టర్కీపట్ల మక్కువపెంచుకునే స్వభావం వుంటుంది; అందువల్ల మగటర్కీలను ప్రతి 15 రోజులకొకసారి మారుస్తుండాలి.

కృత్రిమ గర్భధారణ :

కృత్రిమ గర్భధారణవల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, టర్కీలలో మొత్తం సీజనంతా బాగా ఎక్కువగా పునరుత్పత్తి సామర్ధ్యం వుంటుంది.

ఎదిగిన టర్కీ పుంజునుంచి వీర్య సేకరణ

  • వీర్యసేకరణకు టర్కీపుంజు వయస్సు 32-36 వారాలు వుండాలి
  • వీర్య సేకరణకు కనీసం 15 రోజుల ముందునుంచి టర్కీ పుంజును విడిగా, ఒంటరిగా వుంచాలి
  • పుంజును ఒక క్రమపద్ధతిలో పట్టుకోవాలి, వీర్యసేకరణకు పట్టే సమయం 2 నిమిషాలు
  • టర్కీలు పట్టుకోబోతే చికాకుపడతాయి, అందువల్ల ఒకే వ్యక్తి ఎక్కువ వీర్యాన్ని సేకరించడానికి ఉపయోగించాలి.
  • వీర్యపు పరిమాణం సగటున 0.15-0.30 మిల్లీలీటర్లు
  • సేకరించిన వీర్యాన్ని గంటలోగా ఉపయోగించాలి
  • వారానికి మూడుసార్లు, లేదా రోజువిడిచి రోజు వీర్యాన్ని సేకరించాలి

పెట్టలకు కృత్రిమంగా వీర్యాన్ని ఎక్కించడం :

  • టర్కీ పెట్ట గుడ్ల ఉత్పత్తి 8-10శాతానికి చేరుకున్నప్పుడు కృత్రిమ గర్భధారణ జరపాలి
  • పెట్టకు ప్రతి మూడు వారాలకొకసారి 0.025-0.030 మిల్లీలీటర్ల వీర్యాన్ని (పలుచన చేయని)
  • ఎక్కించాలి
  • సీజన్‌లో 12 వారాల తర్వాత, ప్రతి 15 రోజులకొకసారి వీర్యం ఎక్కించడం మంచిది
  • సాయంత్రం 5 - 6 గంటల మధ్య పెట్టకు వీర్యం ఎక్కించాలి
  • 16 వారాల బ్రీడింగ్ సీజన్లో, 80-85 శాతం గర్భంనిలుస్తుంది

టర్కీలకు వచ్చే సాధారణ వ్యాధులు

వ్యాధి
కారణం
వ్యాధి లక్షణం
నివారణ
అరిజోనోసిస్
సాల్మోనెల్లా అరిజోనా
వ్యాధిసోకిన టర్కీలు గగ్గోలుగా వుంటాయి; వాటి చూపు మందగిస్తుంది, గుడ్డితనంకూడా రావచ్చు.
వ్యాధిసోకే వయస్సు 3-4 వారాల మధ్య
వ్యాధిసోకిన పుంజును (జతకలవడానికి ఉపయోగించే) హాచరీనుంచి తొలగించాలి, హాచరీలో క్రిములనుపోగొట్టే పొగవేయడం, శుభ్రంగా వుంచడం
నీలి దువ్వెన (బ్లూ కూంబ్) వ్యాధి
కొరోనా వైరస్
ముడుచుకుని వుండడం, బరువు తగ్గడం, నురగగా లేదా నీళ్ళగా రెట్ట వేయడం తల, చర్మం నల్లబడడం
టర్కీలను పెంచే షెడ్‌లో టర్కీల సంఖ్య తగ్గించాలి , అంటు వ్యాధులు రాకుండా షెడ్‌ను శుభ్రపరచాలి టర్కీలకు విశ్రాంతి ఇవ్వాలి
ఊపిరి తిత్తుల వ్యాధి
మైకోప్లాస్మా గలిసెప్టికం
దగ్గు, గురక, తుమ్ములు, ముక్కునుంచి కారడం
మైకోప్లాస్మా సోకని కోళ్ళను ఎంపికచేసుకుని పెంచుకోవాలి
ఎరిసిపెలస్
ఎరిసిపిలోథ్రిక్స్ రూసియోపాథిడే
ఉన్నట్టుండి పడిపోవడం, బరువు తగ్గడం., ముక్కు మొదట్లో పెరిగినకండ వుబ్బడం, ముఖం రంగుమారడం
టీకాలు వేయించాలి
కలరా (కోళ్ళకు వచ్చే కలరా) వ్యాధి
పాశ్చురెల్లా మల్టోసిడా
ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులో రెట్టవేయడం, ఉన్నట్టుండి చనిపోవడం
పారిశుద్ధ్యం, చనిపోయిన కోళ్ళ తొలగింపు
ఫౌల్ పాక్స్ (కోళ్ళకుసోకేమశూచి)
పాక్స్ వైరస్
పుంజు తలపైనవుండే ఎర్రని తురాయి పై సన్న పసుపు పచ్చని గుల్లలు రావడం, గొంతుకింద తిత్తిలాగా రావడం,
టీకాలు వేయించాలి
హెమరేజిక్ ఎంటెరిటిస్
(రక్త స్రావం)
వైరస్
ఒకటి లేదా మరిన్ని కోళ్ళు చావడం
టీకాలు వేయించాలి
ఇన్‌ఫెక్టియస్ సినోవిటిస్
మైకోప్లాస్మా గలిసెప్టికం
పాదాలు సాగడం, కుంటి తనం, రొమ్ముపైన గుల్లలు రావడం
జబ్బుసోకని కోళ్ళను కొనుగోలుచేయాలి
ఇన్‌ఫెక్టియస్ సైనసైటిస్
సూక్ష్మక్రిములు
ముక్కునుంచి కారడం, ముక్కు ఉబ్బడం, దగ్గు
జబ్బు సోకని హాచరీలనుంచి టర్కీలను కొనుగోలుచేయాలి
మైకోటాక్సికాసిస్
బూజు, శిలీంధ్ర కారకాలు
రక్త స్రావం , పాలిపోవడం , కాలేయం , మూత్రపిండాలు ఉబ్బడం
పాడైపోయిన దాణా ఇవ్వకూడదు
న్యూ కాజిల్ డిసీజ్
పారామైక్సో వైరస్
రొప్పడం, మెడ మెలితిరిగిపోవడం, పక్షవాతం, మెత్తని పెంకు కలిగిన గుడ్లుపెట్టడం
టీకాలు వేయించాలి
పారా టైఫాయిడ్
సల్మనెల్లా పుల్లోరం
విరేచనాలు , వాంతులు
వ్యాధిసోకకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం
టర్కీ కొరైజ
బోర్డ్‌టెల్లా అవియం
గుండె దడ, ముక్కునుంచి ఎక్కువగా కారడం
టీకాలు వేయించాలి
కోక్కిడియాసిస్
కోక్కిడియా
రక్త విరేచనాలు, బరువు పడిపోవడం
షెడ్ లో పారిశుద్ధ్యం సక్రమంగా వుండేలా చూడడం, లిట్టర్ సరిగావుండేలాచూడడం
టర్కీ జననేంద్రియ వ్యాధి
మైకోప్లాస్మా మెలీగ్రిస్
లైంగిక శక్తి, పొదిగే సామర్ధ్యం క్షీణించడం,
పారిశుద్ధ్యం కచ్చితంగా పాటించాలి

టీకాలు వేయించవలసిన తీరు

  • పుట్టిన మొదటిరోజు : ఎన్‌డి - బి1 స్ట్రైన్
  • 4వ, 5వ వారాలు: ఫౌల్ పాక్స్
  • 6వ వారం: ఎన్‌డి - (ఆర్2 బి)
  • 8-10 వారాలు: కలరా టీకాలు

టర్కీల మార్కెటింగ్

16 వారాలకు ఎదిగిన టర్కీ పుంజు బరువు 7.26 కిలోలు, టర్కీ పెట్ట బరువు 5.53 కిలోలు వుండాలి. టర్కీల మార్కెటింగ్‌కు ఈ బరువులు అనువైనవి.

టర్కీ గుడ్డు:

  • టర్కీలు 30 వ వారం నుంచి గుడ్లుపెట్టడం మొదలుపెడతాయి; మొదటి గుడ్డుపెట్టిన రోజునుంచి 24 వారాలపాటు అది గుడ్లుపెడుతుంటుంది
  • తగిన దాణా ఇస్తూ, కృత్రిమ కాంతి ప్రసారంలో పెంచితే, టర్కీకోళ్ళు ఏడాదికి 60-100 గుడ్ల వరకుకూడా పెడతాయి
  • దాదాపు 70 % గుడ్లు మధ్యాహ్న సమయంలోనే పెడతాయి
  • టర్కీ కోడి గుడ్లు, రంగుగా వుంటాయి, ఒక్కొక్కటి 85 గ్రాముల వరకు తూగుతాయి
  • గుడ్డు ఒక చివర గమనించదగినంతగా మొనదేలి, గట్టి పెంకుతో వుంటుంది
  • టర్కీ గుడ్డులో మాంసకృత్తులు, లిపిడ్ (కొవ్వు పదార్ధాలు), పిండిపదార్ధాలు, ఖనిజ లవణాల దామాషా క్రమంగా 13.1%, 11.8%, 1.7% , 0.8% వుంటుంది. ఒక గ్రాము పచ్చసొనలో కొలెస్టొరాల్ 15.67 - 23.97 మిల్లీ గ్రాములు వుంటుంది.

టర్కీ మాంసం:

టర్కీ మాంసం చాలా పలుచగా వుంటుంది, అందువల్ల వినియోగదారులు టర్కీ మాంసాన్ని ఇష్టపడతారు. వందగ్రాముల మాంసం లో మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు , శక్తి విలువ 24%,6.6%, 162 కేలరీలు. టర్కీ మాంసంలో పొటాషియం, కాల్షియం (సున్నం), మెగ్నీషియం ఇనుము, సెలెనియం, జింక్, సోడియం మొదలైన ఖనిజ లవణాలు వుంటాయి. శరీరానికి తప్పనిసరిగా కావలసిన యామినో ఆ మ్లా లు, నియాసిన్, బి6,బి12 వంటి విటమిన్లు టర్కీ మాంసంలో పుష్కలంగా వుంటాయి. అసంతృప్త (అన్ శాచ్యురేటెడ్) ఫాటీ ఆ మ్లా లు, శరీరానికి తప్పనిసరిగా కావలసిన ఫాటీ ఆమ్లాలు, ఎక్కువగా వుండడమేకాక, కొలెస్టొరాల్ తక్కువగా వుండడం మరొక విశేషం. 24 వారాల వయసులో 10 - 20 కిలోల బరువున్న టర్కీ పుంజును విక్రయించడం వల్ల, దాని పెంపకానికి అయిన 300 - 450 రూపాయల ఖర్చుపోను, 500 - 600 రూపాయల ఆదాయం వస్తుందని మార్కెట్ అధ్యయనం తెలియజేస్తున్నది. ఇదే విధంగా, 24 వారాల వయసున్న టర్కీపెట్ట అమ్మకం వల్ల 300 - 450 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇంతేకాక టర్కీలను కేవలం చెత్తాచెదారం తిని, లేదా మొత్తం దాణాలో కొంత చెత్తాచెదారం అందించి పెంచవచ్చు.
మరిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన చిరునామా:
డైరెక్టర్,
సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్),
హెస్సర్‌ఘట్ట, బెంగుళూర్ - 560088,
టెలిఫోన్ : 080-28466236 / 28466226
ఫాక్స్: 080-28466444.
ఇ మెయిల్:cpdosr@yahoo.com
వెబ్‌సైట్: http://www.cpdosrbng.kar.nic.in

No comments:

Post a Comment