మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి
పాడిపశువులద్వారా కూడా ఇది వ్యాపి స్తుంది. ఆంత్రాక్స్ ను నెరడు వాపు వ్యాధి, నెత్తురు కట్టు వ్యాధి అని కూడా అంటారు ఆంత్రాక్స్ వ్యాధి ఒక తీవ్రమైన బాసిల్లస్ ఆంత్రాసిస్ బాక్టీరియా వలన కలుగుతుంది .ఆంత్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డితినే జంతువులలో వచ్చే అంటు వ్యాధి. ఇది బాసిల్లస్ ఆంత్రాక్స్ అను స్పోర్స్ ఏర్పరచే బాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ జంతువుల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.
ఆంత్రాక్స్ ఎలా వ్యాపిస్తుంది?ఎవరికి వ్యాపిస్తుంది?
మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి చర్మం సంబంధిత, శ్వాసకోశ సంబంధిత మరియు జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ అను మూడు రకాలుగా ఉంటుంది. ఆంత్రాసిస్ స్పోర్స్ మట్టిలో సైతం చాలా ఏళ్ళు మనగలుగుతాయి. ఆంత్రాక్స్ స్పోర్స్ లను పీల్చడం ద్వారా, ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడిన జంతుమాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
ఆంత్రాక్స్ లక్షణాలు:
చర్మం సంబంధిత ఆంత్రాక్స్:
ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉన్ని, చర్మం, వెంట్రుకలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలలో పని చేసేవారికి చర్మంపై ఉన్న గాయాల ద్వారా వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ భాగంలో ఏధైనా పురుగుకుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. అది ఒకటి, రెండు రోజుల్లో ఉబికి అల్సర్ గా పరిణమిస్తుంది. మధ్యలో నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది. ఎలాంటి చికిత్స జరగని సందర్భంలో 20% చర్మ సంబంధిత ఆంత్రాక్స్ కేసులు మరణానికి దారి తీస్తాయి. తగిన చికిత్సతో మరణాన్ని నివారించవచ్చు.
శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్:
గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్ పీల్చడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తొలి దశలో జలుబులా లేదా ఫ్లూ వంటి లక్షణాలు తరువాత పలు రోజులు, న్యుమోనియా అనిపిస్తుంది. తరువాత శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ ప్రాణాంతకరము.
జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్:
ఆంత్రాక్స్ బాసిల్లస్ తో కలుషితమైన మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల ఇది వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరేచనాలు, గొంతునొప్పి మరియు కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ఆంత్రాక్స్ బారిన పడ్డ కేసుల్లో 25%నుండి 60% వరకు మరణాలు సంభవిస్తాయి
ఆంత్రాక్స్ ను నియంత్రించడం:
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు.
ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే దేశాలలో పశువులకు టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును మరియు వ్యాధి బారిన పడిన జంతువుల కళేబరాలను కాల్చివేయడం ద్వారా స్పోర్స్ ను నాశనం చేయడం, వాటి మాంసాన్ని తినకుండా ఉండడం, వాటి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చును.
ఆంత్రాక్స్ కు టీకా ఉంది. కానీ ఈ టీకా వాడకము మనుషుల్లో అంతగా ప్రాచుర్యములో లేదు.
ఆంత్రాక్స్ టీకాను ఎవరు వేయించుకోవాలి?
• పశువైద్య సిబ్బంది
• ప్రయోగశాలల్లో ఆంత్రాక్స్ బాక్టీరియాతో ప్రత్యక్షంగా పనిచేసేవారు
• జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది
• జీవాయుధాల ప్రమాదం పొంచి ఉన్నచోట విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది
ఆంత్రాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి రక్తంలోని నిర్ధిష్ట యాంటీ బాడీస్ ను లెక్కించటం, రక్తం, చర్మం, శ్వాసద్రవాల పదార్థాల నుంచి ఆంత్రాసిస్ వేరు చేయడం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించవచ్చు.
ఆంత్రాక్స్ వ్యాధి కి చికిత్స ఉంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమవుతుంది. వైద్యుల సలహా మేరకు పెన్సిలిన్, డాక్సిసైక్లిన్, ఎరిత్రోమైసిన్ లేదా సిప్రోప్లాక్సాసిన్ మందులు వాడితే వ్యాధినయమవుతుంది. ప్రస్తుతము సిప్రోప్లాక్సాసిన్ వాడుట మంచిది.
గొర్రె మేకజాతి పశువులకు సంభందించిన మాంసం విక్రయాల్లో కనీస జాగ్రత్తలు కూడా తీసు కోకపోతుండటం ఆంత్రాక్స్ వ్యాది విస్తరణకూ మరింత ఊతమిస్తోంది. పట్టణాలు నగరాల్లో మాంసం జాతి పశువులకు కనీస ఆరోగ్య పరీక్షలు కూడ ఉండటంలేదు. మాంసానికి ఉపయోగించే పశువులకు వైద్యులతో ఆరోగ్యపరీక్షలు చేయించి అవి అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉన్నట్టు ధృవీ కరించాకే వాటి మాంసాన్ని విక్రయించాల్సి ఉంది
ఆంత్రాక్స్ సోకి చనిపోయిన వాటిని శవపరీక్షకూడా చేయరాదు. మృతి చెందిన వాటిని, వ్యాదిసోకిన వాటిని కోసినట్టయితే ఆంత్రాక్స్ సూక్ష్మక్రిముల స్పోరులు ఆ ప్రాంతమంతా వ్యాపిప్తాయని వైద్యరంగం నిపుణులు చెబు తున్నారు.ఆంత్రాక్స్ వ్యాధిసోకిన జీవాల మాంసం తినటం ద్వారా , వాటి చర్మంద్వారా ఈ వ్యాధి మను షులకు కూడా సులువుగా సోకుతుందని హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment