Monday, 13 August 2018

కడక్ నాథ్ జాతి - ప్రసిద్ధ భారతీయ నాటు జాతి

కడక్ నాథ్ జాతి - ప్రసిద్ధ భారతీయ నాటు జాతి

కడక్నాథ్ ప్రాచుర్యం
అత్యంత విలువైన పెరటి జాతి నాటు కోడి. అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ జాతి కోళ్లలో కడక్నాధ్ ఒకటి. ఈ కోడి అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. “కడక్నాథ్" అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే అనువైన జాతికి చెందిన నాటుకోడి. ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు ఈ కోడిని ఎక్కువగా పెంచుతారు. అంతరించి పోతున్న నాటు కోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్ళనుకూడా పెంచవచ్చని మాంసంలో పోషక అధికం అని శాస్రవేత్తలు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు.

కడక్ నాథ్ జాతి ప్రత్యేకతలు
ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి.
కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా దీనికి చాలా ఔషధ విలువలతోపాటు. సెక్సు సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఆదివాసులు దీని రక్తాన్ని చాలా దీర్ఘకాల జబ్బులకు ఉపయోగిస్తారు. అంతేగాక కడక్నాథ్ కోడి మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. ముదురు నీలం రంగుతో ఉండే ఈకలు, చర్మం, మాంసంతో పాటు ఈ కోళ్ళ రక్తం నలుపు రంగులో ఉంటుంది. వీటి మాంసం, రక్తం అత్యంత అరుదైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. గిరిజనుల మూలికా వైద్యంలో సైతం ఈ కోళ్ళ రకాన్ని వాడతారు.
కడక్నాధ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు.

ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది.
కడక్నాథ్ పోషక విలువలు ప్రాముఖ్యత
అత్యంత అరుదైన సూక్ష్మపోషకాలు రక్తంలోనూ, మాంసంలోనూ ఉన్నాయి. మెలనిన్ అనే పదార్థం ఈ జాతి కోళ్ళలో అధికంగా ఉంటుంది. ఈ మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రావం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు. సాధారణ 8 మాంసంతో పోలిస్తే ఈ జాతి కోళ్ళ మాంసంలో అధిక మాంసకృత్తులు, లినోలెనిక్ ఆమూలు, తక్కువ కొవ్వు పదార్ధాలు ఉన్నాయి. వీటి మాంసంలో మెలనిన్ పదార్థం అధిక మొత్తంలో ఉండడం వల్ల, పురుషుల్లో నరాల బలహీనతకు, పురుషుల్లో వంధ్యత్వ నిరోధానికి సైతం వాడతారు. అలాగే దీని మాంసానికి వయాగ్రాల పని చేసే లక్షణం సైతం ఉందని శాస్త్రవేత్తల వాదన.
ఈ కోడి మాంసంలో బి1 బి2, బి6, బి12తో పాటు సి, ఈ విటమిను అధికంగా ఉంటాయి. పాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బి2 అధికంగా ఉండటం వలన నిమ్మోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది.
వాటితో పాటు అనేక సూల, సూక్ష్మధాతువులు కలిగి ఉండడం వల్ల కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో కడక్నాథ్ మాంసం గుండెకి రక్త ప్రసారాన్ని అభివృద్ధి పరుస్తుందని రుజువయింది.
సాధారణ కోడి మాంసంతో పోలిస్తే ఈ జాతి కోడి మాంసంలో మాంసకృతులు  ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ. 8 అమైనో ఆమూలతో పాటు, 18 అమైనో ఆమూలు వీటి వూం నంలో ఉన్నట్ను శాస్తవేత్తలు ధ్రువీకరించారు. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
వీటి గుడ్లని తలనొప్పి నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్ళీన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం.
గుడ్లు, మాంసంలో ప్రొటీన్లు (25.47%), ఇనుము ఎక్కువగా ఉంటుంది.
20 వారాల వయస్సులో 920 గ్రాముల బరువు ఉంటుంది.
గుడ్లు పెట్టే వయస్సు - 180 రోజులు.
సంవత్సరానికి గుడ్ల ఉత్పత్తి – 105.
40 వారాల వయస్సుకి గుడ్ల బరువు 49 గ్రా.
గుడ్లు పెట్టే సామర్థ్యం - 55%.
అధిక వృద్ధి శాతానికి షెడ్లల్లో 6 కోళ్ళకు, ఒక పుంజుచాలు.

దాణా
తొలి దశలో పొడి లేదా నూక రూపంలో ఉండే మేతనే దాణాగా ఇవ్వాలి. ఎటువంటి వంట వ్యర్ధాలనైన అరిగించుకోగలడం వీటి ప్రత్యేకత.
రోగనిరోధక టీకాలు
కొక్కెర తెగులుకు- 7వ, 28 వ రోజు, 9, 18,41, 56వ వారాల్లో కొక్కెర తెగులు నివారణకు టీకా ఇవ్వాలి. 15వ 21వ రోజుల్లో - గంబోర

అలాగే ఇతర వాటితో పోలిస్తే, ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడు పెట్టడం ప్రారంభిస్తాయి. సాలుకు సుమారు నూరు గుడ్ల వరకు ఇస్తుంది. కోడి పిల్లలకు మొదటి 6 వారాల పాటు బ్రూడింగ్ పద్ధతిలో వేడిమి అందచేయడం అవసరం. ఆ తరువాత పెరటి పెంపకానికి అలవాటు చేయవచ్చు

కడక్నాథ్ జాతిలోని ప్రతికూల విషయాలు
అధిక డిమాండ్, సహజ మేతతో నిదానంగా పెరగడం, పిల్లల దశలోనే 50 శాతం మరణించడం వంటి కారణాల వల్ల, ఈ జాతి కోళ్లు వృద్ధి చెందడం లేదు. అంతరించిపోతున్న కదక్ నాడ జాతి నాటు కోళ్లను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం కూడా ఈ జాతి అంతరించి పోకుండా, వీటి సంఖ్యను పెంచే దిశగా చర్యలు జరుపుతుంది. కడక్నాథ్ జాతి నుంచి కారిశ్యామ పేరుతో సంకరజాతిని ఇజాత్ నగర్ లోని కేంద్ర పక్షిజాతుల అభివృద్ధి సంస్థ (కారి)లో అభివృద్ధి చేశారు.
కారీశ్వామా (కడక్నాథ్ క్రాస్)
ప్రాంతీయంగా "కలమాశి" అంటారు, అంటే దీని అర్థం నల్లని మాంసం కలది - మధ్యప్రదేశ్లోని జాబ్యూ, ధర్ జిల్లాలు, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ.మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి.

కదకనాథ్ కోళ్ళు కావాలనే వాళ్ళు పై యాప్ లో ఆర్డర్ పెట్టవచ్చును

పాడిపశువుల పోషణ లాభదాయకంగా ఉండాలంటే.🐄🐄🐄

పాడిపశువుల పోషణ లాభదాయకంగా ఉండాలంటే.🐄🐄🐄

పాడి పశువుల ఖరీదు, మేపుఖర్చు, పాల ఉత్పత్తి ఖర్చుకు, పాలకు వచ్చే ధరకు వ్యత్యాసం, కూలీల ఖర్చు వెుదలగు అంశాలవల్ల పాడి వరి శ్రవును లాభాలబాటలో తీసుకెళ్ళడం కత్తిమీద సాగులాగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాడినే నమ్మకుని, జీవనాధారం పొందుతున్నరైతాంగం కింది విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే, క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అందువల్ల పశుపోషకులు ఒక్కసారి వీటిపై దృష్టిసారించి ఆచరించండి.

పశువుల సంఖ్యకు, ప్రాధాన్యత ఇవ్వకుండా, అధిక పాలసారవంటి పశువునాణ్యతకు ప్రాముఖ్యతనిసూ, ఎచ్.ఎఫ్., జర్సి, ముర్రాజాతి పశువుల్ని మాత్రమే పోషిస్తున్నారా?
పాడిపశువులు ఫ్రీగా తిరిగి మేతమేసూ, నీళ్ళు తాగడానికి వీలుగా కట్టివేయకుండా పోషిస్తున్నారా?
ఈనిన పశువుల్ని ఈనిన 2-3 మాసాల్లోనే చూలి కట్టించే ప్రయత్నం చేస్తున్నారా?
పశువులు చూడి కట్టించడానికి కృత్రిమ గరోత్పత్తి విధానాన్ని ఆచరిస్తున్నారా?
కట్టిన, పొర్లిన పశువుల చూడి నిర్ధారణ 3 మాసాలకు చేయిస్తున్నారా?
ఈనే 2 మాసాల ముందు వట్టిపోనిస్తున్నారా?
పుట్టిన దూడలకు నట్టల మందు తాగిసూ, చిన్న వయస్సులో మరణాలబారిన పడకుండా శ్రద్ధ తీసుకుంటున్నారా?
పుట్టిన దూడలకు, పుట్టిన అరగంటలోగా జన్నుపాలు తాగిస్తున్నారా ?
పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గడానికి పచ్చిమేత సాగుచేస్తున్నారా ?
వ్యవసాయ ఉత్పత్తులను వృథాగా పడేయకుండా, మేపుకు ముందే సమకూర్చుకుంటున్నారా?
పశుగ్రాసాల సాగుతోపాటు, లూసర్స్, అలసంద, వటి పశుగ్రాసాల్ని కూడా సాగుచేస్తున్నారా ?
సంవత్సరంలో ప్రతిఏటా ఎదురయ్యే కనీసం 4 వూ సాల న వుయుంలో వ శువులకు అందించడానికి సైలేజి లేదా పశుగ్రాస నిలువ చేసుకుంటున్నారా ?
పాడి పశువులకు సంవత్సరంలో 2 సార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నారా ?
అంతర పరాన్న జీవుల నిర్మూలనకు సంవత్సరంలో కనీసం 3 సార్లు మందులు వాడుతున్నారా ?
ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులు సిద్ధంగా ఉంచుకున్నారా ?
పాలు పితికినతర్వాత, ఆలస్యం చేయకుండా పాలసేకరణ కేంద్రానికి చేరుస్తున్నారా ?
పాలల్లో వెన్నశాతం పెరిగి, అధిక రేటు పొందడానికి వేుపు పాలు పితకడం, యూ జవూన్యం విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారా?
లేబర్ పై పూర్తిగా ఆధారపడకుండా, స్వతంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ?
పశువుపోషణకు సంబంధిత రికారులు రోజూ రాసుకుంటున్నారా ? ప్రతిరోజు పశువులకు కనీసం 100 గ్రా. ఖనిజలవణ మిశ్రమం అందిస్తున్నారా
ఉత్పత్తి అయిన పాలకు అధిక ధర వచ్చేవిధంగా మార్కెటింగ్ గురించి వ్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా?
పశువైద్యుల సేవలు అత్యవసర సమయాల్లో అందేందుకు చర్యలు తీసుకున్నారా ?
పశువులకు బీమా చేయించారా ?
వేసవిలో అధిక వరాలు, చలిగాలుల సమయాల్లో పశువుల సంరక్షణకు శ్రద్ధ తీసుకుంటున్నారా?
పశువులపై, ఫారాల్లో బాహ్యపరాన్నజీవుల్ని క్రమం తప్పకుండా నిర్మూలిస్తున్నారా ?

నోరు మరియు కాలి వ్యాధి(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్)

నోరు మరియు కాలి వ్యాధి

నోరు మరియు కాలి వ్యాధి(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) పశువులు,గొర్రెలు,మేకలు,పందులు మొదలైన చీలుగిట్టలుండే జంతువుల్లో సంభవించే ఒకానొక తీవ్రమైన వైరల్ అంటువ్యాధి.ఈవ్యాధి భారతదేశములో ప్రబలంగా ఉంది,తద్వారా,పశుగణాల సంబంధిత ఎగుమతుల మీద నిషేధం వుంది ,ఈ వ్యాధిబాధితులైన పశువుల వల్ల వాటి ఉత్పాదకత తగ్గటం తో దేశానికి తీవ్రమైన ఆర్ధిక నష్టం కలుగుతుంది.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన జ్వరం
పాల దిగుబడి తగ్గటం
నోటిలోను మూతి మీద,కాళ్ళమీద,పొదుగు మీద పుళ్ళు,బొబ్బలు కనిపిస్తాయి
కాళ్లమీద పుళ్ళు,బొబ్బల మూలంగా కుంటడం
నోటి నుంచి విపరీతంగా నురగ కార్చటం

ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది
ఫుట్ అండ్ మౌత్ వ్యాధికి గురైన పశువుల లోని అంతస్స్రావాలు వాటి లాలాజలము,పాలు మరియు వాటి పుండ్ల నుంచి కారే రసి లాంటి వంటి విసర్జనలవల్ల,ఈ వ్యాధి కారక వైరస్ లు వ్యాపిస్తాయి.
ఈ వ్యాధి కారక క్రిమి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది,ముఖ్యంగా గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు ఒక చోటు నుండి మరొక చోటుకు త్వరితంగా వ్యాపిస్తుంది.
వ్యాధిపీడిత పశువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న వాటికి కలుషిత ఆహారం.నీరు,వ్యవసాయపనిముట్లు మొదలైన వాటి వల్ల,అలాగే కుక్కలు,పక్షులు,పొలం పనివారి రాకపొకల వల్ల కూడా ఫుట్ అండ్ మౌత్ వ్యాధి సంక్రమిస్తుంది.
ఈ వ్యాధికి గురైన గొర్రెలు,పందులు అసాధారణమోతాదులో ఈ వ్యాధికారక వైరస్ ను విసర్జించి ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వ్యాప్తిచెందటంలో కీలకపాత్ర పోషిస్తాయి,
దేశవాళీ పశువుల కన్నా సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధిబారిన పడతాయి,
వ్యాధిపీడిత పశువులను ఒకచోటి నుంచి మరొకచోటికి రవాణా చెయ్యటం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి సంక్రమించిన అనంతరం కలిగే పరిణామాలేమిటి?
వ్యాధిబారిన పడ్డ పశువుల్లో గర్భధారణ విఫలమవుతుంది,వేడిని తట్టుకోలేకపోవటం,పాలదిగుబడి తగ్గిపోతుంది

వ్యాధి వ్యాప్తి చెందకుండా నియత్రించటం ఎలా?
వ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతాలకు ఆరోగ్యంగా ఉన్న పశువులను తరలించకూడదు
వ్యాధి వ్యాపించి ఉన్న ప్రదేశాల నుండి పశువులను కొనుగోలు చెయ్యకూడదు
క్రొత్తగా కొన్న పశువులను,క్షేత్రం లోని మిగిలిన పశువులనుండి ఎడంగా ఉంచాలి

చికిత్స
ఫుట్ అండ్ మౌత్ వ్యాధిపీడిత పశువుల పుండ్లను ఒక్కశాతం పొటాషియం పెర్మాంగనేటు ద్రావణం తో కడగవచ్చు.కాళ్ళ మీద బొబ్బలకు యాంటీ-సెప్టిక్,నోటి లోని పుళ్ళకు బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ వాడవచ్చు
జబ్బుపడ్డ పశువులకు ఉపశమనం కలిగించే మందులు మరియు యాంటి బయోటిక్ లు వాడాలి. జావి దాణామాత్రం పెట్టటం,అలాగే వాటిని ఆరోగ్యంగా ఉన్న పశువులనుంచి దూరం చెయ్యటం చేసుకోవాలి

వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీతసమయాలు
వ్యాధి వచ్చిందని అనుమానమున్న పశువులన్నిటికీ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ప్రతి ఆరునెలలకు వేయించాలి.ఈకార్యక్రమం లో పశువులు,గొర్రెలు,మేకలు మరియు పందులు అన్నిటికి వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.
దూడలకు మొదటి టీకా నాలుగు నెలలవయసులో,రెండవ టీకా అయిదవ నెలలో,అక్కడి నుంచి ప్రతి నాలుగు-ఆరు నెలలకు ఒకసారి

పశువులు సంఖ్య చిట్కాలు:

పశువులు సంఖ్య చిట్కాలు:
పశువుల మరియు జీవాల సంఖ్య ఆ ప్రాంతంలోని పశుగ్రాస ఉత్పత్తి, వాటి పోషకవిలువలు మరియు పశుగ్రాస నిల్వలకు లోబడి ఉండాలి. పాలు తక్కువ ఇచ్చే నాటు రకం పశువుల స్థానంలో, అధిక దిగుబడినిచ్చే మేలు జాతి పశువులను ఎ0పిక చేసుకోవాలి. రోజుకు ఒక లీటరు పాలు ఇచ్చే పది పాడి పశువులకంటే, పది లీటర్లు. ఇచ్చే ఒక్క పాడి పశువును పొషించడం చాలా లాభదాయకం మరియు తేలిక. ఎందుకంటే పది లీటర్లు పాలు ఇచ్చే ఒక పాడి పశువుకు కావలసిన పచ్చగడ్డి, ఎండుమేతను రైతు తనపొలంలోనే సాగు చేసుకోవచ్చు. దానిని రోజు గమనించి మంచి చెడ్డలను తక్కువ సమయంలో చూడవచ్చు. అదే విధంగా, ఎక్కువ సంఖ్యలో నాటు రకం జీవాల పెంపకం కంటే కవల పిల్లలను ఇచ్చి తక్కువ కాలంలో అధిక బరువు పెరిగే కొన్నిమంచి జాతిజీవాలను ఉంచుకోవడం ఉత్తమం. కాబట్టి ప్రతి రైతు విధిగా తమకున్న ప్రాంతంలోని పశుగ్రాస ఉత్పత్తి మరియు వాటి పోషక విలువలను బట్టి తగిన సంఖ్యలో పశువులను. జీవాలను పెంచుకోవాలి. 400 కిలోల ముర్రా పాడి గేదెలకు/సంకర జాతి పాడి పశువులకు, ఇంట్లోకట్టివేసి పూర్తిగా పచ్చి మేతతో మేపటానికి వాటి పాల దిగుబడిని బట్టి రోజుకు 30-40 కిలోల పశుగ్రాసం కావాలి లేదా 5-6 కిలోల ఎండుగడ్డి, 10-15 కిలోల పచ్చిగడ్డి, దాణా (ఆవులకు ప్రతి 3 లీటర్ల పాల దిగుబడికి ఒక కిలో చొప్పున దాణా) కావాలి. అదేవిధంగా 250-300 లీటర్ల పాల కిలోల బరువు ఉండే దేశవాళి నాటు రకం పశుగ్రాసపు మేత కావాలి లేదా 4-5 కిలోల ఎండుగడ్డి, 4-6 కిలోల పచ్చిగడ్డి మరియు పైన వివరించిన విధంగా దాణా కావాలి. ఈ విధంగా నీటి వసతి గల భూమిలో ఎకరానికి 5-6 లేదా వర్షాధార భూమిలో 2-3 ముర్రా పాడి గేదెలను/సంకర జాతి పాడి పశువులను పోషించవచ్చు. రోజుకి 4-6 గంటలు బీళ్ళు మరియు బంజరు భూములలో మేసే పసువులకు కాలాన్ని బట్టి పైన చెప్పిన పశుగ్రాసంలో 40-60 శాతం మేత ఇంటివద్ద ఇవ్వటం ద్వారా నీటి వసతి గల భూమిలో ఎకరానికి 8-10 లేదా వర్షాధార భూమిలో 4-5 ముర్రా పాడి గేదెలను/సంకర జాతి పాడి పశువులను పోషించవచ్చు.

పశువులలో గొడ్డు మోతుతనానికి (వంధ్యత్వం) గల కారణాలు మరియు చికిత్సా పద్ధతులు

పశువులలో గొడ్డు మోతుతనానికి (వంధ్యత్వం) గల కారణాలు మరియు చికిత్సా పద్ధతులు

పశువులలో గొడ్డు మోతుతనం వలన విపరీతమైన ఆర్ధిక నష్టం వాటిల్లి భారత దేశంలో పాడి పరిశ్రమ కుంటుపడుతోంది. గొడ్డుపోయిన పశువుల పోషణ ఆర్ధికపరంగా భారమౌతుంది. చాలా దేశాలలో అలాంటి పశువులను కబేళాలకు తరలిస్తారు.
పశువులలో గొడ్డు మోతు తనం వలన, ఇతర పునరోత్పత్తి సమస్యల వలన పాల ఉత్పత్తి 10-30 శాతం వరకూ తగ్గిపోతోంది. పశువులలో సంతానోత్పత్తి పెరగడానికి ఆడ పశువులకు, మగ పశువులకు మేతను బాగా ఇచ్చి, రోగాలేవీ లేకుండా చూసుకోవాలి.

పశువులలో వంధ్యతకు గల కారణాలు
గొడ్డు మోతుతనానికి గల కారణాలు అనేకం మరియు సంక్లిష్టమైనవి. సంతానోత్పత్తి జరుగకపోవడానికి పోషకాహార లోపం, అంటువ్యాధులు, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాలు, యాజమాన్య దోషాలు మరియు ఆడ పశువులలో అండోత్సర్గం లేక హార్మోను సమతుల్యత లేకపోవడం కారణాలు కావచ్చు.

ఋతు చక్రం
ఆవులు, గేదెలు కూడా 18-21 రోజులకొకసారి 18-24 గంటల పాటు ఎదకు వస్తాయి. అయితే గేదెలలో మూగ ఎద ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని తెలుసుకోవటం రైతులకు పెద్ద సమస్యగా మారుతుంది. తెల్లవారు ఝాము నుండి రాత్రి పొద్దు పోయేంత వరకూ 4 -5 సార్లు పశువులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పశువులు ఎదకు రావడాన్ని పసికట్టలేక పోయినట్లయితే వంధ్యత్వం పెరుగుతుంది. కంటికి కనిపించే లక్షణాలను బట్టి ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి మంచి నైపుణ్యం కావాలి. రికార్డులను సరిగా పెట్టుకుని పశువులను పరికించడంలో ఎక్కువ సమయం గడిపిన రైతులు మరింత మంచి ఫలితాలు సాధించారు.

గొడ్డు మోతుతనం నివారించడానికి చిట్కాలు

గర్భధారణ ఎద సమయంలో జరిగేటట్లు చూసుకోవాలి.
పశువులు ఎదకు రాకపోయినా లేక ఋతుచక్రం సరిగా లేకపోయినా వాటికి పరీక్ష చేయించి, చికిత్స ఇప్పించాలి.
పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి ఆరు నెలలకొకసారి కడుపులోని ఏలికపాములను అరికట్టడానికి మందు ఇప్పించాలి. క్రమం తప్పకుండా కడుపులోని ఏలికపాములను నివారించడం మీద పెట్టిన చిన్న పెట్టుబడి, పాల సరఫరాలో పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించి పెడుతుంది.
పశువులకు శక్తి నిచ్చే, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు మరియు విటమిన్ అనుబంధంతో కూడుకున్న సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. దీని వలన గర్భధారణ శాతం పెరిగి, గర్భం ఆరోగ్యకరంగా నిలిచి, ప్రసవం సురక్షితంగా జరిగి, అంటువ్యాధులు రాకుండా ఉండి దూడ ఆరోగ్యంగా ఉంటుంది.
దూడలకు / పెయ్యలకు మంచి పోషణ ఇచ్చి సంరక్షిస్తే 230 -250 కిలోల వరకూ బరువు పెరిగి సకాలంలో యుక్త వయస్సుకు వచ్చి, గర్భధారణకు అనువుగా తయారై సంతానోత్పత్తికి అవకాశాలు మెరుగుపడతాయి.
చూడి పశువులకు సరిపడినంత పచ్చి మేత మేపితే పుట్టిన దూడలకి అంధత్వం రాకుండా ఉంటుంది. దూడ పుట్టగానే మాయ కూడా సులభంగా పడిపోతుంది.
సహజంగా జరిగే గర్భాదారణలో, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలు మరియు అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఆబోతు (లేక దున్నపోతు) యొక్క పునరుత్పత్తి చరిత్ర తెలిసి ఉండడం చాలా ముఖ్యం.
పశువుల పునరుత్ర్పత్తి ప్రక్రియ మరియు ప్రసవం పరిశుభ్రమైన పరిస్థితులలో జరిపించినట్లయితే చాలావరకూ గర్భసంచికి అంటువ్యాధులు సోకకుండా నివారించుకోవచ్చు.
కృత్రిమ సంపర్కం జరిపించిన 60-90 రోజులకు, పశువులు చూలు కట్టిందీ లేనిదీ పశు వైద్యులతో పరీక్ష చేయించి ధ్రువపరచుకోవాలి.
చూలు కట్టిన పక్షంలో ఇంక ఆవు (లేక గేదె) గర్భధారణ కాలంలో ఎదకు రాదు. ఆవుకి గర్భావధి కాలం 285 రోజులు, మరి గేదెలకు 300 రోజులు.
గర్భధారణ చివరి దశలలో అనవసరమైన ఆందోళన కలిగించ కూడదు మరియు అనవసరంగా ఎక్కడికీ తీసుకొని వెళ్ళరాదు.
మెరుగైన పోషణకు, ప్రసవ సమయంలో సంరక్షణ కొరకు చూడి పశువును మిగతా పశువులతో బాటు కాకుండా దూరంగా ఉంచాలి.
ప్రసవానికి రెండు నెలల ముందు చూడి పశువులను ఎండ గట్టి, తగినంత పోషణ మరియు వ్యాయామం ఇవ్వాలి. దీని వలన తల్లి పశువుకు ఆరోగ్యం మెరుగుపడి సగటు బరువు కల్గిన ఆరోగ్యవంతమైన దూడను ప్రసవిస్తుంది. అంతే కాకుండా వ్యాధులు సోకకుండా ఉండి తొందరగా ఋతు చక్రం తిరిగి మొదలౌతుంది.
ఈనిన నాలుగు నెలలలోపు లేక 120 రోజుల తరువాత మళ్ళీ గర్భధారణ మొదలైతే ఏడాదికి ఒక దూడ అన్న లక్ష్యం నెరవేరి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది.

పశువులలో కృత్రిమ గర్భధారణ/ గొర్రెలలో రక్త నులి పురుగులు/ గొర్రెలలో నీలి నాలుక వ్యాధి / సూపర్ నాపియర్ గడ్డి/ చిటుక వ్యాధి