Tuesday, 24 December 2019
Saturday, 21 December 2019
పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా
🐄🐄🐄పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా:🐂🐂🐂
📌📌📌పాలు పితికిన తరువాత పాలు వచ్చే రంధ్రము ఒక 5నుండి 7 నిమిషాల వరకు తెరుచుకుని ఉంటుంది. ఈ విధముగా ఉన్నప్పుడు లేదా పాలు పొదుగులో ఎక్కువగా ఉన్నప్పుడు అవి క్రింద పడుకున్నప్పుడు ఒత్తిడితో పాల రంధ్రము తెరచుకుని అవకాశము ఉంది ఆ సమయములో సుక్ష్మ జీవులు లోపలికి వెళ్లి పొదుగువాపు ను కలుగ చేస్తాయి. కావున ముఖ్యముగా పొదుగు వాపు రావడానికి కారణము ఆ రంధ్రము ద్వార సుక్ష్మ జీవులు ప్రవేశిండము. ఆ రంద్రాన్ని ముసివేయడానికి మీరు చల్లని నీటిని ఒక గిన్నె లో పోసుకుని పాలు పితికిన తరువాత చను మొనలను ముంచినట్లయితే రంధ్రము మూసుకుంటుంది. లేదంటే పాలు పితికిన తరువాత పొటాషియం పర్మంగనేట్ ముక్కలను కొద్ది నీళ్ళలో కలిపి పొదుగు ను శుబ్ర పరిస్తే సరిపోతుంది. లేదంటే మనకు మార్కెట్లో దొరికే విస్ప్రేక్ అడ్వాన్స్డ్ స్ప్రే ను తీసుకుని పాలు పిండిన తరువాత స్ప్రే చేస్తూ ఉంటే కూడా సరిపోతుంది.దయచేసి వీటిలో ఏదో ఒక పద్దతిని పాటించండి.
మనకు మార్కెట్లో దొరికే teat dippers ఉన్నాయి. వీటిలో సొల్యూషన్ వేసుకుని శుబ్రము చేసుకోవచ్చు. ఇంకా సరికొత్తగా TEAT PROTECT FILMS వచ్చాయి. ఇది ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. మనము పాలు తేసేటపుడు ఆ లేయర్ ని తీసివేయవచ్చు. క్రింద ఫోటోలు చూడండి. ఇవి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి..
ధన్యవాదాలు. మీ డాక్టర్.జి.రాంబాబు.🙏🙏🙏
Saturday, 14 December 2019
మేకపిల్లల పెంపకం :
- మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంద్ర్హాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి.
- మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాయిల్ ను చల్లాలి.
- ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రోజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు)
- ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి నిచ్చే ఆంటి బాడీలు, విటమున్లు ఎక్కువగా వుంటాయి. మొదటిసారి ముర్రు పాలను జన్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాగించాలి.
- రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చి మేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి.
- మేక పిల్లలు రెండు వారాలు దాటగానే వాటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతి రోజు 100 గ్రా. చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి.
- మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి.
- మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి.
- మేక పిల్లల షెడ్ లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పొడి సున్నం చల్లాలి.
- మూడు మాసాల వయసు దాటిన మేకపిల్లకు నట్టల నిర్మూలన మందులు త్రాగించాలి.
- ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.
- పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకొట్టాలి, దీని వలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.
- డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.
ఆడ గొర్రెల ఎంపిక:
ఆడ గొర్రెల ఎంపిక:
- మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని, పళ్ళులేని ముసలి గొర్రెలను ఏరివేయాలి. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకు రాని గొర్రెలను, గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి.
- ఆడ గొర్రెలను సంతలో కొనరాదు, రైతుల మందలో చూసికొనాలి.
- చూడి లేదా తొలిసూరి ఈనిన గొర్రెలను కొన్న ఎడల నాలుగు కాలాలపాటు మందలో ఉండి లాభాన్నిస్తాయి.
- గొర్రెలు సీజనల్ బ్రీడర్స్. 80-90% గొర్రెలు జూన్ నుండి ఆగష్టు వరకు ఎదకొస్తాయి. రెండవ సీజన్ జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది.
- ఆడ గొర్రె ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కట్టుకు వచ్చి పుష్టిగా ఉండే పిల్లలను ఇవ్వగలవు.
- బ్రీడింగ్ సీజన్ కు ఒక నెల ముందు నుండి మేపునకు అదనంగా రోజుకు 150 200 గ్రా. సమీకృత దాణ ఇచ్చిన ఎడల జీవాలు పుష్టిగా తయారై, ఎక్కువ సంఖ్యలో ఎదకు రాగలవు.
- పోతును ఎల్లకాలం మందలో ఉంచరాదు. పోతును వేరుగా మేపి బ్రీడింగ్ సమయాల్లో మాత్రం గొర్రెల మందలో కలిపిన ఎక్కువ గొర్రెలు ఎదకు వచ్చే ఆస్కారం ఉంది.
- గొర్రెల్లో పిండా భివృద్ధి చివరి రెండు మాసాల్లో ఎక్కువ ఉంటుంది. కావున వీటికి చివరి రెండు నెలలు రోజుకు 150-200 గ్రా. దాణా ఇవ్వాలి.
- కొత్తగా ఈనిన గొర్రెలకు మొదటి మూడు నెలలు 150-200 గ్రా. దాణా ఇచ్చిన ఎడల పాల దిగుబడి పెరిగి పిల్లలు ఏపుగా పెరగగలవు.
- డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి,కడప.
మేకల్లో సంపర్కం :
- మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలుండాలి.
- ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి.
- మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి.
- మేకలు ఎదలో 1-3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమీ చేసిన మేకపోతును వదలాలి. ఇది ఎదలో వున్న మేకలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
- ఎదలో వున్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మేకలకు సరిపోతుంది.
- డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి,కడప.
Saturday, 26 October 2019
Sunday, 9 June 2019
Wednesday, 22 May 2019
Tuesday, 21 May 2019
పశు బజార్ - పశు క్లినిక్ ౼ పశు పోషణ (PASHU SEVA TRUST)
Monday, 25 March 2019
Tuesday, 19 March 2019
Monday, 18 March 2019
Saturday, 16 March 2019
Wednesday, 13 March 2019
Tuesday, 12 March 2019
Sunday, 10 March 2019
Saturday, 9 March 2019
ఒంగోలుజాతి పశువుల ప్రత్యేక లక్షణాలు
వంశ పారపర్య అవ లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి.
గర్భ సంబంద, పొదుగు సంబంద వ్యాధులు అసలు కనిపించవు
ఖనిజ లవణ మరియు ధాతువు లోపాలు వల్ల వచ్చే వ్యాధులు చాలా అరుదు.
కొవ్వు పదార్థం కండరంలో ఉంటుంది. మిగతా పశువుల్లో మాదిరిగా చర్మం కింద పేరుకోదు.
వీటి చర్మం మీద ఉండే వెంట్రుకలు అతి నీలలోహిత కిరణాలు శరీరంలోకి ప్రసరించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పశువులు అధిక వేడిని, క్రిముల దాడిని తట్టుకోగలుగుతాయి. అదిక నిరోధక శక్తి ఉంటుంది.
ఈ పశువుల్లో మనం చర్మం తాకినప్పుడు కదులుతుంది దీనికి కారణం కావర్నోసాస్ కండరాలు ఉండడం. చర్మం కింద ఉండే పెనిక్యుల స్కార్నోసిస్ అనే ప్రత్యేక కండరం అమరిక వల్ల పశువు తన ఇష్టానుసారం శరీరాన్ని జలదరిస్తుంది. దీనివల్ల దోమలు జోరీగల ద్వార వచ్చే వ్యాధులు నివారించబడతాయి.
ఈ జాతి పశువులకు తిన్న మేతను ఉత్పాదక శక్తిగా మలచుకునే సామర్థ్యం ఎక్కువ.
ఈ ఆవుల నుంచి వచ్చే పాలల్లో ఒమేగా ఆమ్లాలు, సంయుక్త లినోలెనిక్ ఆమ్లాలు మరియు కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల, పాలు తాగిన వారిలో మనిషి మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది మరియు క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉంటాయి.
ఒంగోలు జాతి పశువులు అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా తమ జీర్ణక్రియ వేగాన్ని నియంత్రించుకోగలవు. దీనివల్ల వీటికి జీర్ణ సంబంధమైన వ్యాధుల బెడద తక్కువ.
ఆవుల్లో మాతత్వపు భావనలు ఎక్కువగా ఉండడం వల్ల దూడల పోషణ తేలిక.
స్వేద గ్రంధుల వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుంది కనుక తక్కువ శ్వాసక్రియతో ఉష్ణతాపాన్ని తట్టుకోగలుగుతుంది. అంతేగాక చర్మంలో ఉండే చెమట గ్రంధుల నుండి వచ్చే స్వేదం మైనమువలే ఉండి క్రిమి కీటకాలు వచ్చి వాలినపుడు పట్టు చిక్కక జారిపోతాయి మరియు గజ్జి వంటి చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.
విదేశీ, సంకర జాతి ఆవు పాలలో ఉన్న కాన్సర్, అల్జీమర్స్, గర్భస్థ మధుమేహ వ్యాధి ప్రేరకాలు ఒంగోలు జాతి ఆవు పాలలో ఉండవు. దీనివల్ల బాహ్య పరాన్నజీవులు వాటి దగ్గరికి రావు. ఈ లక్షణం విదేశీ, సంకర జాతి పశువులకు లేదు.
Subscribe to:
Posts (Atom)