ఆడ గొర్రెల ఎంపిక:
- మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని, పళ్ళులేని ముసలి గొర్రెలను ఏరివేయాలి. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకు రాని గొర్రెలను, గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి.
- ఆడ గొర్రెలను సంతలో కొనరాదు, రైతుల మందలో చూసికొనాలి.
- చూడి లేదా తొలిసూరి ఈనిన గొర్రెలను కొన్న ఎడల నాలుగు కాలాలపాటు మందలో ఉండి లాభాన్నిస్తాయి.
- గొర్రెలు సీజనల్ బ్రీడర్స్. 80-90% గొర్రెలు జూన్ నుండి ఆగష్టు వరకు ఎదకొస్తాయి. రెండవ సీజన్ జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది.
- ఆడ గొర్రె ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కట్టుకు వచ్చి పుష్టిగా ఉండే పిల్లలను ఇవ్వగలవు.
- బ్రీడింగ్ సీజన్ కు ఒక నెల ముందు నుండి మేపునకు అదనంగా రోజుకు 150 200 గ్రా. సమీకృత దాణ ఇచ్చిన ఎడల జీవాలు పుష్టిగా తయారై, ఎక్కువ సంఖ్యలో ఎదకు రాగలవు.
- పోతును ఎల్లకాలం మందలో ఉంచరాదు. పోతును వేరుగా మేపి బ్రీడింగ్ సమయాల్లో మాత్రం గొర్రెల మందలో కలిపిన ఎక్కువ గొర్రెలు ఎదకు వచ్చే ఆస్కారం ఉంది.
- గొర్రెల్లో పిండా భివృద్ధి చివరి రెండు మాసాల్లో ఎక్కువ ఉంటుంది. కావున వీటికి చివరి రెండు నెలలు రోజుకు 150-200 గ్రా. దాణా ఇవ్వాలి.
- కొత్తగా ఈనిన గొర్రెలకు మొదటి మూడు నెలలు 150-200 గ్రా. దాణా ఇచ్చిన ఎడల పాల దిగుబడి పెరిగి పిల్లలు ఏపుగా పెరగగలవు.
- డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి,కడప.
No comments:
Post a Comment