Saturday, 9 March 2019
ఒంగోలుజాతి పశువుల ప్రత్యేక లక్షణాలు
వంశ పారపర్య అవ లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి.
గర్భ సంబంద, పొదుగు సంబంద వ్యాధులు అసలు కనిపించవు
ఖనిజ లవణ మరియు ధాతువు లోపాలు వల్ల వచ్చే వ్యాధులు చాలా అరుదు.
కొవ్వు పదార్థం కండరంలో ఉంటుంది. మిగతా పశువుల్లో మాదిరిగా చర్మం కింద పేరుకోదు.
వీటి చర్మం మీద ఉండే వెంట్రుకలు అతి నీలలోహిత కిరణాలు శరీరంలోకి ప్రసరించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పశువులు అధిక వేడిని, క్రిముల దాడిని తట్టుకోగలుగుతాయి. అదిక నిరోధక శక్తి ఉంటుంది.
ఈ పశువుల్లో మనం చర్మం తాకినప్పుడు కదులుతుంది దీనికి కారణం కావర్నోసాస్ కండరాలు ఉండడం. చర్మం కింద ఉండే పెనిక్యుల స్కార్నోసిస్ అనే ప్రత్యేక కండరం అమరిక వల్ల పశువు తన ఇష్టానుసారం శరీరాన్ని జలదరిస్తుంది. దీనివల్ల దోమలు జోరీగల ద్వార వచ్చే వ్యాధులు నివారించబడతాయి.
ఈ జాతి పశువులకు తిన్న మేతను ఉత్పాదక శక్తిగా మలచుకునే సామర్థ్యం ఎక్కువ.
ఈ ఆవుల నుంచి వచ్చే పాలల్లో ఒమేగా ఆమ్లాలు, సంయుక్త లినోలెనిక్ ఆమ్లాలు మరియు కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల, పాలు తాగిన వారిలో మనిషి మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది మరియు క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉంటాయి.
ఒంగోలు జాతి పశువులు అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా తమ జీర్ణక్రియ వేగాన్ని నియంత్రించుకోగలవు. దీనివల్ల వీటికి జీర్ణ సంబంధమైన వ్యాధుల బెడద తక్కువ.
ఆవుల్లో మాతత్వపు భావనలు ఎక్కువగా ఉండడం వల్ల దూడల పోషణ తేలిక.
స్వేద గ్రంధుల వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుంది కనుక తక్కువ శ్వాసక్రియతో ఉష్ణతాపాన్ని తట్టుకోగలుగుతుంది. అంతేగాక చర్మంలో ఉండే చెమట గ్రంధుల నుండి వచ్చే స్వేదం మైనమువలే ఉండి క్రిమి కీటకాలు వచ్చి వాలినపుడు పట్టు చిక్కక జారిపోతాయి మరియు గజ్జి వంటి చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.
విదేశీ, సంకర జాతి ఆవు పాలలో ఉన్న కాన్సర్, అల్జీమర్స్, గర్భస్థ మధుమేహ వ్యాధి ప్రేరకాలు ఒంగోలు జాతి ఆవు పాలలో ఉండవు. దీనివల్ల బాహ్య పరాన్నజీవులు వాటి దగ్గరికి రావు. ఈ లక్షణం విదేశీ, సంకర జాతి పశువులకు లేదు.
Subscribe to:
Posts (Atom)