Showing posts with label EMU FARMING. Show all posts
Showing posts with label EMU FARMING. Show all posts

Saturday, 27 June 2015

ఈము పక్షుల పెంపకం


ఈమూ పక్షులు రేటైట్ (Ratite - అడుగుభాగం లేని వక్షశల్య జాతి) జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విస్తృతమైన పెంపక క్షేత్రాలలో (Rancher) మరియు తక్కువ వైశాల్యం గల ప్రదేశాలలో కూడ ఈ పక్షులను, అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మరియు చైనా, ఎమూ పెంపకంలో ముందున్నాయి. ఎమూ పక్షులు, భారత దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా యిమిడి పోయాయి.

ఈమూ పక్షుల అవయవ లక్షణాలు

ఈమూ పక్షికి, పొడుగు మెడ, చిన్న నున్నని తల, మూడు వేళ్ళు మరియు శరీరంమంతా నిండి ఉన్న ఈకలతో ఉంటుంది. తొలిదశలో (0 – 3 నెలల వయసు వరకూ), పక్షుల శరీరం మీద పోడవైన చారలు ఉండి, క్రమంగా అవి 4 – 12 మాసాల వయసు వచ్చేసరికి దోధుమ రంగు తదలగకగ మారతాయి. బాగా ఎదిగిన పక్షులు, నున్నని నీలం రంగు మెడ, శరీరమంతటా రంగు రంగుల చుక్కలున్న ఈకలు కలిగి ఉంటాయి. పూర్తిగా ఎదిగిన పక్షి, సుమారు 6 అడుగుల ఎత్తు, 45 - 60 కేజీల బరువు కలిగి ఉంటుంది. కాళ్ళ పొడవుగా ఉండి, పోలుసులు గల చర్మంతో కప్పబడి ఉండటం వలన, ఎటువంటి గట్టిదైన, ఎండిపోయిన భూములపైన కూడ అవి తట్టుకోగలవు. ఎమూ పక్షి యొక్క సహజమైన ఆహారం - పురుగుతహ, మొక్కల లేత ఆకులు మరియు దానిమేత ఇది వివిధ రకాలైన కూరగాయలు, పళ్ళు, కేరట్లు, దోసకాయ, బొప్పాయి మొదలైన వాటిని తింటుంది. ఆడ, మగ పక్షులలో, ఆడపక్షి మగపక్షి కంటె పెద్దది. సంతానోత్పత్తి సమయంతద మగపక్షి చురుగ్గా ఉన్నాకూడ, ఆడ పక్షి, జంటలో ఎక్కువ అధికారికంగా ఉంటుంది. ఎమూ పక్షులు 30 సంవత్సరాల వయసు వరకూ బ్రతుకుతాయి. 16 సంవత్సరాల కంటె ఎక్కువగానే అవి, గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ పక్షులను గుంపుగా గాని, జంటగా గాని పెంచవచ్చు.


ఈమూ పక్షి పిల్లల పెంపకం













ఈమూ పక్షి పిల్లలు సుమారు 370 గ్రాములు నుండి 450 గ్రాములు (సుమారు 67% గుడ్డు బరువులో) బరువు, గుడ్డు పరిమాణం (సైజు) పై ఆధారపడి ఉంటాయి. మొదటి 48 - 72 గంటలు, గుడ్డులోని పచ్చసోన శోషణం జరిగి అది పూర్తిగా ఎండి పోయేదాకా, ఎమూ పక్షి పిల్లలు, పోదగబడే స్థలంలోనే నియంత్రించబడతాయి. పక్షి పిల్లలు, రాక ముందే, పెంపక కేంద్రమును (శీల) పరిశుభ్రంగా, వ్యాదులు సోకకుండా తగిన జాగ్రత్తలతో సమగ్రంగా తయారు చేయాలి. వరిధాన్యపు ఊకను శీల అంతా పంచి, వాటి పై క్రొత్త గోనె సంచులతో గాని, ములక నార బట్టలతో గాని కప్పాలి. మొదటి మూడు వారాలు, ఒక పక్షి పిల్లకు 4 చదరపు అడుగుల చొ||న 24 - 40 పక్షి పిల్లలను పెంచడానికి వీలుగా ఒక పెంపకశాలను అమర్చాలి. మొదటి పది రోజులు 90o f ఉష్ణోగ్రత, తరువాత, 34 వారాల వరకు 85o f ఉష్ణోగ్రత సమకూర్చాలి. సక్రమ మైన ఉష్ణోగ్రతను కల్పించడం ద్వరా పొదగబడిన పిల్లలు ఎటువంటి సమస్యా లేకుండా ఎదుగుతాయి. తగినన్ని 1 లీటరు నీరు పట్టే మగ్గులు (లోటాలు) మరియు అంతే సంఖ్యగల మేత తోట్టెలను, శీల క్రింద ఉంచాలి. పక్షి పిల్లలు గెంతకుండా, దారి తప్పి పోకుండా ఒక 2.5 అడుగుల రక్షణ వలయ కట్టడం అవసరం. ఒక 40 వాట్ల బల్బు, పెంపకశాలలో (brooding shed) ప్రతీ 100 చ|| అడుగుల స్థలానికి రోజంతా వెలుగుతూ ఉండాలి. మూడు వారాల తరువాత, పెంపక శీల స్థలాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ అదే సమయంలో రక్షణ వలయ కట్టడాన్ని (chic guard) ఇంకొంచెం ముందుకు నెడుతూ, చివరకు, పక్షిపల్లల ఆరు వారాల వయసు వచ్చేసరికి దానిని పూర్తిగా తీసివేయాలి. మొదటి 14 వారాల లేక, శరీర బరువు ప్రామాణికంగా 10 కేజీలు పెరిగేవరకూ, గుజ్జుగా చేసినమేతను యివ్వాలి. పక్షుల ఆరోగ్యకరమైన జీవితానికి, అవి పరిగెట్టలిగేంత అంటే 30 అడుగుల స్థలం ఉండేటట్లు పెంపకశాలలో ఏర్పాట్లు చేయాలి. దీనికోసం 40 అడుగులు (feat) x 30 అడుగులు (feat) స్థలం, సుమారు 40 పక్షి పిల్లలకు అవసరం (బయట ప్రాంగణం ఉన్నట్లైతే). స్థలం, సులభంగా ఎండిపోయేది, తేమ లేనిదీ అయి ఉండాలి.
చేయదగినవి
  • పెంపక ఆవరణలో (కొట్టంలో) ఎప్పుడూ ఎక్కువ పక్షులను ఉంచవద్దు.
  • మొదటి కొన్ని రోజులు, శుభ్రమైన నీరు, వత్తిడిని తగ్గించే పదార్థాలను అందించాలి.
  • నీటిని రోజూ శుభ్రపరచాలి. లేదా యాంత్రికమైన (automatic) నీటి సరఫరా చేయాలి.
  • పక్షులను రోజూ, వాటి సౌకర్యాలు, తీసుకునే ఆహారం, త్రాగే నీరు, ఊత పరిస్థితి మొదలైన వాటి గురించి పర్యవేక్షిస్తూ వెనువెంటనే చేయవలసిన దిద్దుబాట్లు ఏవైనా ఉంటే చెయ్యాలి.
  • ఖనిజ లవణాలు (minerals), విటమిన్లు (vitamins), మేతలో తగినంత ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి లేకుంటే, పిల్లలు సక్రమంగా ఎదగవు మరియు వాటికాళ్లలో లోపాలు ఏర్పడతాయి.
  • అంతా లోపల (all-in), అంతా బయట (all-out) పెంపక విధానం పాటించడం వలన మేలైన జీవరక్షణ నిర్వహణ సాధ్యమౌతుంది.
చేయకూడనివి:
  • పక్షులను ఎప్పడూ, వేడిగా ఉన్న సమయాల్లో సంచాళించరాదు
  • పక్షులు త్వరగా ఉద్రేకపడతాయి. అందువలన, కొట్టంలో నిశ్శబ్దమైన, ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి.
  • పక్షులు సులభంగా, త్వరగా ఎటువంటి వస్తువునైనా లాక్కుంటాయి. అందువలన, కొన్ని రకాల వస్తువులను ఉదాహరణకు మేకులు, గుల కరాళ్ళు మొదలైన వాటిని పక్షులకు చేరువలో లేకుండ చూడాలి.
  • తెలియని వ్యక్తులను, పదార్థాలను పెంపక కేంద్రంలోనికి అనుమతించరాదు. సక్రమమైన, జీవ రక్షణ (bio security) వ్యవస్థను నిర్వహించాలి.
  • నున్నని, వరి ఊక పరచిన స్థలంలో ఎప్పుడూ పక్షి పిల్లలను ఉంచరాదు ఎందుకంటే, చిన్న పిల్లలు త్వరగా ఉద్రేకపడి, పరిగెట్టి, నెల జరేటట్లు ఉండడం వలన, వాటి, కాళ్ళకు హాని చేసుకుంటాయి.

ఎదిగే ఈమూ పక్షి పెంపక నిర్వహణ







ఈమూ పక్షి పిల్లలు, పెరుగుతున్న కొద్దీ, వాటికి కావలసిన నీటి మరియు ఆహార తొట్టెలు, పరిమాణంలో పెద్దది అవసరమౌతాయి. అలాగే స్థలం కూడ అధికంగా అవసరమౌతుంది. వాటి లింగ నిర్ధారణ చేసి, విడివిడిగా పెంచాలి. అవసరమైతే, కొట్టంలో తగినంత వరి ఊకను వేసి, అది ఎప్పుడూ మంచి స్థితిలో ఎండి పోయినా స్థితిలో ఉంచాలి. ఎదిగే పిల్లలకు యిచ్చే మేతలో, పక్షులు, 34 వారాల వయసు వచ్చే వరకూ గాని, లేక 25 కేజీల శరీర బరువు పెరిగేటంతవరకూ గాని ఆహారం అందించాలి. వాటి ఆహారంలో 10 % ఆకుకూరలు, ముఖ్యంగా వివిధ రకాలైన ఆకు మేతను ఉండేటట్లు చూడాలి. వీని వలన, అది పీచుపదార్థం కలిగిన ఆహారానికి అలవాటుపడతాయి. శుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. అవి కోరుకున్నంత ఆహారాన్ని అందించాలి. పెరుగుతున్నంత కాలం, పెంపకశాలలో, ఊకను పరచిన ప్రదేశం పొడిగా ఉండే స్థితికి కొనసాగించాలి. అవసరమైతే, తగినంత పరిమాణంలో వరి ఊకను కొట్టంలో వేయాలి. బయట ప్రాంగణం ఉన్నట్లైతే, 40 అడుగులు x 100 అడుగుల వైశాల్యం గల స్థలాన్ని 40 పక్షుల కోసం కేటాయించాలి. నేల సులభంగా ఎండి పోయేదీ, తేమ లేనిదీ అయి ఉండాలి. చిన్న పక్షులను, ప్రక్కల నుండి లాగి, శరీరాన్ని దగ్గరకు తెచ్చి గట్టిగా పట్టుకోవాలి. వీటిని ఈ విధంగా నియంత్రించాలి. కొంచెం పెద్దవి మరియు పూర్తిగా పెద్దవైన పక్షులను, వాటి రెక్కలను, ప్రక్కల నుండి లాగి, కలిపి పట్టుకుని, మనిషి కాళ్ళ మధ్యకు సమీపంగా తీసుకుని రావాలి. పక్షికి తన్నుకోవడానికి ఆస్కారమివ్వకూడదు. పక్షి ప్రక్కలకి, ముందువైపుకి తన్నుకుంటుంది. అందువలన, జాగ్రత్తగా దగ్గరకు లాగడం, గట్టిగా పట్టుకోవడం చాలఅనసరం. లేకపోతే, పక్షికీ మరియు మనిషికి కూడ హాని జరిగే అవకాశ ముంది.
చేయదగినవి :
  • పక్షుల సముదాయాన్ని రోజుకి కనీసం ఒక్కసారైనా పర్యవేక్షించి, వాటి చురుకుదనం, ఆహారం మరియు నీటి తొట్టెలను గమనించాలి.
  • కాళ్ళ లోపాలు, మరియు, రెట్టలను గమనించాలి. జబ్బుతో ఉన్న వాటిని గుర్తించి, వాటిని విడిగా ఉంచాలి.
  • అంతా - లోపల, అంతా - బయట పద్ధతులను పాటించాలి. పెద్ద పక్షుల సమీపంలో వీటిని ఉంచరాదు.
చేయకూడనివి :
  1. పదునైన వస్తువులు, గులక రాళ్ళు వంటి వాటిని పక్షుల సమీపంలో ఉంచరాదు. పక్షులు అల్లరి (కొంటిగా - mischievous) గా ఉంటాయి. అందువలన, వాటికి అందుబాటులో ఉన్న వేటినైనా అవి లాగేస్తూ ఉంటాయి.
  2. వేడిగా ఉన్న వాతావరణ పరిస్థితులలో, పక్షులను తాకడం గాని, పట్టుకోవడం గాని చేసి నియంత్రించడం, లేక రోగ నిరోధక టీకాలను యివ్వడం చేయరాదు.
  3. రోజు మొత్తం, చల్లటి శుభ్రమైన నీరు ను అందించాలి.

సంతానోత్పత్తి దశలో ఉన్న ఎమూ పక్షుల పెంపక నిర్వహణ

పక్షులు, 18 – 24 మాసాల వయసులో సంతానోత్పత్తి దశకు చేరుకుంటాయి. మగ, ఆడ పక్షుల నిష్పత్తి 1 : 1 గా ఉండేలా చూడాలి. కొట్టంలో జతకట్టించినట్లైతే, ఆ రెండు పక్షుల మైత్రి సంబంధాల ఆధారంగా చేయాలి. జతకట్టించే సమయంలో, ఒక జంటకు 2500 చ|| అడుగుల (100x25) వైశాల్యం గల ప్రదేశాన్ని కల్పించాలి. చెట్లు మరియు పొదలను ఏర్పాటు చేసి, వాటి ఏకాంతానికి, ప్రణయానికి వీలు కలిగించాలి. ఈ జత కట్టించే కార్యక్రమానికి 3 – 4 వారాల ముందే, ఆ పరిస్థితికి తగిన ఆహారాన్ని సమకూర్చాలి. ఆ ఆహారంలో, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి బలవర్థకమైన పోషక పదార్థాలు ఉండి, పక్షులలో ఫలవంతమైన సంతానోత్పత్తి కలగడానికి దోహద పడుతుంది. సామాన్యంగా, ఒక పెద్ద పక్షి, ఒక రోజుకు 1 కేజీ ఆహరం తీసుకుంటుంది. కాని జతకట్టే (కాలం) దశతో, ఆహారం తీసుకోవడం చాల తగ్గిపోతుంది. అందువలన పోషకాలను పక్షులు పొందేటట్లు చూసుకోవాలి.
మొదటి గుడ్డును 2 ½ సంవత్సరాల వయసులో, ఎమూపక్షి పడుతుంది. అక్టోబరు నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు ఎక్కువగా పెట్టబడతాయి. ముఖ్యంగా, సంవత్సరంలో ఎక్కువ చలిగా ఉన్న రోజులలో, ఎక్కువగా పక్షులు గుడ్లు పెడతాయి. ఎమూపక్షి, సాయంత్రం 5.30 నుండి 7.00 పి.మ్ మధ్యకాలంలో గుడ్లు పెడుతుంది. రోజుకి రెండు సార్లు, గుడ్లను ఏరడం వలన అవి కొట్టంలో పాడవకుండా జాగ్రత్తపడవచ్చు. సాధారణంగా, ఒక ఆడ ఎమూ పక్షి, మొదటి సంవత్సరం ఆ వృత్తిలో 15 గుడ్లను పడ్తుంది. ఆ తరువాతి సంవత్సరాలలో, గుడ్ల ఉత్పత్తి అధికమై, సుమారు 30 – 40 గుడ్ల ఉత్పత్తి దాకా చేరుకుంటుంది. సగుటున, ఒక ఆడ పక్షి, సంవత్సరానికి 25 గుడ్ల పెడుతుంది. ఒక గుడ్డు బరువు సుమారు 475 - 650 గ్రాములు ఉంటుంది. సంవత్సరానికి, ఒక గుడ్డు సగుటు బరువు 560 గ్రాములు ఉంటుంది. గుడ్డు ఆకుపచ్చరంగులో ఉండి గరుకు పాలరాయిలో కనిపిస్తుంది. ఆ రంగు గాఢత క్రమేపీ లేత మధ్యస్తం మరియు ముదురు ఆకుపచ్చ రంగుగా మారుతుంది. ఆ గుడ్డు ఉపరితలం, గరుకు తనం నుండి నునుపు దనం దాకా మారూతూ ఉంటుంది. చాలి మాటుకు గుడ్లు, (42%) మధ్యస్త ఆకుపచ్చ రంగులో గరుకు ఉపరితలం ఉంటాయి.


ఈమూ గుడ్లు
జతకట్టే దశలో ఉన్న పక్షులకు యిచ్చేమేతలో తగిలంత కాల్షియం (2.7%) ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన, గుడ్డు, కాల్షియంతో దృఢంగా ఉంటుంది. అధికంగా కాల్షియం, జత కట్టే పక్షికి యిచ్చినట్లైతే గుడ్ల ఉత్పత్తి పై చెడు ప్రభావం చూపుతుంది. మగ పక్షుల సంతానోత్పత్తి సామర్థ్యం పై కూడ దుష్ప్రభావం కలుగుతంది. అదనపు కాల్షియంను, ప్రకృతి సిద్ధమైన కాల్షియం కార్చొనేట్ గరుకు పొడిగా గాని, మెత్తటి పొడిగా గాని వేరే తొట్టి ఏర్పరచి, దాని ద్వారా అందించవచ్చు. తరచుగా, కొట్టం నుండి, గుడ్లను సేకరించాలి. ఒకవేళ గుడ్లు మలిన పడితే, వాటిని గరుకు యిసుక కాగితం (sand papers)తో శుభ్రం పరేచి మాదితో తుడవాలి. ఒక చల్లటి గదిలో 600 f ఉష్ణోగ్రతలో గుడ్లను భద్రపరచాలి. 10 రోజుల కంటె ఎక్కువగా గుడ్లను అందులో ఉంచరాదు, ఎందుకంచే వాటి పొదిగే సామర్థ్యానికి ఆటంకం కలుగుతుంది. గది ఉష్ణోగ్రతలో భద్రపరచిన గుడ్లు, మూడు, నాలుగు రోజుల కొకసారి పొదుగుటకు అమర్చాలి.

గుడ్లను పొదుగుట మరియు పిల్లలు గుడ్లనుండి బయటకు వచ్చుట

గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రే లో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని (incubator) పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ (యంత్రాన్ని) మీట నొక్కి, పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే డ్రై బల్బే (వేడి బల్బు) ఉష్ణోగ్రత సూమారు 96o - 97o f మరియు వెట్ బల్బ్ (తేమ బల్బు) ఉష్ణోగ్రత సుమారు 78o - 80o f (సుమారు 30 - 40% RH )లు గా ఉండాలి. గుడ్లను ఉంచిన ట్రే ను జాగ్రత్తగా ఒక సెట్టర్ (పొదిగే ప్రాంతం)లో ఉంచాలి. ఒకేసారి, ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో, తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే, గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని జాతి చరిత్రను తెలిపే చీటిని అందులో పెట్టాలి. ఇన్ క్యూబేటర్ లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి, 20 గ్రాముల పొటాషియం పెర్మాంగవేట్ (Potassium permananganate) + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్ (Formaline) ను ఉపయోగించి రోగక్రిములను నాశనం చేయాలి. ప్రతిగంటకు, ఒకసారి గుడ్లను తిప్పుతూ, 48వ రోజు వచ్చే దాకా అలా చేస్తూ ఉండాలి. 49వ రోజు తరువాత గుడ్లను అటూ, యిటూ తిప్పడం మానివేసి, కదలికల కోసం గమనిస్తూ ఉండాలి. 52వ రోజుకు పొదగబడే సమయం అయిపోతుంది. ఎమూ పక్షి పిల్లలు పొడిగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చినప్పుడు, కనీసం 24 గంటల నుండి 72 గంటల దాకా పొదగబడిన గది (hatcher compartment) లోనే ఉంచాలి. అందువలన వాటిలోని నూగు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి యిది అవసరం. సాధారణంగా, పొదగడంలో 70% కాని అంతకు మించి కాని ఫలితం ఉంటుంది. తక్కువగా పొదగబడడానికి చాల కారణాలు ఉంటాయి. సంతానోత్పత్తి దశలో, సక్రమమైన పోషకాహారం అంద చేయడం వలన, తరువాత కాలంలో ఆరోగ్యకరమైన పిల్లలు పొందడానికి కారణమౌతుంది.

ఆహారం లేక మేత

ఈమూ పక్షుల తమ సక్రమమైన పెరుగుదలకు మరియు సంచి సంతానోత్పత్తికి, సమతులాహారం అవసరం. ఈ ఆహార అవసరాల గురించి వ్రాసిన విషయాలమీద ఆధారపడి, ఒక పద్ధతి గల పోషకాహార అవసరాలు సూచింపబడ్డాయి. (పట్టిక table-1) మరియు పట్టిక (table-3) ఆహారాన్ని సాధారణంగా పక్షులకు పెట్టే పదార్థాల మిశ్రమ ఆహారం వలెనే (పట్టిక (table)-2) ఉంటుంది. ఆహారం, ఒక్కటే ఉత్పత్తి ఖర్చులో 60 - 70% ఉంటుంది. అందువలన, తక్కువ ఖర్చులో సరుకులను వాడినట్లైతే, ఆహారానికి సంబంధించిన లాభాలు మెరుగవుతాయి. వ్యాపారపరమైన ఎమూ పక్షుల పెంపక కేంద్రాలలో, సంతానోత్పత్తి దశలో ఉన్న ఎమూ జతకు సంవత్సరానికి పెట్టే ఆహారంలో తేడాలు 394 – 632 కేజీలు దాకా ఉంటాయి. సంవత్సర సగటు ఆహారం ఒక జత తీసుకునేది 527 కేజీలు. సంతానోత్పత్తి కాలం కానప్పుడు మేత (ఆహారం) ఖరీదు రు. 6.50 పై మరియు సంతానోత్పత్తి కాలంలో ఆహారం ఖరీదు రు. 7.50 పై.
ఈమూ పక్షి యొక్క వివిధ వయసులలో కావలసిన పోషక పదార్థాల సూచిక
పరిమాణం
(parameter)
ప్రారంభ ఆహారం 10-14 వారాల వయసు లేక 10 కేజీల శరీర బరువు
ఎదిగే పక్షికి కావలసిన ఆహారం 15 – 34 వారాల వయసు లేక 10 – 25 శరీర బరువు
సంతానోత్పత్తి దశలో ఉన్న పక్షికి కావలసిన ఆహారం.
ప్రకృతి సహజమైన మాంసకృత్తులు%
(Crude protein %)

20

18

20
లైసిన్ %
(Lysine)

1.0

0.8

0.9
మెథియోనైన్ %
(Methionine)

0.45

0.4

0.40
ట్రిప్టోఫాన్ %
(Tryptophan %)

0.17

0.15

0.18
థ్రియోనైన్ %
(Threonine %)

0.50

0.48

0.60
కాల్షియం మిని %
(Calcium mini %)

1.5

1.5

2.50
మొత్తం ఫాస్పరస్
(Total phosphorus %)

0.80

0.7

0.7
సోడియం క్లోరైడ్ (ఉప్పు%)
(Sodium Chloride %)

0.40

0.3

0.4
గరిష్ఠమైన ప్రకృతి సిద్ధ పీచు పదార్థం %
(Crude fiber (max) %) (in units/per kg)

9

10

10
విటమిన్ ఎ
Vitamin A (IU/kg)

15000

8800

15000
విటమిన్ ‘డి’ 3
(Vitamin ‘D’ 3) (ICU/kg) (in calorie units)

4500

3300

4500
విటమిన్ ఇ
(Vitamin E) (IU/kg) (in units/per kg)

100

44

100
విటమిన్ బి 12
(Vitamin B12) µ g/kg

45

22

45
ఖోలిన్
(Choline)

2200

2200

2200
రాగి (Copper)
mg/kg

30

33

30
జింక్ (zinc (mg/kg)) మి.గ్రా/కే.జి

110

110

110
మాంగనీస్ (మి.గ్రా/కే.గ్రా)
(Manganese (mg/kg))

150

154

150
అయోడిన్ (మి.గ్రా/కే.జి)
(Iodine (mg/kg)

1.1

1.1

1.1
ఈమూ పక్షులకు కావలసిన మేత లేక ఆహారం (1 కే.జి/100 కేజీలు) (emu feeds (kg/100 kg))
పదార్థాలు
(in of mediates)
ప్రారంభ ఆహారం
ఎదుగుమన్న దశలో
పూర్తిగా ఎదిగాక
సంతానోత్పత్తి దశలో
పోషణ
జొన్నలు
(maize)

50

45

60

50

40
సోయాగింజల జిండి
Soybean meal

30

25

20

25

25
డి.ఒ.ఆర్.బి
(D.O.R.B)

10

16.25

16.15

15.50

16.30
పొద్దుతిరుగుడు పవ్వు
(Sunflower)

6.15

10

0

0

15
డైకాల్షియం ఫాస్పేట్
(Dicalcium Phosphate)

1.5

1.5

1.5

1.5

1.5
కాల్సైట్ పొడి (ప్రకృతి సిద్ధమైన కాల్షియం కార్పోనేట్)
(Calcite powder)


1.5


1.5


1.5


1.5


1.5
గుల్లల పొడి
(Shell grit)

0

0

0

6

0
ఉప్పు
(Salt)

0.3

0.3

0.3

0.3

0.3
కొద్ది పరిమాణంలో ఖనిజలవణాలు
(Trace minerals)

0.1

0.1

0.1

0.1

0.1
విటమిన్లు
(Vitamins)

0.1

0.1

0.

0.1

0.1
కోసియోడియోస్టాట్
(Cociodiostat)

0.05

0.05

0.05

0

0
మెథియోనైన్
(Methionine)

0.25

0.15

0.25

0.25

0.15
ఖోలిన్ క్లోరైడ్
(Choline chloride)

0.05

0.05

0.05

0.05

0.05

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మరియు నిర్వహణ

రేటైట్ జాతికి చెందిన పక్షులు సాధారణంగా, దృఢంగా ఉండి ఎక్కువ కాలం జీవిస్తాయి. (80 జీవితకాలం). మరణాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎమూ పక్షుల చిన్న పిల్లలలోనూ, ఎదుగుతున్న క్రమంలోనూ సంభవిస్తాయి. ఈ సమస్యలలో, చలితో బాధపడడం లేక తీవ్రమైన ఆకలి, పోషకాహార లేమి, ప్రేవులలో అడ్డంకి, కాళ్ళలో లోపాలు, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు మరియు క్లోస్ట్రిడియల్ వ్యాధులు వంటివి వస్తాయి. వీటికి గల ముఖ్య కారణాలు, సక్రమమైన పోషకాహారం అంద చేయలేక పోవడం, ఒత్తిడి, నిర్వహణా లోపాలు మరియు వంశ పారం పర్య (జెనిటిక్) లోపాలు. రైనిటిస్, (Rhinitis - జలుబు) కాండిడియాసిస్ (Candidiasis - చర్మవ్యాధులు), సాల్మోనెల్లా (salmonella), అస్పెర్గిలాసిస్ (aspergillosis), కొసిడియాసిస్ (coccidiosis), పేలు (lie) మరియు అస్కారిడ్ (ascarid infestations) వంటి యితర వ్యాధులు కూడ పోకుతాయి. ఐవర్ మెక్టిన్ ను (Ivermection) పక్షిపిల్ల లోపలి భోగాల్లోనూ, బైటి భాగాల్లోనూ పట్టే క్రిముల నుండి రక్షణ కల్పించవచ్చు.
ఎమూ పక్షలలో ఎంటిరిటిస్ (enteritis) మరియు వైరల్ ఈస్ట్రన్ ఈ క్వైన్ ఎన్సిఫిలోమైలిటిస్ (eastern equine encephalomyelitis) (EEE) (మెదడు వ్యాధులు) వంటి వ్యాధులు వచ్చినట్లు కనుగొన్నారు. భారత దేశంలో చాల తక్కువగా రాణి ఖేత జబ్బు వచ్చినట్లు చెప్పడం బడింది. కాని ధృవపడలేదు. అయినప్పటికీ, పక్షుల పిల్లలకు, ఒక వారం వయసులో (లసోటా - lasota) (R.D) రాణి ఖేత్ జబ్బు కొరశు 4 వారాల వయసులో (lasota booster) (లసోటా బూస్టర్ మోతారులో) టీ కాలను యిప్పించడం, 8, 15, మరియు 40 వారాల వయసులో ముక్తేశ్వరే స్ట్రేయిన్ యివ్వడం వలన అధిక రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

ఈమూ పక్షుల ఉత్పత్తులు

ఎమూ మరియు ఆస్ట్రిచ్ ల మాంసం, తక్కువ కొవ్వ కలిగి ఉండడంలో, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండడంలో మరియు విలక్షణమైన రుచి వంటి లక్షణాలకు సంబంధించి శ్రేష్ఠమైనది. తోడు భాగం, మరియు కాలిక్రింది భాగంలో ఉండే పెద్దకండరం, ఎమూ పక్షిలోని లాభకరమైన మాంస భాగాలు. ఎమూ చర్మం సున్నితం గానూ, బలం గానూ ఉంటుంది. కాలి చర్మం ఒక విలక్షణమైన పద్ధతిలో ఉంటుంది. అందువలన అది చాల ఖరీదైనది. ఎమూ కొవ్వు నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు. దీనికి ఆహారపరంగా, వైద్యపరంగా (anti-inflammatory - వాపులను తగ్గిస్తుంది) మరియు అలంకరణ ద్రవ్యంగా మంచి విలువ ఉంది.

ఆర్థిక లాభాలు

ఈమూ పెంపర్ కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం సంతానోత్పత్తి దశలో ఉన్న పక్షుల ఖరీదు చాల ఎక్కువ (61 %) మిగిలిన పెట్టుబడులు, పెంపక కేంద్రం (13 %) మరియు గుడ్లను పొదిగే స్థలం (hatchery) (19 %) పై పెట్టబడతాయి. జతకట్టే దిశలో ఉన్న జంట పక్షుల ఆహారానికి, సంవత్సరానికి 3600 రూ|| ఖర్చు అంచనా వెయ్యడం జరిగింది. గుడ్డు పొదగడానికి, ఒకరోజు వయుసు కల పక్షి పిల్లకు అయ్యే ఉత్పత్తి ఖర్చు వరుసగా 793 రూ|| మరియు 1232 రూ||. ఏడాది ఆహార సగటు, ఒక జంట పక్షులకు 524 కేజీలుగా లేక్కించబడింది. దాని ఖర్చు 3,578 రూపాయలు. రోజుల వయసులో ఉన్న అమ్మదగిన ఎమూపక్షి పిల్ల ఖరీదు 2500 – 3000 రూపాయలు. మంచి పొదిగే వనరులు (80% మించి), తక్కవ ఆహార ఖర్చు మరియు కనిష్ఠ పక్షిపిల్లల మరణాల వలన (10 % కంటె తక్కువ), ఎమూ పక్షులూ నుండి అధిక లాభాలు అర్జించవచ్చు.
ఆధారము : Rao N S 2004. A study on the performance of emu (Dromaius novaehollandiae) in Andhra Pradesh. MVSc thesis submitted to the Acharya N.G. Ranga Agricultural University, Hyderabad. pp 1-62.