Saturday, 21 December 2019

పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా

🐄🐄🐄పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా:🐂🐂🐂
📌📌📌పాలు పితికిన తరువాత పాలు వచ్చే రంధ్రము ఒక 5నుండి 7 నిమిషాల వరకు తెరుచుకుని ఉంటుంది. ఈ విధముగా ఉన్నప్పుడు లేదా పాలు పొదుగులో ఎక్కువగా ఉన్నప్పుడు అవి క్రింద పడుకున్నప్పుడు ఒత్తిడితో పాల రంధ్రము తెరచుకుని అవకాశము ఉంది ఆ సమయములో సుక్ష్మ జీవులు లోపలికి వెళ్లి పొదుగువాపు ను కలుగ చేస్తాయి. కావున ముఖ్యముగా పొదుగు వాపు రావడానికి కారణము ఆ రంధ్రము ద్వార సుక్ష్మ జీవులు ప్రవేశిండము. ఆ రంద్రాన్ని ముసివేయడానికి మీరు చల్లని నీటిని ఒక గిన్నె లో పోసుకుని పాలు పితికిన తరువాత చను మొనలను ముంచినట్లయితే రంధ్రము మూసుకుంటుంది. లేదంటే పాలు పితికిన తరువాత పొటాషియం పర్మంగనేట్ ముక్కలను కొద్ది నీళ్ళలో కలిపి పొదుగు ను శుబ్ర పరిస్తే సరిపోతుంది. లేదంటే మనకు మార్కెట్లో దొరికే విస్ప్రేక్ అడ్వాన్స్డ్ స్ప్రే ను తీసుకుని పాలు పిండిన తరువాత స్ప్రే చేస్తూ ఉంటే కూడా సరిపోతుంది.దయచేసి వీటిలో ఏదో ఒక పద్దతిని పాటించండి.
మనకు మార్కెట్లో దొరికే teat dippers ఉన్నాయి. వీటిలో సొల్యూషన్ వేసుకుని శుబ్రము చేసుకోవచ్చు. ఇంకా సరికొత్తగా TEAT PROTECT FILMS వచ్చాయి. ఇది ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. మనము పాలు తేసేటపుడు ఆ లేయర్ ని తీసివేయవచ్చు. క్రింద ఫోటోలు చూడండి. ఇవి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి..
ధన్యవాదాలు. మీ డాక్టర్.జి.రాంబాబు.🙏🙏🙏


Saturday, 14 December 2019

super napier

పశువుల పాల ఉత్పత్తి లక్షణాలు

good backyard poultry developed by veterinary institutions

“Backyard poultry farming acts as an ‘ATM’, as per family needs – the birds and eggs can be sold at anytime,anywhere for cash in hand.”

good backyard poultry developed by veterinary institutions




మేకపిల్లల పెంపకం :


  • మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంద్ర్హాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి.
  • మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాయిల్ ను చల్లాలి.
  • ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రోజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు)
  • ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి నిచ్చే ఆంటి బాడీలు, విటమున్లు ఎక్కువగా వుంటాయి. మొదటిసారి ముర్రు పాలను జన్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాగించాలి.
  • రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చి మేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి.
  • మేక పిల్లలు రెండు వారాలు దాటగానే వాటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతి రోజు 100 గ్రా. చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి.
  • మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి.
  • మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి.
  • మేక పిల్లల షెడ్ లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పొడి సున్నం చల్లాలి.
  • మూడు మాసాల వయసు దాటిన మేకపిల్లకు నట్టల నిర్మూలన మందులు త్రాగించాలి.
  • ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.
  • పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకొట్టాలి, దీని వలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.

విత్తనపు మేకపోతుల పోషణ

ఆడ గొర్రెల ఎంపిక:

ఆడ గొర్రెల ఎంపిక:
  • మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని, పళ్ళులేని ముసలి గొర్రెలను ఏరివేయాలి. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకు రాని గొర్రెలను, గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి.
  • ఆడ గొర్రెలను సంతలో కొనరాదు, రైతుల మందలో చూసికొనాలి.
  • చూడి లేదా తొలిసూరి ఈనిన గొర్రెలను కొన్న ఎడల నాలుగు కాలాలపాటు మందలో ఉండి లాభాన్నిస్తాయి.
  • గొర్రెలు సీజనల్ బ్రీడర్స్. 80-90% గొర్రెలు జూన్ నుండి ఆగష్టు వరకు ఎదకొస్తాయి. రెండవ సీజన్ జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది.
  • ఆడ గొర్రె ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కట్టుకు వచ్చి పుష్టిగా ఉండే పిల్లలను ఇవ్వగలవు.
  • బ్రీడింగ్ సీజన్ కు ఒక నెల ముందు నుండి మేపునకు అదనంగా రోజుకు 150 200 గ్రా. సమీకృత దాణ ఇచ్చిన ఎడల జీవాలు పుష్టిగా తయారై, ఎక్కువ సంఖ్యలో ఎదకు రాగలవు.
  • పోతును ఎల్లకాలం మందలో ఉంచరాదు. పోతును వేరుగా మేపి బ్రీడింగ్ సమయాల్లో మాత్రం గొర్రెల మందలో కలిపిన ఎక్కువ గొర్రెలు ఎదకు వచ్చే ఆస్కారం ఉంది.
  • గొర్రెల్లో పిండా భివృద్ధి చివరి రెండు మాసాల్లో ఎక్కువ ఉంటుంది. కావున వీటికి చివరి రెండు నెలలు రోజుకు 150-200 గ్రా. దాణా ఇవ్వాలి.
  • కొత్తగా ఈనిన గొర్రెలకు మొదటి మూడు నెలలు 150-200 గ్రా. దాణా ఇచ్చిన ఎడల పాల దిగుబడి పెరిగి పిల్లలు ఏపుగా పెరగగలవు.
  • డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి,కడప.