Monday, 5 October 2015

How to Convert Telugu Unicode Text to Anu 6 or Anu 7 Telugu Text?

1 comment:

  1. రైల్వే సమస్యలపై తెదేపా ఎంపీల ఆందోళన
    విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్‌
    ద.మ.రైల్వే జీఎం సమావేశం నుంచి బయటకు వచ్చిన ఎంపీలు

    విజయవాడ: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు ఎనిమిది మంది ఒకే వాహనంలో రాగా... మరో నలుగురు మాత్రం విడిగా సమావేశ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, ఏపీకి రైల్వే జోన్‌ కేటాయింపు విషయంలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఎంపీలు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. రైల్వే శిక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వేజోన్‌ అంశంపై కేంద్రం మోసం చేస్తోందని ఎంపీలు విమర్శించారు. రైల్వేజోన్‌ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. గత నాలుగేళ్లలో రైల్వేకు సంబంధించి అనేక సమస్యలు జీఎం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి పరిష్కారం లేదని.. అర్థవంతంగా జరగని సమావేశాలు తమకు అక్కర్లేదని ఎంపీలు మండిపడ్డారు. ఈ సమావేశానికి 12మంది తెదేపా ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. వైకాపా, భాజాపా నుంచి ఏ ఒక్కరూ సమావేశానికి రాలేదు.

    ఎంపీల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: జీఎం

    ఈ సమావేశంలో ఎంపీలంతా కొత్త రైల్వే జోన్ గురించి డిమాండ్ చేశారని, వారి అభిప్రాయాలను కేంద్రం, రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తానని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. ఏపీలో రైల్వేకు సంబంధించి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని, జోన్ పరిధిలో ఆరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, కర్నూలు స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయని, వచ్చే ఏడాది మార్చికల్లా పనులు కొలిక్కి వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్లే రైల్వే ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పన వేగంగా జరుగుతోందన్నారు. మరో మూడేళ్లలో గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు పూర్తి అవుతాయని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 142 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. అమరావతికి రైల్వే అనుసంధానంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ముందుగా సింగిల్ లైన్ 85 కిలోమీటర్ల మేర వేస్తున్నామన్నారు. రైల్వే బోర్డు నుంచి నిధుల కోసం లేఖ రాశామని, అవసరాన్ని బట్టి రెండో లైన్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

    ReplyDelete