Saturday, 14 December 2019

మేకల్లో సంపర్కం :


  • మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలుండాలి.
  • ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి.
  • మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి.
  • మేకలు ఎదలో 1-3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమీ చేసిన మేకపోతును వదలాలి. ఇది ఎదలో వున్న మేకలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
  • ఎదలో వున్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మేకలకు సరిపోతుంది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి,కడప.