చూడి పశువు పోషణలోజాగ్రత్తలు
- గర్భధారణ చేయించిన 90 రోజుల తర్వాత చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
- ఆవులో చూడికాలం 9 మాసాలు గేదెలలో 10 మాసాలు.
- చూడి పశువు చివరి రెండు మాసాల ముందు వట్టి పోనివ్వాలి. ఈ సమయంలో రోజుకు అదనంగా ఒక కిలో దాణా ఇస్తే, పాడికాలంలో 400 లీటర్లు ఎక్కువ పాల దిగుబడి పొందవచ్చు.
- చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించడం కాని, పరిగెత్తించడం కాని, బెదిరించడం కాని చేయకూడదు, పోట్లాడనివ్వకూడదు.
ఈనేటప్పుడు తీసుకోవలసినజాగ్రత్తలు
- ఈనే లక్షణాలు కన్పించిన వెంటనే పశువును పరిశుభ్రమైన షెడ్డులో వరిగడ్డి పరచి ఉంచాలి. 2 గంటల లోపల పశువు ఈనుతుంది. ఆలస్యమైతే డాక్టరును సంప్రదించాలి.
- ఈనిన వెంటనే పశువుకు ఒక బక్కెట్టు గోరు వెచ్చని నీరు త్రాగించాలి. ఆ తర్వాత తవుడు, గోధుమ లేదా సజ్జ బరపటము బెల్లం, ఉప్పు, అల్లం, లవణ మిశ్రమము కలిపిన మిశ్రమాన్ని తినిపించాలి.
- సాధారణంగా ఈనిన తర్వాత 12 గంటల లోపల మాయ వేయాలి. 24 గంటలలోపల కూడా మాయ పడకపోతే డాక్టరును సంప్రదించాలి. మాయను పశువులు తినకుండా జాగ్రత్తపడాలి.
- ఈనిన తర్వాత రెండవ ఎదలో పశువును తిరిగి చూడి కట్టించాలి.
చూడి పశువు పోషణలోపాటించ వలసిన విషయాలు
| |
గర్భధారణ చేయించిన 60 - 90 రోజుల లోపల చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
|
పాల జ్వరం రాకుండా ఈనడానికి వారం రోజుల ముందు కాల్షియం ఇంజెక్షన్సు ఇప్పించాలి.
|
పొదుగు వ్యాధి రాకుండా, ఈనడానికి15 రోజుల ముందు పొదుగులో ఆంటిబయోటిక్ మందులు ఎక్కించాలి
|
ఈనడానికి ముందు పశువును వేరు చేసి పరిశుభ్రమైన పాకలో ఈనడానికి ఏర్పాటు చేయాలి.
|
చివరి రెండు మాసాలలోపాలు పితకడం
మాని వేసి,రోజుకు అదనంగా ఒక కిలో దాణా పెట్టాలి.
|
3వ నెల నుండి 6వ నెల లోపల చూడి పశువుకు నట్టల మందులు తాగించాలి.
|
No comments:
Post a Comment