మేపులో మెళకువలు
అధికోత్పత్తి సాధించాలంటే పశువులకు మంచి పోషక విలువలున్న ఆహారం మేపాలి.
- పాడి పశువుల పోషణ ఖర్చులో 60-70 శాతం మేపు కొరకు ఖర్చవుతుంది.
- మేపు గురించి శాస్త్రీయ పరిజ్ఞానం వుంటే, అందుబాటులో వున్నా దాణా దినుసులతో సమీకృత దాణా మిశ్రమాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని లాభదాయకంగా పశువులను పోషించుకోవచ్చు.
- పశువులకు ప్రతి 100 కిలో గ్రాముల శరీర బరువుకు 2 కిలోల పొడి పోషక పదార్ధములు కావాలి. ప్రతి కిలో పాల ఉత్పత్తికి 50 గ్రాముల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి. రోజుకు 7-9 లీటర్ల పాలిచ్చే పశువులు 7 కిలోల జీర్ణయోగ్యమైన పాడిపోషక పదార్ధములు, యిందులో 0.75 కిలోల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి.
- పచ్చిమేత స్వంత భూమిలో సాగు చేసుకొని పాడి పశువులకు మేపుకోవడం లాభదాయకం. పుష్పలంగా పచ్చిమేత మేపగల్గితే మామూలుగా కావలిసిన దాణాలో మూడవ వంతు తగ్గించుకోవచ్చు. 6-7 లీటర్ల పాలిచ్చే పశువులకు 1:3 నిష్పత్తిలో కాయజాతి, ధాన్యపుజాతి పచ్చిమేతలు కలిపి మేపగల్గితే ఎలాంటి దాణా ఖర్చులు లేకుండా పాల ఉత్పత్తిని తీయవచ్చు.
- పాడి పశువులకు అన్నిటికి ఒకే విధంగా మేపకుండా, వాటి పాల ఉత్పత్తిని అందుకు కావలిసిన పోషక పదార్ధాల అవసరాన్ని దృష్టిలో వుంచుకొని మేపు అందివ్వాలి.
- పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు త్రాగడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగడానికి యింతే మోతాదులో దానిని కడగడానికి శుభ్రతకు కావాలి. సుమారు ప్రతి పశువుకు రోజుకు 100 లీటర్ల నీరు కావలసి వస్తుంది.
లభించే దాణా దినుసుల అందుబాటుని బట్టి ఈ క్రింద సూచించిన దాణా మిశ్రమాలలో ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో ఏదైనా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో 68-70 శాతం జీర్ణయోగ్యమైన పోషక పదార్ధములు మరియు14 నుండి 16 శాతం జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు లభించును.
దాణా దినుసులు
|
1
|
2
|
3
|
4
|
5
|
6
|
1. జొన్నలు, మొక్కజోన్నవంటి ధాన్యము
|
30
|
20
|
20
|
30
|
40
|
30
|
2. గోధుమ పొట్టు, తవుడు
|
32
|
50
|
40
|
50
|
10
| |
3. గానుగపిండి
|
25
|
20
|
20
|
20
|
20
|
25
|
4. శనగ పొట్టు లేదా పెసర, మినుప పొట్టు
|
-
|
-
|
20
|
-
|
30
|
25
|
5. ప్రత్తి గింజల చెక్క
|
-
|
-
|
-
|
-
|
-
|
20
|
6. బెల్లపు మడ్డి
|
10
|
7
|
-
|
-
|
-
|
-
|
7. లవణ మిశ్రమాలు
|
3
|
3
|
3
|
3
|
3
|
3
|
మేపు మోతాదు నిర్ణయించడంలో సాధారణ సూత్రాలు
- పాడి పశువులు ఎండుమేత పచ్చిమేత కలిపిమేపేటప్పుడు ప్రతి 100 కిలోల శరీర బరువుకు 1 కిలో ఎండుమేత, 4-5 కిలోల పచ్చిమేత మేపవచ్చు. ఎండు గడ్డి, పచ్చి గడ్డి కలిపిమేపితే రోజుకు ఒక పశువుకు 5-6 కిలోల ఎండు గడ్డి 15 కిలోల పచ్చిమేత కావాలి.
- దాణా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి యివ్వాలి. అది యిచ్చు పాలలో రెండు కిలోల పాల తర్వాత అదనంగా యిచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు, గేదెలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా యివ్వాలి. దాణా రెండు సమాన భాగాలు చేసి ఉదయం, సాయంత్రం, పాలు పితికే ముందు మేపాలి.
- పాడి పశువులకు యివ్వవలసిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మోతాదుల పట్టిక
- పశువుల పాల ఉత్పత్తిపచ్చిమేత(కిలోలు)ఎండు మేత (కిలోలు)దాణా (కిలోలలో)గేదెకుఆవుకుపుష్కలంగా పచ్చిమేత లభించే సమయంలో5 కిలోల వరకు304--5-8 కిలోల వరకు3041.51.08-11 కిలోల వరకు3042.001.511-15 కిలోల వరకు3043.002.5పచ్చిమేత కొరత సమయంలో5 కిలోల వరకు482.01.55-8 కిలోల వరకు.....483.02.58-11 కిలోల వరకు...484.53.011-15 కిలోల వరకు..485.03.5
No comments:
Post a Comment