Monday, 13 July 2015
Sunday, 12 July 2015
పొదుగువాపు
పొదుగువాపు వ్యాధి అంటే ఏమిటి ?
ఎక్కువ పాలను ఉత్పత్తి చేయు పాడి పశువులలో ఇది సాధారణంగా వస్తుంది. పొదుగు లోనికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఈ వ్యాధిని కలుగచేస్తాయి. ఇది అన్ని పశువులలోను ముఖ్యముగా సంకర జాతి పశువులలోను, అధిక పాలు ఉత్పత్తి చేయు గేదలలోను. ఈనిన 1-2 నెలలలో కనిపిస్తుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది.చికిత్స చేయకపోయినట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగా మారి పొదుగు పూర్తిగా పాడైపోతుంది. రైతు ఆర్థికంగా చాలా నష్ట పడతాడు. కావున ఈ పొదుగు వాపు వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయాలి.
పొదుగు వాపువ్యాది ఎన్నిరకాలుగా వస్తుంది ?
పొదుగు వాపు వ్యాధి మూడు రకాలుగా వస్తుంది
1. వ్యాధి లక్షణాలు కనిపించకుండా వచ్చు వ్యాధి ( సబ్ క్లినికల్ )
2. వ్యాధి లక్షణాలు కనిపించుతూ వచ్చు వ్యాధి (క్లినికల్ )
3, దీర్ఘకాలిక వ్యాధి ( క్రానిక్ )
పైన తెలిపిన మూడింటిలో మొదటి వ్యాధి అతి ప్రమాద కరమైన వ్యాధి. ఈ వ్యాధిని గుర్తించుట చాలా కష్టము. ఈ దశలో చికిత్స చేయక పోయినట్లయిన వ్యాధి రెండవ దశ లోకి పోయి తీవ్రతరమైనదిగా మారిపోతుంది.రెండవ దశలో లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయ వచ్చు. . మూడవ దశలో చికిత్స చేయుట చాలా కష్టము. కాబట్టి వ్యాధిని ప్రధమ దశలోనే గుర్తించి చికిత్స చేయాలి.
పోడుగువాపు వ్యాది రెండవ దశలో లక్షణాలు .
· పాలు విరుగుట
· తెల్లటి ముక్కలు కనిపించుట
· పాలు నీరు లాగ అయి పోతాయి
· పొదుగు వాపు
· నొప్పి
పొదుగు వాపు వ్యాది మూడవదశలో లక్షణాలు :
· పొదుగు గట్టిబడి రాయిలాగ మారుతుతుంది
· పాలు పూర్తిగా పోతాయి
· చనుకట్లు గట్టిబడతాయి
· మిగతా చనుకట్లకు వ్యాధి వ్యాపిస్తుంది
వ్యాధిని మొదటిదశలో గుర్తించుట ఎలా ?
ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించుటకు ఒక సులువైన పద్దతి కలదు. దీనిని అనేక దేశాలలో ఉపయోగించి మంచి పలితాలు సాదించారు. దీనిని రైతులే స్వయంగా ఇంటివద్దనే చేయగల పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించుటకు వీలు కలుగుతుంది.
చేయు విధానము: (ఇళ్ళలో వాడుకునే సుర్ఫ్ తో చేయుట )
ముందుగా సుర్ఫ్ ఎక్సెల్ 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్ సీసాలో బద్ర పరచుకోవచ్చును. 3 నెలల వరకూ నిలువ వుంచుకొన వచ్చును. సీసాను వెలుతురు తగలని చోట జాగ్రత్త చేయాలి.
పరీక్ష చేయవలసిన పాడిపశువు నుండి పాలను సేకరించాలి. నాలుగు చనుకట్లనుండి పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో 10 మి.లీ పాలను తీసుకొని 10 మి.లీ . సుర్ఫ్ నీళ్ళను కలపాలి.1 0 సెకండ్ల సేపు నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని కలపాలి. పోడుగువాపు వ్యాధి ఉన్నట్లయితే ఆ మిశ్రమము ముద్దగా అయిపోతుంది. వ్యాదిలేనట్లయితే ఏమి మార్పు రాదు.
దీనిని కనీసం వారానికి ఒక సారిఅయినా చెస్తూ ఉన్నట్లయితే పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించి సరిఅయిన సమయంలో చికిత్స చేసుకోవచ్చును,మనయొక్క పాదిపశువులను ఈ వ్యాది బారి నుండి కాపాడుకోవచ్చును.
ప్రయోగశాల పరీక్ష : యాంటిబయోటిక్(రోగక్రిమి నాశకం) ప్రతిస్పందన పరీక్ష
యాంటీబయాటిక్ గ్రహణశీలత పరీక్ష (ABST) సాధారణంగా బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్స యొక్క యాంటీబయాటిక్ గుర్తించడానికి అత్యంత విజయవంతమైన పరీక్షగా నిర్వహిస్తారు. కిర్బీ-బాయర్ పద్ధతి న యాంటిబయోటిక్ ప్రతిస్పందన కోసం టెస్టింగ్ తరచుగా ప్రయోగశాల లో జరుగుతుంది.యాంటీబయాటిక్స్ కలిగిన చిన్న పొరలు బాక్టీరియా పెరుగుతున్నా ఒక ప్లేట్ లోకి ఉంచుతారు. బాక్టీరియా ఉంటే, యాంటిబయోటిక్, స్పష్టమైన రింగ్, లేదా నిరోధం పెరుగుదల సూచిస్తూ పొర కనపడతాయి. ఇది ప్రయోగశాల ఆదర్శ యాంటీబయాటిక్ చికిత్స మరియు దాని సంబంధిత యాంటిబయోటిక్ ప్రతిస్పందన ఆధారంగా. చికిత్స కారణంగా వ్యాధి తీవ్రతను ఆలస్యం చేయకుండా ప్రయోగశాల సూక్ష్మక్రిమి నివేదికలు ప్రవేసపెట్టి చికిత్స మొదలుపెడతారు.
నివారణ పద్ధతులు
గేదెలను వీలైనంత పొడిగా, పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. పాలు పితికే ముందు పొదుగును గోరు వెచ్చని నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడువాలి. పాలు పితికేవాళ్ల చేతికి గోళ్లు పెరగకుండా జాగ్రత వహించాలి. పొదుగులో పాలు మిగలకుండా పూర్తిగా పిండాలి. గర్భకోశ వ్యాధుల పీడిత పశువుల, ఈనిన పశువుల మాసం నుంచి కారే స్రావాలు పొదుగులకు తగలకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. పాలు పితికిన తర్వాత పొదుగును అంటిసెప్టిక్ లోషన్‌తో కడిగి శుభ్రపర్చాలి. అనుమానిత పశువులను చివరగా పాలు పితికేందుకు వేరు చేయాలి. పాలు పితికిన తరువాత చేతులను నీళ్లతో తర్వాత అంటిసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఒకే పశువులో పొదుగు వాపు వ్యాధి సోకినటువంటి వాటికి చివరగా పాలు పితకాలి. ఒకే ఈతలో పొదుగు వాపు వ్యాధికి గురైన పశువు తిరిగి చూడిదై వట్టిపోయిన తర్వాత అవసరం మేరకు పశువైద్యుల సలహా అనుసరించి డ్రై తెరపిని అమలు చేయాలి. గేదెల్లో పొదుగు వాపు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. పొదుగు వాపు వ్యాధి చికిత్స చేయించిన తర్వాత 72 గంటల వరకు పాలను మానవ అవసరాలకు వినియోగించరాదు.
పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాల్సి ఉంటుంది. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు పొదుగు,పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి.
డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగకుండా కతిరించాలి. పొదుగును శుభ్రపరచి బట్టతో తుడవాలి. ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం(ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటరు నీటికి 2మి.లీ.కలపాలి)తో కడగాలి.అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి.
పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనియవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకొని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి.
పశువుల షెడ్లో
పశువుల షెడ్లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపల గడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బరు షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి.
పాలు తీసే వ్యక్తి
పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు,చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగించవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పాడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేక పోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడి నీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Friday, 10 July 2015
Monday, 6 July 2015
Saturday, 4 July 2015
Monday, 29 June 2015
zoonoses day
ముద్దొచ్చే జంతువులతో ముంచుకొచ్చే ముప్పు
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ ఇది ఎంత పాత మాటో అంత పదునైన మాట కూడా. రోగాలతో అల్లాడాలని, జబ్బులతో డబ్బులు వదిలించుకోవాలని ఎవరూ కోరుకోరు. ఆరో గ్యంగా, ఆనందంగా వుండాలనే ప్రతి ఒక్కరు ఆశపడతారు. అయితే ఆశ ఒక్కటే వుంటే చాలదు కదా. అందుకు తగిన ఆచరణ కూడా ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటూ, చక్కని వ్యాయామం చేస్తూ, క్రమశిక్షణగా జీవిస్తే చాలు... ఆరోగ్యంగా వుండొచ్చు అనుకుం టారు చాలామంది. అది నిజమే కాని... అది మాత్రమే నిజం కాదు. అవన్నీ పాటించినా కూడా రోగాలు రెచ్చిపోవటానికి, జబ్బులు జబ్బలు చరచటానికి, వ్యాధులు విజృంభించ టానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం కలలోనైనా వూహించలేం. కాబట్టే కొత్త జబ్బుల బారిన పడుతూవుంటాం.
సగటు మనిషి, రైతులు, బీదాబిక్కి, కూలీనా లీలతో పాటు విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా తెలిసోతెలియకో రోజూ రోగాల రాజ మార్గంలో నడుస్తూ వుంటారు. అలాంటి వారందరినీ అప్రమత్తం చేసి, వారు ఆశపడే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకునేలా చెయ్యటమే ఈ మా ప్రయత్నం.
జూలై 6వ తేదీ ‘వరల్డ్ జూనోసిస్ డే’ (ప్రపం చ సాంక్రమిక వ్యాధుల దినం) నాలుగు మం చిమాటలు తెలుసుకొని, నాలుగు రోజులు అదనంగా ఆరోగ్యంగా వుందాం.
నిమ్న శ్రేణి జీవుల నుండి మనుషులకు, మనుషుల నుండి నిమ్న శ్రేణి జీవులకు సహ జసిద్ధంగా సంక్రమించే వ్యాధులను ‘జూనోసి స్’ అంటారు. ఇలాంటి జూనోటిక్ వ్యాధులు దాదాపు 200 వరకు వున్నాయి. వీటిలో ‘రేబిస్’ (పిచ్చి కుక్క కాటు వల్ల సోకే వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంత మైన వ్యాధి. లూరుూస్ పాశ్చర్ అనే ప్రముఖ శాస్తవ్రేత్త... పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6, 1885వ తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ రేబిస్ టీకాను ఇచ్చారు. ఇది విజ యవంత మైంది. చారిత్రకం గా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరి త్రపుటల్లో చిరస్థా యిగా నిలిచిపోయే ఆ రోజును (జూలై 6) ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ‘వరల్డ్ జూనోసిస్ డే’ (ప్రపంచ సాంక్ర మిక వ్యాధుల దినం) గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమిచే ఈ జూనో టిక్ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించటం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారి న పడకుండా చేయటం ‘వరల్డ్ జూనోసిస్ డే’ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
జంతువులు, పక్షులను పెంచుకునే ేవారు వాటితో సన్నితంగా వుంటారు. పాలను, పాల ఉత్పత్తులను, మాంసం, జంతు ఉత్పత్తులను ఉపయోగించని వారు బహుశా ఎవరూ ఉండరు. ఆ క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్ వ్యాధి బారిన పడే అవకాశం ప్రతి ఒక్కరికి వుంటుంది. కాబట్టి, వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, ఈ వ్యాధుల పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి ‘వరల్డ్ జూనోసిస్ డే’ నాడు పశు సంవర్ధక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది.
జూనోటిక్ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటంటే... మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెలు - మేకల పెంపకం, కోళ్ళ పెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా, అవసరార్థం, ఆసక్తితో, ఆకర్షణతో కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుతూవుంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు. అయితే... అందమైన గులాబి పక్కనే గుచ్చుకునే ముళ్ళు ఉన్నట్టు, తియ్యని తేనెపట్టు చుట్టూ కాటేసే ఈగలు ఉన్నట్టు, ఆదాయాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఈ జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచి వుంటాయి.
వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసేవారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూవుంటా రు. అలాంటప్పుడు ఆ జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధా రణ సమస్యల నుండి ప్రాణహానిని కూడా కలిగించే అవకాశం వుం టుంది. కాబట్టి పశువులు, జంతువులు, కో ళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగ శాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలలో పనిచేసే వారు, పశు వైద్య సిబ్బంది, చర్మం, తోళ్ళ పరి శ్రమలలో పనిచేసేవారు, ధాన్య గిడ్డంగులలో పనిచేసేవారు ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.
బ్యాక్టీరియా, వైరస్, ప్రొటోజోవా, ఫంగస్, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యక్తుల యొక్క వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వంటి అంశాలను అనుసరించి, ఈ వ్యా ధులు సోకటం, వాటి తీవ్రత, అవి కలిగించే హాని ఆధారపడి వుంటాయి. అలాగే వ్యాధి కా రకం మనిషికి ఎంతవరకు హాని కలిగించగ లుతుంది అనేది, ఆ వ్యాధి కారకం రకం, జా తి పైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించ టం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.
వైరస్ ద్వారా సంక్రమించే జూనోటిక్ వ్యాధులు: రేబిస్, మ్యాడ్ కౌ, గాలి కుంటు
బ్యాక్టీరియా వల్ల వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: బ్రూసెల్లస్, క్షయ, సాల్మొనెల్లోసిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్.
పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: ఏంకైలో స్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా (గజ్జి), అమీబియాసిస్, బాలండీటియోసిస్, టాక్సోప్లాస్మా.
కొన్ని ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వాటి వివరాలు...
1. రేబిస్: పిచ్చి కుక్క కాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది. మనదేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది ఈ వ్యాధి వలన చనిపోతున్నట్టు ఒక అంచనా.
2. మెదడువాపు: జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే ఈ వ్యాధి పందుల శరీరం పైన వుండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్నపిల్లలు ఈ వ్యాధి వలన మరణిస్తున్నారు.
3. మ్యాడ్ కౌ వ్యాధి: ఒకప్పుడు ఇంగ్లండ్‌లో ఈ వ్యాధి వలన విపరీతమైన జన నష్టం జరిగింది.
జూనోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
1. వ్యాధి సోకిన జంతువులు, కోళ్ళ మాంసం తినకూడదు.
2. పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి.
3. సరిగా ఉడకని గ్రుడ్లను తినకూడదు.
4. వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు.
5. చెడిపోయిన, అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు.
6. పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా వుంచాలి.
7. పాలను బాగా మరిగించి తాగాలి.
8. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు కాలాణుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
9. పాలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి.
10. పశువులు, జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకునే విధానం సక్రమంగా అమలు చెయ్యాలి.
11. పోస్ట్‌మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి.
12. వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
13. రేబిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్ వంటి వ్యాధుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
14. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఏంటీ రేబిస్ టీకాను వేయించాలి.
15. కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీ రేబిస్ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
16. పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి.
17. పందులకు గ్రామ శివారుల్లో ఆవాసం ఏర్పాటు చేయాలి.
18. మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో, సున్నం చల్లి పూడ్చి పెట్టాలి.
20. జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమి సంహారకాలతో శుభ్రం చెయ్యాలి.
21. పశు సంవర్ధక శాఖ, ఆరోగ్య శాఖ, పంచాయితీ, మున్సిపల్ అధికారులు రేబిస్ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
22. స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి.
23. ‘జూనోసిస్ డే’ను విజయవంతం చేసి, ప్రజలలో అవగాహన పెంచటంలో అందరూ సహకరించాలి.
ఏయే వృత్తులలో... ఏయే జూనోటిక్ వ్యాధి...

వృత్తి / పని / సందర్భం జూనోటిక్
వ్యాధి
1. పిచ్చి కుక్క కాటు వలన రేబిస్
2. కుక్కపిల్లలతో ఆడేవారికి టాక్సో కారియాసిస్
3. కుక్కలను, లేగదూడలను తాకినప్పుడు గజ్జి, చర్మవ్యాధులు
4. పందులు, దోమల వలన మెదడువాపు వ్యాధి
5. అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు, మాంసం బ్రూసెల్లోసిస్
6. ఎలుకల వలన ప్లేగు
7. పశువులతో సన్నిహితంగా మెలగడం క్షయవ్యాధి
8. ఉన్ని, తోళ్ళ పరిశ్రమలలో పని చేసేవారికి దొమ్మరోగం (ఆంత్రాక్స్)
9. సరిగా ఉడకని గ్రుడ్లు, మాంసం వలన సాల్మొనెల్లోసిస్
10. పంది మాసం వలన టీనియా సోలియం
11. కర్ర కోత పనిచేసేవారికి సాల్మొనెల్లోసిస్
12. గొర్రెలు, మేకల కాపరులకు గజ్జి, దురద
13. కోళ్ళ ద్వారా రాణికెట్, సిట్టకోసిస్
14. మాంసపు పరిశ్రమలలోని కూలీలకు క్యూ ఫీవర్

Subscribe to:
Posts (Atom)