Wednesday, 8 January 2020
Monday, 6 January 2020
Tuesday, 24 December 2019
Saturday, 21 December 2019
పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా
🐄🐄🐄పాడి పశువుల్లో పొదుగు వాపు రాకుండా ఉండడంలో చిన్న చిట్కా:🐂🐂🐂
📌📌📌పాలు పితికిన తరువాత పాలు వచ్చే రంధ్రము ఒక 5నుండి 7 నిమిషాల వరకు తెరుచుకుని ఉంటుంది. ఈ విధముగా ఉన్నప్పుడు లేదా పాలు పొదుగులో ఎక్కువగా ఉన్నప్పుడు అవి క్రింద పడుకున్నప్పుడు ఒత్తిడితో పాల రంధ్రము తెరచుకుని అవకాశము ఉంది ఆ సమయములో సుక్ష్మ జీవులు లోపలికి వెళ్లి పొదుగువాపు ను కలుగ చేస్తాయి. కావున ముఖ్యముగా పొదుగు వాపు రావడానికి కారణము ఆ రంధ్రము ద్వార సుక్ష్మ జీవులు ప్రవేశిండము. ఆ రంద్రాన్ని ముసివేయడానికి మీరు చల్లని నీటిని ఒక గిన్నె లో పోసుకుని పాలు పితికిన తరువాత చను మొనలను ముంచినట్లయితే రంధ్రము మూసుకుంటుంది. లేదంటే పాలు పితికిన తరువాత పొటాషియం పర్మంగనేట్ ముక్కలను కొద్ది నీళ్ళలో కలిపి పొదుగు ను శుబ్ర పరిస్తే సరిపోతుంది. లేదంటే మనకు మార్కెట్లో దొరికే విస్ప్రేక్ అడ్వాన్స్డ్ స్ప్రే ను తీసుకుని పాలు పిండిన తరువాత స్ప్రే చేస్తూ ఉంటే కూడా సరిపోతుంది.దయచేసి వీటిలో ఏదో ఒక పద్దతిని పాటించండి.
మనకు మార్కెట్లో దొరికే teat dippers ఉన్నాయి. వీటిలో సొల్యూషన్ వేసుకుని శుబ్రము చేసుకోవచ్చు. ఇంకా సరికొత్తగా TEAT PROTECT FILMS వచ్చాయి. ఇది ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. మనము పాలు తేసేటపుడు ఆ లేయర్ ని తీసివేయవచ్చు. క్రింద ఫోటోలు చూడండి. ఇవి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి..
ధన్యవాదాలు. మీ డాక్టర్.జి.రాంబాబు.🙏🙏🙏
Saturday, 14 December 2019
మేకపిల్లల పెంపకం :
- మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంద్ర్హాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి.
- మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాయిల్ ను చల్లాలి.
- ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రోజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు)
- ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి నిచ్చే ఆంటి బాడీలు, విటమున్లు ఎక్కువగా వుంటాయి. మొదటిసారి ముర్రు పాలను జన్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాగించాలి.
- రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చి మేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి.
- మేక పిల్లలు రెండు వారాలు దాటగానే వాటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతి రోజు 100 గ్రా. చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి.
- మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి.
- మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి.
- మేక పిల్లల షెడ్ లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పొడి సున్నం చల్లాలి.
- మూడు మాసాల వయసు దాటిన మేకపిల్లకు నట్టల నిర్మూలన మందులు త్రాగించాలి.
- ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.
- పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకొట్టాలి, దీని వలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.
- డాక్టర్.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప.
Subscribe to:
Posts (Atom)