గొంతు వాపు వ్యాధి
పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రమాదకరమైంది.
ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన
సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి.
వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా దున్నలు , గేదేలలో వస్తుంది . నీరసంగా వున్నా పశువులకు
ఈ వ్యాది త్వరగా సోకుతుంది . పల్లపు ప్రాంతాలలో , వర్షపు నీరు నిలిచే ప్రాంతాలలో ఈ
వ్యాధి ఎక్కువగా వస్తుంది ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. ఈ వ్యాధి పాడి
పశువులకు సోకితే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ వ్యాధి పాశ్చరెల్లా మల్లోసిడా
అనే సూక్ష్మజీవి వలన వస్తుంది. ఈ సూక్ష్మజీవి ప్రధానంగా ఉష్ణ దేశాల్లో వ్యాపించి ఉంటుంది.
రాష్ట్రంలో ఈ సూక్ష్మజీవి వ్యాప్తి చెందేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున తగు
జాగురుకతతో వ్యవహరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని
పాడి గేదెలు, ఆవులకు ఈ వ్యాధి బారినట్టు చెబుతున్నారు. ఎనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు
ఉన్న పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధి వ్యాప్తి
గొంతువాపు వ్యాధి బారిన పశువులను
మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని
వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆరోగ్యకరమైన పశువు తినడం వలన కూడా వ్యాధి
సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువు నోటి నుంచి కారే చొంగ ద్వారా కూడా ఈ వ్యాధి
వ్యాపిస్తుంది.ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పశువులను రవాణా చేసేటప్పుడు వ్యాధి
సోకుతుంది
వ్యాధి లక్షణాలు
వ్యాధికారక సూక్ష్మజీవులు పశువుల
శరీరంలోనికి ప్రవేశించిన రెండు నుంచి ఐదు రోజుల లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
ü -జ్వర
తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది.
ü -చర్మం
వదులుగా ఉన్న చోట ద్రవం చేరి గొంతు భాగం ఉబ్బి ఉంటుంది. చేతితో గట్టిగా వత్తితే గుంట
మాదిరిగా ఏర్పడుతుంది.
ü -కళ్ల
నుంచి నీరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది.
ü -పశువులకు
శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
ü -ముక్కు
నుంచి రక్త పూరితమైన ద్రవాలు కారుతూ ఉంటాయి.
ü -ఊపిరితిత్తులు,
శ్వాసవాహికల్లో పుండ్లు ఏర్పడి చీము చేరుతుంది. విపరీతంగా దగ్గు వస్తుంది.
ü పశువు
ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది.
ü శ్వాస
మరీ కష్టమై నాలుక బయటికి తీస్తుంది.
ü ఒక్కోసారి
వ్యాధి సోకిన పశువులు లక్షణాలు కన్పించిన 24 గంటలలోపు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది.
నివారణ చర్యలు
ప్రయోగశాలలో
రక్త పరీక్ష చేయించి బైపోలార్ గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాను గుర్తించడం వలన వ్యాధిని
నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తరువాత శవ పరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు.
-30 మిల్లీ
లీటర్ల సల్ఫాడిమిడిన్ మందును 3 రోజుల పాటు రక్తంలోకి ఎక్కించాలి. చర్మం కింద కండకు
కూడా మందును ఇంజక్షన్ రూపంలో ఇవ్వొచ్చు.
-క్లోరం
ఫెనికాల్, ఆక్సిటెట్రాసైక్లిన్, సెఫట్రైఆక్సోమ్, సల్ఫా మందులను15 మిల్లీ లీటర్ల మోతాదులో
ఇంజక్షన్ల రూపంలో ఐదు రోజుల వరకు పశువు కండకు ఇవ్వాలి.
-వాపు
తగ్గడానికి కార్టిబోస్, జోబిడ్ వంటి మందులను 10 నుంచి15 మిల్లీ లీటర్ల మోతాదులో 3 రోజుల
పాటు కండకు ఇవ్వాలి.
జాగ్రత్తలు...
వ్యాధి
ఒక పశువు నుంచి మరోక పశువుకు సోకుతుంది. కాబట్టి వ్యాధి ప్రబలినటువంటి ప్రదేశాల్లో
పశువులను కొనుగోలు చేయకూడదు. వ్యాధి రాకుండా పశువులకు ముందు జాగ్రత్త చర్యగా గొంతువాపు
టీకాను 5 నెలల వయస్సు పై బడి ఉన్న దూడలతో సహా అన్ని పశువులకు 3 నుంచి 5 మిల్లీ లీటర్ల
మోతాదులో చర్మం కింద వేయించాలి. ఈ టీకాను ప్రతి సంవత్సరం జూన్, జులై మాసాల్లో తప్పకుండా
వేయించాలి.
-వ్యాధిగ్రస్త
పశువును వెంటనే గుర్తించి మంద నుంచి వేరు చేయాలి.
- పశువుల
పాకలను ఫినాయిల్తో కడిగి పరిశుభ్రంగా ఉంచాలి.
-చనిపోయినటువంటి
పశువులను గ్రామానికి దూరంగా గుంట తీసి పొడిసున్నం చల్లి పూడ్చిపెట్టాలి.
-పశువులకు
అందించే దాణాలోఆక్సీటెట్రాసైక్లిన్ వంటి పొడి మందులను కలిపి పెట్టాలి.
-పశువులను
ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా చేసేటప్పుడు మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి నివ్వాలి
ప్రారంభ దశలోనే
అరికట్టాలి వ్యాదిని ఎలా నివారించాలి ?
వర్షాకాలం
ముందు జూన్ , జులై మాసాలలో పశు సంవర్ధక శాఖ
ప్రభుత్వము వారు ఉచితంగా అందించే వ్యాది నిరోధక టీకాలు వేయించాలి. ఆ తర్వాత ఏటా వ్యాధి నివారణ కోసం టీ కాలు వేయిస్తూ ఉండాలి.
What could be the quick solution on this.? Its effected now
ReplyDelete