Showing posts with label PASUVULA PEMPAKAM. Show all posts
Showing posts with label PASUVULA PEMPAKAM. Show all posts

Monday, 11 May 2020

పాడి ప‌శువుల్లో పొదుగువాపు వ్యా‌ధి

పాడి ప‌శువుల్లో పొదుగువాపు వ్యా‌ధి: పొదుగు వాపు వ్యాధి మూడు రకాలుగా వస్తుంది. వాటిలో వ్యాధి లక్షణాలు కనిపించకుండా వచ్చే...

Posted by Dr Rambabu- Veterinary Treatment on Monday, 6 January 2020

పశువులలో చర్మ వ్యాధులు- ప్రథమ చికిత్స:

పశువులలో చర్మ వ్యాధులు- ప్రథమ చికిత్స: గజ్జి తామర తోక భాగంలో నుసిమిరి వంటివి వచ్చి చర్మము నల్లగా మారడం లేదా గుండ్లు గా...

Posted by Dr Rambabu- Veterinary Treatment on Monday, 6 January 2020

Saturday, 21 December 2019

పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా

🐄🐄🐄పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా:🐂🐂🐂
📌📌📌పాలు పితికిన తరువాత పాలు వచ్చే రంధ్రము ఒక 5నుండి 7 నిమిషాల వరకు తెరుచుకుని ఉంటుంది. ఈ విధముగా ఉన్నప్పుడు లేదా పాలు పొదుగులో ఎక్కువగా ఉన్నప్పుడు అవి క్రింద పడుకున్నప్పుడు ఒత్తిడితో పాల రంధ్రము తెరచుకుని అవకాశము ఉంది ఆ సమయములో సుక్ష్మ జీవులు లోపలికి వెళ్లి పొదుగువాపు ను కలుగ చేస్తాయి. కావున ముఖ్యముగా పొదుగు వాపు రావడానికి కారణము ఆ రంధ్రము ద్వార సుక్ష్మ జీవులు ప్రవేశిండము. ఆ రంద్రాన్ని ముసివేయడానికి మీరు చల్లని నీటిని ఒక గిన్నె లో పోసుకుని పాలు పితికిన తరువాత చను మొనలను ముంచినట్లయితే రంధ్రము మూసుకుంటుంది. లేదంటే పాలు పితికిన తరువాత పొటాషియం పర్మంగనేట్ ముక్కలను కొద్ది నీళ్ళలో కలిపి పొదుగు ను శుబ్ర పరిస్తే సరిపోతుంది. లేదంటే మనకు మార్కెట్లో దొరికే విస్ప్రేక్ అడ్వాన్స్డ్ స్ప్రే ను తీసుకుని పాలు పిండిన తరువాత స్ప్రే చేస్తూ ఉంటే కూడా సరిపోతుంది.దయచేసి వీటిలో ఏదో ఒక పద్దతిని పాటించండి.
మనకు మార్కెట్లో దొరికే teat dippers ఉన్నాయి. వీటిలో సొల్యూషన్ వేసుకుని శుబ్రము చేసుకోవచ్చు. ఇంకా సరికొత్తగా TEAT PROTECT FILMS వచ్చాయి. ఇది ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. మనము పాలు తేసేటపుడు ఆ లేయర్ ని తీసివేయవచ్చు. క్రింద ఫోటోలు చూడండి. ఇవి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి..
ధన్యవాదాలు. మీ డాక్టర్.జి.రాంబాబు.🙏🙏🙏