పునరుత్పత్తిలోమెలకువలు
పాడి పశువు లాభసాటి పునరుత్పత్తి లక్ష్యాలు:
- పాడి పశువులు సకాలములో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనితేనే లాభసాటిగా వుంటుంది.
- సంకర జాతి పశువులు 15 మాసాలు, గ్రేడేడ్ ముర్రా గేదెలు 2-3 సంవత్సరములు, దేసవాళి గేదెలు ఆవులు 3-4 సంవత్సరముల వయస్సులో మొదటి సారి ఎదకు రావాలి
- ఆవు అయితే 2-3 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. గేదె అయితే 3-4 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. ఈతకు ఈతకు మధ్యకాలం 12-14 మాసాలకు మించకూడదు. 10 సంవత్సరముల వయస్సులో 5-6 ఈతలు ఈనాలి.
- పాడికాలములో అనగా 10 నెలల లో 1800-2000 లీటర్లకు తక్కువ కాకుండ పాల దిగుబడి ఇవ్వగలగాలి.
ఈ లక్ష్యాలు సాధించాలంటే:
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎదను గమనించాలి. ఎదకు వచ్చిన తర్వాత సకాలములో గర్భధారణ చేయించాలి. ఒక ఎద తప్పితే, 500 రూ.ల విలువ గల ఉత్పత్తి నష్ట పోవలసి వస్తుంది.
- మొదటిసారి గర్భధారణ చేసే పశువు బరువు కనీసము 200 కిలోలుండాలి. పశువు యొక్క పొడవు (భుజము నుండి మక్కెల వరకు) దాని భుజము వెనుక శరీరం చుట్టు కొలత (అడుగులో) తో గుణించి బరువును తెలుసుకోవచ్చు.
- గర్భధారణ జరిగిన 90 రోజుల లోపుల చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి.
- ఈనిన తర్వాత వచ్చే రెండవ ఎదలో తిరిగి గర్భధారణ చేయించాలి.
పాడి పశువుల పునరుత్పత్తి క్రమము
పునరుత్పత్తిక్రమము
|
దేశవాళి ఆవు
|
సంకరజాతి ఆవు
|
గేదెలు
|
మొదటి సారి ఎదకు వచ్చే వయస్సు
|
3-4 సం.లు.
|
14-18 మాసాలు
|
3-4 సం.లు
|
ఎదకు, ఎదకు మధ్యకాలం
|
21 రోజులు
|
21 రోజులు
|
21-23 రోజులు
|
ఎదకాలం
|
18-24 గంటలు
|
18-24 గంటలు
|
18-36 గంటలు
|
చూలు కాలం
|
280 రోజులు
|
280 రోజులు
|
310 రోజులు
|
మొదటి ఈత వయస్సు
|
4-5 సం.లు.
|
2-3 సం.లు.
|
4-5 సం.లు.
|
ఈతకు ఈతకు మద్య కాలం
|
2 సం. పైగా
|
12-14 మాసాలు
|
16-20 మాసాలు
|
ఈతలో పాడి కాలం
|
200 రోజులు
|
300 రోజులు
|
250-300 రోజులు
|
సరాసరి పాల ఉత్పత్తి
|
1-2 లీటర్లు
|
8-10 లీటర్లు
|
6-8 లీటర్లు
|
మొత్తం మీద దేశవాళిపశువుకన్నాసంకరజాతి పశువు వల్ల 5-6 రెట్లు ఎక్కువ లాభం కలుగుతుంది.
త్వరిత గతిన మన దగ్గర వున్న తక్కువ దిగుబడిని దేశవాళి పశువులను అధిక దిగుబడినిచ్చేసంకర జాతి పశువులుగా వృద్ది చేసుకోవాలంటే కృత్రిమ గర్భధారణ ఏకైక మార్గం
కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు:
- మేలు జాతి ఆబోతు ప్రపంచంలో ఎక్కడ వున్నా దాని మేలు జాతి గుణాలను ఉపయోగించుకోవచ్చు. దాని వీర్యాన్ని సేకరించి ఘనీభవింపచేసి నిల్వ ఉంచితే ఆబోతు చనిపోయిన తరువాత కూడా 10-15 సం.రాలు దాని మేలు జాతి లక్షణాలు ఉపయోగించుకోవచ్చు.
- సహజ సంపర్కంలో ఒక ఆబోతు సంవత్సరానికి 100-150 ఆడపశువులకు మాత్రమే గర్భధారణ చేయగలుగుతుంది. అదే కృత్రిమ గర్భధారణ ద్వారా 5-10 వేల పశువులకు ఉపయోగపడుతుంది. ఆబోతుల కొరతను నివారించవచ్చును.
- రైతులకు విత్తనపు ఆబోతుల పోషణ ఖర్చులు భరించవలసిన అవసరము లేదు.
- గొడ్డు పోతు సమస్యలను సులభంగా అరికట్టవచ్చు.
పశువులలో పిండం మార్పిడి విధానం
- మన దేశవాళి పశువులను ఇంకా త్వరిత గతిన అభివృద్ధి పరచి అధిక పాల దిగుబడి కొరకు అత్యాధునికమైన పిండం మార్పిడి విధానం కూడా ఉన్నది.
- ఒక ఆడపశువు గర్భకోశంలో శాస్త్రీయ పద్దతిలో పిండాన్ని ప్రవేశం పెట్టే విధానాన్ని పిండం మార్పిడి అంటారు. సాధారణంగా ఒక ఆడ పశువు 9-10 మాసాల కొకసారి ఒక దూడ నిస్తుంది. ఈ పద్దతి ద్వారా యిదే సమయంలో పది పిండాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక పాలసార గల పిండాలను తక్కువ పాలచార గల పశువుల గర్బకోశంలో ప్రవేశ పెట్టి తద్వారా అధిక పాలచార గల పది దూడలను పొందవచ్చు.
No comments:
Post a Comment