Monday, 29 June 2015

zoonoses day

ముద్దొచ్చే జంతువులతో ముంచుకొచ్చే ముప్పు
ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఎంత పాత మాటో అంత పదునైన మాట కూడా. రోగాలతో అల్లాడాలని, జబ్బులతో డబ్బులు వదిలించుకోవాలని ఎవరూ కోరుకోరు. ఆరో గ్యంగా, ఆనందంగా వుండాలనే ప్రతి ఒక్కరు ఆశపడతారు. అయితే ఆశ ఒక్కటే వుంటే చాలదు కదా. అందుకు తగిన ఆచరణ కూడా ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటూ, చక్కని వ్యాయామం చేస్తూ, క్రమశిక్షణగా జీవిస్తే చాలు... ఆరోగ్యంగా వుండొచ్చు అనుకుం టారు చాలామంది. అది నిజమే కాని... అది మాత్రమే నిజం కాదు. అవన్నీ పాటించినా కూడా రోగాలు రెచ్చిపోవటానికి, జబ్బులు జబ్బలు చరచటానికి, వ్యాధులు విజృంభించ టానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం కలలోనైనా వూహించలేం. కాబట్టే కొత్త జబ్బుల బారిన పడుతూవుంటాం.

సగటు మనిషి, రైతులు, బీదాబిక్కి, కూలీనా లీలతో పాటు విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా తెలిసోతెలియకో రోజూ రోగాల రాజ మార్గంలో నడుస్తూ వుంటారు. అలాంటి వారందరినీ అప్రమత్తం చేసి, వారు ఆశపడే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకునేలా చెయ్యటమే మా ప్రయత్నం.
జూలై 6 తేదీ వరల్డ్ జూనోసిస్ డే (ప్రపం సాంక్రమిక వ్యాధుల దినం) నాలుగు మం చిమాటలు తెలుసుకొని, నాలుగు రోజులు అదనంగా ఆరోగ్యంగా వుందాం.

నిమ్న శ్రేణి జీవుల నుండి మనుషులకు, మనుషుల నుండి నిమ్న శ్రేణి జీవులకు సహ జసిద్ధంగా సంక్రమించే వ్యాధులను జూనోసి స్‌’ అంటారు. ఇలాంటి జూనోటిక్ వ్యాధులు దాదాపు 200 వరకు వున్నాయి. వీటిలో రేబిస్‌’ (పిచ్చి కుక్క కాటు వల్ల సోకే వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంత మైన వ్యాధి. లూరుూస్ పాశ్చర్ అనే ప్రముఖ శాస్తవ్రేత్త... పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6, 1885 తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ రేబిస్ టీకాను ఇచ్చారు. ఇది విజ యవంత మైంది. చారిత్రకం గా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరి త్రపుటల్లో చిరస్థా యిగా నిలిచిపోయే రోజును (జూలై 6) రోజు నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ జూనోసిస్ డే (ప్రపంచ సాంక్ర మిక వ్యాధుల దినం) గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమిచే జూనో టిక్ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశు వైద్య సిబ్బందికి అవగాహన కల్పించటం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారి పడకుండా చేయటం వరల్డ్ జూనోసిస్ డే యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
జంతువులు, పక్షులను పెంచుకునే ేవారు వాటితో సన్నితంగా వుంటారు. పాలను, పాల ఉత్పత్తులను, మాంసం, జంతు ఉత్పత్తులను ఉపయోగించని వారు బహుశా ఎవరూ ఉండరు. క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్ వ్యాధి బారిన పడే అవకాశం ప్రతి ఒక్కరికి వుంటుంది. కాబట్టి, వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, వ్యాధుల పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి వరల్డ్ జూనోసిస్ డే నాడు పశు సంవర్ధక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది.

hen

జూనోటిక్ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటంటే... మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెలు - మేకల పెంపకం, కోళ్ళ పెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా, అవసరార్థం, ఆసక్తితో, ఆకర్షణతో కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుతూవుంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు. అయితే... అందమైన గులాబి పక్కనే గుచ్చుకునే ముళ్ళు ఉన్నట్టు, తియ్యని తేనెపట్టు చుట్టూ కాటేసే ఈగలు ఉన్నట్టు, ఆదాయాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచి వుంటాయి.

వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసేవారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూవుంటా రు. అలాంటప్పుడు జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధా రణ సమస్యల నుండి ప్రాణహానిని కూడా కలిగించే అవకాశం వుం టుంది. కాబట్టి పశువులు, జంతువులు, కో ళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగ శాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలలో పనిచేసే వారు, పశు వైద్య సిబ్బంది, చర్మం, తోళ్ళ పరి శ్రమలలో పనిచేసేవారు, ధాన్య గిడ్డంగులలో పనిచేసేవారు జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

బ్యాక్టీరియా, వైరస్, ప్రొటోజోవా, ఫంగస్, క్లామిడే వంటి జీవుల వలన జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యక్తుల యొక్క వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వంటి అంశాలను అనుసరించి, వ్యా ధులు సోకటం, వాటి తీవ్రత, అవి కలిగించే హాని ఆధారపడి వుంటాయి. అలాగే వ్యాధి కా రకం మనిషికి ఎంతవరకు హాని కలిగించగ లుతుంది అనేది, వ్యాధి కారకం రకం, జా తి పైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించ టం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

వైరస్ ద్వారా సంక్రమించే జూనోటిక్ వ్యాధులు: రేబిస్, మ్యాడ్ కౌ, గాలి కుంటు
బ్యాక్టీరియా వల్ల వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: బ్రూసెల్లస్, క్షయ, సాల్మొనెల్లోసిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్.
పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్ వ్యాధులు: ఏంకైలో స్టోమియాసిస్, హైడాటియోసిస్, అలర్జీ, ఎగ్జిమా (గజ్జి), అమీబియాసిస్, బాలండీటియోసిస్, టాక్సోప్లాస్మా.

కొన్ని ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వాటి వివరాలు...
1.
రేబిస్: పిచ్చి కుక్క కాటు వలన వ్యాధి కలుగుతుంది. మనదేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది వ్యాధి వలన చనిపోతున్నట్టు ఒక అంచనా.
2.
మెదడువాపు: జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి పందుల శరీరం పైన వుండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్నపిల్లలు వ్యాధి వలన మరణిస్తున్నారు.
3.
మ్యాడ్ కౌ వ్యాధి: ఒకప్పుడు ఇంగ్లండ్లో వ్యాధి వలన విపరీతమైన జన నష్టం జరిగింది.

జూనోసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
dogw
1.
వ్యాధి సోకిన జంతువులు, కోళ్ళ మాంసం తినకూడదు.
2.
పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి.
3.
సరిగా ఉడకని గ్రుడ్లను తినకూడదు.
4.
వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు.
5.
చెడిపోయిన, అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు.
6.
పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా వుంచాలి.
7.
పాలను బాగా మరిగించి తాగాలి.

8.
పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు కాలాణుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
9.
పాలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి.
10.
పశువులు, జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకునే విధానం సక్రమంగా అమలు చెయ్యాలి.
11.
పోస్ట్మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి.
12.
వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
13.
రేబిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్ వంటి వ్యాధుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
14.
పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఏంటీ రేబిస్ టీకాను వేయించాలి.

15.
కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీ రేబిస్ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
16.
పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి.
17.
పందులకు గ్రామ శివారుల్లో ఆవాసం ఏర్పాటు చేయాలి.
18.
మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో, సున్నం చల్లి పూడ్చి పెట్టాలి.
20.
జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమి సంహారకాలతో శుభ్రం చెయ్యాలి.
21.
పశు సంవర్ధక శాఖ, ఆరోగ్య శాఖ, పంచాయితీ, మున్సిపల్ అధికారులు రేబిస్ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
22.
స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి.
23.
జూనోసిస్ డేను విజయవంతం చేసి, ప్రజలలో అవగాహన పెంచటంలో అందరూ సహకరించాలి.

ఏయే వృత్తులలో... ఏయే జూనోటిక్ వ్యాధి...


వృత్తి / పని / సందర్భం              జూనోటిక్వ్యాధి
1.
పిచ్చి కుక్క కాటు వలన            రేబిస్
2.
కుక్కపిల్లలతో ఆడేవారికి             టాక్సో కారియాసిస్
3.
కుక్కలను, లేగదూడలను తాకినప్పుడు   గజ్జి, చర్మవ్యాధులు
4.
పందులు, దోమల వలన            మెదడువాపు వ్యాధి
5.
అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు, మాంసం   బ్రూసెల్లోసిస్
6.
ఎలుకల వలన                   ప్లేగు
7.
పశువులతో సన్నిహితంగా మెలగడం     క్షయవ్యాధి
8.
ఉన్ని, తోళ్ళ పరిశ్రమలలో పని చేసేవారికి దొమ్మరోగం (ఆంత్రాక్స్‌)
9.
సరిగా ఉడకని గ్రుడ్లు, మాంసం వలన    సాల్మొనెల్లోసిస్
10.
పంది మాసం వలన              టీనియా సోలియం
11.
కర్ర కోత పనిచేసేవారికి             సాల్మొనెల్లోసిస్
12.
గొర్రెలు, మేకల కాపరులకు          గజ్జి, దురద
13.
కోళ్ళ ద్వారా                  రాణికెట్‌, సిట్టకోసిస్
14.
మాంసపు పరిశ్రమలలోని కూలీలకు     క్యూ ఫీవర్

Sunday, 28 June 2015

Veterinary Library (In all Veterinary Fields) is on Facebook.

https://www.facebook.com/pages/Veterinary-Library-In-all-Veterinary-Fields/168316476552659

http://www.studytemple.com/forum/veterinary/

http://www.studytemple.com/forum/veterinary/

Veterinary Electronic Library

http://www.vetcircles.net/
http://www.vetelib.com/

merck vet manual

VET VEDIOS

Veterinary E-Books


Veterinary E-Books
Veterinary E-Books for all vets. Proud To Be Veterinarian !!!

లేగదూడలలో వచ్చు వ్యాధులు

లేగదూడలలో  వచ్చు వ్యాధులు            

 1. లేగదూడ లలో  పారుడు వ్యాధి 
 2. దూడలలో మలబద్దకము 
 3. న్యుమోనియా 
 4. బోడ్డువాపు 
 5. గిలక వ్యాధి 
 6. లేగదూడలలో తెల్ల పారుడు వ్యాధి ( కొలిబాసిల్లోసిస్ )
 7. కాక్సీడియోసిస్  వ్యాధి 
 8. దిఫ్తేరియా వ్యాధి 
 9. దూడలలో ఏలిక పాముల బెడద  
 1. లేగదూడలలో  పారుడు వ్యాధి:
 లేగదూడలు అనేక కారణాల వాళ్ళ పారుకుంటాయి. ఈ క్రింద తెలిపిన కారణాల వలన సాధారణంగా దూడలు పారుకుంటాయి 
1.                   అంతర పరాన్న జీవుల వలన 
2.                  ప్రోటోజోవా అను పరాన్న జీవుల వలన 
3.                  వైరల్ డయారియా 
4.                  సూక్ష్మక్రిముల వలన 
5.                  ఎక్కువ మోతాదులో పాలు త్రాగుట  వలన 
6.                  వ్యాధినిరోధక శక్తి లేకపోవుట వలన 
7.                  అపరిశుభ్ర వాతావరణం లో దూడలను వుంచుట వలన 
లక్షణాలు :
1.                   దూడలు అకస్మాత్తుగా పారుకుతాయి 
2.                  విరోచనాలు తెల్లగా కాని, చీము, రక్తం తో కాని కూడిఉంటాయి 
3.                  కడుపునొప్పి 
4.                  తల్లి వద్ద పాలు తాగవు  
5.                  నిస్సత్తువుగా వుంటాయి  రక్త హీనత ఏర్పడుతుంది 
6.                  శరీరం లో నీరు కోల్పోతాయి 
7.                  సకాలంలో చికిత్స  చేయకపోతే దూడలు మరణిస్తాయి 
చికిత్స / నివారణ :
వ్యాధి సోకిన దూడలకు వెంటనే చికిత్స చేయించాలి
వ్యాధికి గల కారణాలను విశ్లేషించి తగు చికిత్స చేయాలి
దూడలను పరిశుభ్రమైన వాతావరణం లో వుంచాలి
దూడల శాలలను ఎప్పటి కప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి
దూడలకు సకాలంలో ఏలిక పాములకు, నట్టలకు మందులు వేయాలి. దూడ పుట్టిన  10 రోజులలో మొదటిసారిగా ఏలిక పాములకు మందు వేయించాలి. తదుపరి ప్రతీ నెలకు ఒకసారి వేయాలి.
దూడలకు ముర్రు పాలు పుట్టిన  గంట లోపున తాగించాలి.
దూడలకు శరీర బరువును బట్టి పాలు ఎక్కువ తక్కువ కాకుండా ఇవ్వాలి.
విటమిన్ 'ఏ ' ఇంజక్షన్ 1500 యూనిట్లు వారాని ఒకసారి చొప్పున ఇవ్వాలి 3-4 నెలల వరకు ఇవ్వవచ్చును.ఇస్తే  వ్యాధుల నుంచి రక్షణ వస్తుంది.
వ్యాధిగ్రస్త దూడలను మంచి దూడలను  నుంఛి  వేరుచేసి చికిత్స చేయాలి
దూడలను మట్టి నాకకుండా మూతికి బుట్ట కట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
దూడల  శాలల్లో దూడలను కిక్కిరిసి వుంచరాదు

2.  దూడలలో మలబద్దకము 

ఇది దూదలన్నిటిలోను మరియు  గేదె దూడలో ఎక్కువగా కనిపిస్తుంది. దూడలు పేడ వేయలేవు. ఆకలి తక్కువగా వుంటుంది దూడ మందకొడిగా వుంటుంది. దూడలకు ముర్రుపాలు తాగిస్తే మలబద్దకము రాదు. 
చికిత్స:
గ్లిసరిన్ ఎనిమా ఇవ్వాలి 
మెగ్నీషియం సల్ఫేట్  నీళ్ళలో కలిపి తాగించాలి 
దూడ తాగే పాలలో కోడి గుడ్డు సోన , చిటికెడు ఇంగువ, బెల్లం రెండు రోజులు తాగిస్తే తగ్గిపోతుంది 
3. దూడలలో న్యుమోనియా వ్యాధి 
దూదలలో ఈ వ్యాధి శీతాకాలంలో కాని వర్షా కాలాలలో కనిపిస్తుంది. దూడలకు చలి గాలులు సోకుటవలన  వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి వస్తుంది. దూడలశాలలలో తేమ ఎక్కువగా వుంఛి  కిక్కిరిసి దూడలను వుంచినచొ ఈ వ్యాధి వస్తుంది
వ్యాధి లక్షణాలు :
·                     జ్వరం తీవ్రంగా వస్తుంది 
·                     ఆకలి మందగిస్తుంది 
·                     దూడ మందకొడిగా వుంటుంది 
·                     ముక్కుల నుండి చీమి కారుతుంది 
·                     దగ్గు, ఊపిరి ఆయాసంగా తీసుకుంటుంది 
·                     శ్వాస కష్టంగా తీస్తుంది 
·                     వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయకపోతే దూడలు చనిపోతాయి 
చికిత్స /నివారణ :
·                     యాంటిబయోటిక్స్ , యాంటిహిస్టమిన్ ఇంజక్షన్లు ఇవ్వాలి 
·                     జున్ను పాలు సకాలంలో తాగించాలి 
·                     శీతాకాలంలో  దూడలకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి 
·                     దూడల శాలలో దూడలను కిక్కిరిసి వుంచరాదు. గచ్చులు పొడిగా వుండాలి
4. దూదలలో బొద్దువాపు వ్యాధి   
దూదలలో తరచుగా వచ్చే వ్యాధి. బొద్దు వాచీ చీము పట్టి నొప్పిగా వుంటుంది. 
కారణాలు :
·                     అపరిశుభ్ర వాతావరణంలో దూడను ఈనుటవలన  
·                     ఈనిన తరువాత బొడ్డుకు మట్టి,పేడ వగైరా అంటుకొనుట వలన 
·                     బొడ్డును కత్తిరించునపుడు  స్టేరిలైజు చేయని కత్తెర వాడుట వలన  
·                     బొద్దునకు టించరు  అయోదినే వ్రాయక పోవుటవలన  
·                     ముర్రుపాలు దూడకు సకాలం లో త్రాగించక పోవుట  కాని అసలు త్రాగించక  పోవుట  మొదలగు కారణాలవలన బొద్దు వాచీ చీము చేరుతుంది
లక్షణాలు :
·                     దూడలకు జ్వరం 
·                     పాలు త్రాగవు  
·                     బొద్దు వాచీ చీము పడుతుంది 
చికిత్స :
·                     బొద్దును పరీక్ష చేసి చీము వున్నదని నిర్ధారణ అయిన తర్వాత చీమును తొలగించి  యాంటిసెప్టిక్ లోషన్ తో కడిగి కట్టు కట్టవలెను. అవసరమునుబట్టి యాంటిబయోటిక్ మందులను ఇంజక్షను ద్వారా చేయాలి. సరిఅయిన జాగ్రత్తలు తీసుకోనకపోతే వ్యాధి ముదిరి కీళ్ళు వాచీ పోయే ప్రమాదము వున్నది. 
నివారణ
·                     పరిశుబ్రమయిన ప్రదేశాలలో ఆవులు ఈనునట్లు చూడాలి 
·                     పుట్టిన దూడలకు 2-3 అంగుళాల దిగువున బొద్దు కత్తిరించి ఆయోదిన్ ను కాని ప్రోవిదొనే అయోడిన్ కాని  పూయాలి 
·                     దూడలు పుట్టిన గంట లోపున  ముర్రు పాలు త్రాగించాలి  
5. దూడలలో తెల్ల విరోచనాలు( కోలిబాసిల్లోసిస్ ) :
·                     3-5 రోజుల వయస్సు గల  లేగదూడలకు  ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి నిరోధకశక్తి  లేకపోవుట వలన అపరి శుభ్రమైన వాతావరణం లో దూడలనువుంచుట వలన' ఇ' కోలై అను సూక్ష్మక్రిమివలన  ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన లేగదూడలకు తెల్లటి నీళ్ళ విరోచనాలు అవుతాయి. దూడలు శరీరంలోని నీటిని కోల్పోయి నిస్సత్తువగా అయి మరణిస్తాయి. దూదలలో ఎక్కువ మరణాలకు ఈ వ్యాధి ఒక ముఖ్య కారణం. ఈ సూక్ష్మ క్రిమి దూడల జీర్ణకోశం లో చేరి విషపదార్ధాలను విడుదల చేస్తాయి. వీటి ప్రభావం వలన ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 
వ్యాధి వచ్చుటకు కారణాలు  
·                     పరిసరాల అపరి శుభ్రత 
·                     పాడి పశువును అపరి శుభ్రవాతావరణంలో వుంచుటవలన పోడుగు ద్వారా సూక్ష్మ క్రిములు దూడ శరీరంలో ప్రవేశించి  వ్యాధిని కలుగ చేస్తాయి. 
·                     జున్ను పాలు దూడలకు ఇవ్వకపోవుట వలన వ్యాధి నిరోధక శక్తి లేక వ్యాధికి గురి అవుతాయి 
·                     ఆహారం లో పోషక పదార్ధాల లోపం 
·                     ఎక్కువ వెన్న శాతం వున్న  పాలను ఇచ్చుట 
·                     విటమిన్ 'ఏ' లోపం 
·                     దూడలు మట్టిని నాకుట 
లక్షణాలు 
·                     తెల్లటి నీళ్ళ విరోచనాలు, దుర్వాసనతో కూడి వుంటాయి
·                     విరోచనాలు అయినప్పుడు దూడలు తినుకుతాయి, కడుపు నొప్పి 
·                     దూడలు శరీరంలో నీటిని కోల్పోతాయి 
·                     కొన్ని సమయాలలో రక్తం,మ్యూకస్ పొరలతో కూడి వుంటాయి. 
·                     జ్వరం 
·                     త్వరగా బరువును కోల్పోతాయి 
చికిత్స  
·                     ఫ్యురజోలిదిన్ 50 మి గ్రాములు/ కిలోగ్రాము శరీర బరువునకు రోజుకు రెండు సార్లు ఇవ్వాలి 
·                      క్లోరోంఫెనికాల్  25-30  మీ గ్రా/  కిలోగ్రాము శరీర బరువునకు  
·                     యాంపిసిల్లిన్ 7-10 మి గ్రా / కిలోగ్రాము శరీర బరువునకు 
·                     టెట్రాసైక్లిన్ 5-10 మి గ్రా / కిలోగ్రాము శరీర బరువునకు ఇవ్వాలి 
నివారణ 
·                     జున్ను పాలు దూడలకు తప్పకుండా ఇవ్వాలి  
·                     ఎక్కువ వెన్న శాతం వున్నా పాలు ఇవ్వరాదు 
·                     దూడల సాలలు పరిశుభ్రం గా వుంచి ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి 
·                     పశువుల శాలలలో గాలి, వెలుతురు తగిలేటట్లుగా  వుంచాలి 
·                     దూడలకు ఆహారం సరియైన మోతాదులో ఇవ్వాలి 
6. దూదలలో గిలక వ్యాధి (hernia )
·                     పుట్టిన లేగదూదలలో ఉన్నటువంటి యురేకస్  ట్యూబు (దూడయొక్క మూత్రాశయమునకు మావిని కలిపే నాళము ) మరియు తల్లినుండి వచ్చు రక్త నాళాలు సాధారణంగా 2-3 రోజులలో కుంచిం చుకు పోయి ఎండి పోతాయి. కాని కొన్ని సమయాలలో అవి సూక్ష్మ జీవులవల్ల ఇన్ఫెక్షన్ చేరి అవి బయటకు వచ్చు మార్గము మూసుకొని పోదు. ఆ రంద్రం నుండి దూడ కడుపులో వున్నా సన్నటి పేగు జారుతుంది. దీనినే గిలక అని అంటారు. 
లక్షణాలు 
·                     బొద్దు వాపు 
·                     జ్వరం  
·                     కొన్ని సమయాలలో వాపునుంచి  మూత్రం వచ్చుట 
·                     ఎదుగుదల తగ్గి పోవుట 
·                     పాలు సరిగా తాగవు 
·                     వాపును జాగ్రత్తగా గమనించి కొద్దిగా పోట్టలోనికి  వేలు పెట్టి నొక్కినట్లయితే రంద్రంను గమనించవచ్చును. బొద్దు లోకి జారిన పీగును లోనికి త్రోయవచ్చును 
·                     బొద్దు చీముకు దీనికి తేడా గమనించవచ్చును 
చికిత్స /నివారణ 
·                     హెర్నియా  చిన్నదయినా యెడల చికిత్స లేకుందగనే మాని పొవును. పొట్టనుండి  జారిన పేగు, రంద్రము పెద్దదయిన యెడల శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే నయమగును. పెనిసిల్లిన్, యితర యాంటిబయోటిక్ మందులను ఇచ్చినచో త్వరగా నయమగును. దూడ పుట్టిన వెంటనే బొద్దునకు టించర్  అయోడిన్ పోసిన యెడల బొద్దులోనికి సూక్ష్మక్రిములు ప్రవేశించ లేవు . 
7. దూడలలో కాక్సిడియోసిస్  వ్యాధి
'ఇమీరియా' అనబడు ప్రోటోజోన్ పరాన్నజీవివలన ఈ వ్యాధి వచ్చును. ఈ వ్యాదివలన మరణముల  సంఖ్య చాలా ఎక్కువ. ఇది వొక నెల నుండి  సంత్సరము వయస్సు గల దూదలలో వచ్చు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన దూడలు రక్తము, మ్యుకస్ పొరలతో కూడిన విరోచనాలతో పారుకుంటాయి. పారు తున్నపుడు ఎక్కువగా తినుకుతాయి. పేడ దుర్వాసన తో కూడి యుంటుంది. దూడకు కడుపు నొప్పి కూడా వుంటుంది. తోకకు, తొడల పైన జిగట అంటుకొని వుంటుంది. ఈ వ్యాధి గొర్రెలు, మేకలు, కోళ్ళకు కూడా   వస్తుంది.వ్యాధికారక క్రిములయొక్క గ్రుడ్లు కలుషిత నీరు, మేత ద్వారా  వ్యాప్తి చెందుతాయి.
లక్షణాలు:
వ్యాధికారక  గ్రుడ్లు శరీరం లో ప్రవేసించిన  తరువాత 15 -20 రోజులలో వ్యాధిని కలుగ చెస్తాయి. జీర్ణకోశములో వృద్ధి చెంది పెద్ద ప్రేగులలోని సీకం, కోలన్ లలో వ్యాధిని కలుగ చేస్తాయి . 
1.                   ఎక్కువగా పారుట 
2.                  పారునప్పుడు తినుకుట 
3.                  రక్తం, మ్యుకస్ పొరలతో కూడియున్న విరోచనాలు 
4.                  కండరాల వణుకు  మొదలగు లక్షణాలు కనిపిస్తాయి
వ్యాధి నిర్ధారణ  
పేడ పరిక్ష ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చును.
చికిత్స  
యాంప్రోలియం 10 మి గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు  రోజుకి ఒక సారి చొప్పున 4-5 రోజులు ఇవ్వాలి సల్ఫా మందులు (సల్ఫామితాక్సోలే)20 మి గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు  రోజుకి ఒక సారి చొప్పున 4-5 రోజులు ఇవ్వాలి .
8.  డిఫ్తీరియా వ్యాధి :
ఇది దూడలకు వచ్చు ప్రమాదకరమైన వ్యాధి. లేగాదూదలలోను మరియు పెద్ద పశువులలోను ఈ వ్యాధి వస్తుంది.నెక్రొబాక్తీరిమ్ నేక్రోఫోరుస్ అను సూక్ష్మ జీవివల్ల  ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన  నీటి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు:
o                  నొప్పితో కూడియున్న దగ్గు  
o                  చొంగ కార్చుట 
o                  ఆహారం గుటక వేయుట చాలా కష్టంగా వుంటుంది  
o                  స్వరపేటిక, ఫారింక్స్ ఫై మ్యుకస్ పొరలు ఊడిపోతాయి 
o                  పశువులు మేత మేయలేవు , దూడలు పాలు తాగలేవు
o                  దూడలు నీరసించి పోతాయి 
o                  ఇతర అవయములకు ఊపిరితిత్తులకు , కాలేయమునకు  కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది 
o                  దూడలు నీరసించి చనిపోతాయి
వ్యాధి నిర్ధారణ 
o                  లక్షణములను బట్టి  వ్యాధిని గుర్తించవచ్చు 
o                  ప్రయోగశాలలో రక్తము, ముక్కునుండి కారిన స్రావమములనుండి తీసిన నమూనాలను పరీక్షించిన వ్యాధి కారక క్రిములను గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయవచ్చును 
చికిత్స  /నివారణ 
o                  పెన్సిలిన్,  సల్ఫోనమైడ్స్ ఇచ్చినచో వ్యాధి నిమ్మళించును . పశువుల శాలలను క్రిమిసంహారక మందులతో తరచు కడుగుచుండవలెను
9. దూడలలో ఏలిక పాముల బెడద (ascariasis )
 ఇది దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధి. గేదె దూదలలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చి దూడలు చనిపోవును .ఎలికపాములవలన దూడలలో ఎదుగుదల తగ్గిపొవును. ఈ వ్యాధి ఆస్కారిడ్ అను అంతర పరాన్నజీవి వలన కలుగును (toxocara vitulorum ). గేది దూడలకు ఈ వ్యాధి ముర్రుపాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముర్రుపాలనుండి ఏలిక పాముల యొక్క గ్రుడ్లు దూడ శరీరంలోనికి ప్రవేసించి వ్యాధిని కలుగ చేస్తాయి. దూడలు పుట్టిన 2-5 రోజులలో వ్యాధి కారక పరాన్నజీవులు ముర్రు పాల ద్వారా దూడ కడుపు లోనికి ప్రవేసించి యెదుగుతాయి. కనుకనే దూడకు రెండు వారముల వయస్సు లోనే బాగా ఎదిగిన ఏలిక పాములు దూడ యొక్క కడుపులో కనుగొనగలము. 
లక్షణాలు  
1.                                           దూదలలో ఎదుగుదల తగ్గును  
2.                                          శరీరంఫై వున్న  వెంట్రుకలు బిరుసుగా మారి మెరుపు వుండదు 
3.                                          తరచూ  కడుపునొప్పితో బాధపడుతూ వుంటాయి 
4.                                          రక్త హీనత, పాలు సరిగా త్రాగవు 
5.                                          దగ్గు, దుర్వాసనతో పారుడు
6.                                          పొట్ట పెద్దదగును (బాన పొట్ట) 
చికిత్స  
§                ఫైపరిజిన్ సాల్టులు సాధారణంగా వాడుదురు.    ఫైపరిజిన్ యేడిపేట్ ఏలిక పాములకు చక్కటి మందు 100% పనిచేయును. డోసు: 0. 25 గ్రాములు /కిలోగ్రాము శరీర బరువునకు  నోటి ద్వారా ఇవ్వవచును
§                 ఫైరాన్ టెల్ ( pyrantel) 250 మి గ్రా / ఒక దూడకు లేక లివమిసోల్  7. 5. మి. గ్రా /కిలోగ్రాము శరీర బరువునకు ఇంజక్షన్ ద్వారా ఇవ్వవచ్చును 
§                ఐవర్మెక్టిన్ 0.2 మి గ్రా/కిలోగ్రాము శరీర బరువునకు  ఇంజక్షన్ ద్వారా