మన భారత దేశంలో బర్డ్‌ఫ్లూ
బర్డ్ ఫ్లూ గురించి
మనుష్యుల్లాగే పక్షులకూ ఫ్లూ వస్తుంది. దీన్నే ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనీ అంటారు. ఐ5కే1అనే వైరస్ పక్షులకు, కోళ్లకూ బాతులకూ కూడా సోకుతుంది. పక్షులకు సోకే సాధారణ వైరస్లు కేవలం ఇతర పక్షులకు మాత్రమే సోకుతాయి. ఐతే, ఈ బర్డ్ఫ్లూ మాత్రం పక్షులనుంచి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. అలాటి ఒక మనిషికిఐ5కే1వైరస్ సోకిన కేసు 1997లో తొలిసారిగా హాంగ్కాంగ్లో బైట పడింది. ఆ తర్వాత ఈ వైరస్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలోని పక్షులకి నెమ్మదిగా వ్యాపించింది. ఆసియాలో 2003లో ఐ5కే1 వైరస్ సోకినప్పటినుంచి, దీని వల్ల ఇప్పటిదాకా 234 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రాణాంతకమైన ఈ వైరస్ ఇండియాలో మొన్న జనవరి 2008 ప్రాంతంలో సోకింది. ఫలితంగా, మనుష్యులకు సోకుతుందన్న భయంతో దాదాపు 3.9 మిలియన్ల కోళ్లనూ, బాతులనూ అంతం చేయాల్సి వచ్చిందని ఆహార వ్యవసాయ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడి చేసింది. దానివల్ల ఫిబ్రవరి 2, 2008 తర్వాత ఎలాటి సంఘటన జరగలేదని అన్నారు.
ఈ బర్డ్ఫ్లూ తీవ్రంగా ఉన్నపుడు ఆ పక్షులతో బాగా దగ్గరగా సంచరించడంవల్ల మనుష్యులూ అనారోగ్యం పాలౌతారు. ఆ వ్యాధి సోకిన కోళ్లనూ, బాతులనూ సరైన రీతిలో ఉడికించకుండా తినడంవల్ల కూడా ఆ వ్యాధి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. దీనికి ఇప్పటిదాకా ఎలాటి వ్యాక్సినూ లేదు.
No comments:
Post a Comment