Saturday, 27 June 2015

rabbit farming

కుందేలు పెంపకం

కుందేళ్ళ పెంపకం ఎందుకు?

  • మన దగ్గరున్న తక్కువ పెట్టుబడి మరియు చిన్న స్థలంలోనే ఈ కుందేళ్ళ పెంపకం వలన ఎక్కువ రాబడి వస్తుంది.
  • కుందేళ్ళు సామాన్యమైన మేతను తిని దానిని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటుంది.
  • మాంసం ఉత్పత్తి కొరకే కాకుండా దాని చర్మము మరియు బొచ్చు కొరకు కూడా ఈ కుందేళ్ళను పెంచవచ్చును.

కుందేళ్ళ పెంపకం ఎవరు చేయవచ్చు?

స్వంతభూమి లేని రైతులకు, నిరక్షరాస్యులైన యువతకు మరియు స్త్రీలకు ఈ కుందేళ్ళ పెంపకం పార్ట్ టైమ్ ఉద్యోగము వలె వుండి అదనపురాబడిని ఇస్తుంది.

కుందేళ్ళ పెంపకం వలన ఉపయోగాలు

  • కుందేళ్ళ పెంపకం ద్వారా నాణ్యమైన ఎక్కువ ప్రోటీన్ కల్గిన మాంసమును మన కుటుంబం కొరకు పొందవచ్చును.
  • సులువుగా మన ఇంట్లో లభ్యమయ్యే ఆకులు , వ్యర్థమైన కూరగాయలు, గింజలు మేతగా వేసి కుందేళ్ళను పెంచవచ్చు.
  • బ్రాయిలర్ కుందేళ్ళ పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మూడు నెలల వయస్సు లోనే రెండు కిలోగ్రాముల బరువు పెరుగుతుంది.
  • సంతతి పరిమాణం కుందేళ్ళలో చాలా ఎక్కువగా (సుమారు 8-12 వరకు)ఉంటుంది.
  • ఇతర మాంసాలతో పోల్చితే కుందేలు మాంసం అధికంగా మాంసకృత్తులు (21%), తక్కువ కొవ్వు (8%) కలిగి ఉంటుంది.కనుక పెద్దల నుండి పిల్లల వరకు ఈ మాంసం చాలా అనుకూలమైనది .

కుందేళ్ళ జాతులు

ఎక్కువ బరువున్న జాతులు: (4-6 కిలోలు)
  • తెల్ల (వైట్) జైంట్
  • బూడిద రంగు ( గ్రే ) జైంట్
  • ఫ్లెమిష్ జైంట్






మధ్యరకపు బరువున్న జాతులు: (3-4 కిలోలు)
  • న్యూజిలాండ్ వైట్ (తెల్లని)
  • న్యూజిలాండ్ రెడ్ (ఎర్రని)
  • కాలిఫోర్నియన్
తక్కువ బరువు ఉండే జాతులు: (2-3 కిలోలు)
  • సోవియట్ చిన్ చిల్లా
  • డచ్

కుందేళ్ళ పోషణలో పద్ధతులు






మన పెరడులో తక్కువ పెట్టుబడితో నిర్మించిన చిన్న గూడు (పాక) లో కుందేళ్ళను పెంచవచ్చు. వేసవి కాలం, వర్షాకాలం లాంటి వాతావరణ పరిస్థితుల నుండి మరియు కుక్కలు, పిల్లుల నుండి రక్షించుటకు గూడులను నిర్మించుట అవసరం.
కుందేళ్ళ పెంపకము రెండు విధానాలలో ఇంటి దగ్గర పెంచుకోవచ్చును.
ఎక్కువ (డీప్) కుందేళ్ళ పెంపక విధానము
ఈ పద్ధతి, తక్కువ సంఖ్యలో కుందేళ్ళను పెంచడానికి అనుగుణమైనది. కుందేళ్ళు నేలను రంధ్రాలు చేయకుండా అరికట్టడానికి గాను నేలను కాంక్రీటుతో గచ్చు చేయించాలి. వ్యర్థపదార్థాలయిన చెక్క నలి ధాన్యపు ఊక, ఎండుగడ్డితో నేలపై నాలుగు నుండి ఆరు అంగుళాల మందంగా నింపాలి. ఈ కుందేళ్ళ పెంపక (లిట్టర్) విధానము, ముప్ఫై కంటె ఎక్కువ కుందేళ్ళ పోషణకు సరియైనదికాదు.మగ కుందేళ్ళను విడిగా ఉంచాలి.ఎక్కువ పరిమాణంలో కుందేళ్ళ పెంపకం ఈ రకమైన విధానము లో పెంచకూడదు . ఈ పెంపక (లిట్టర్) విధానములో కుందేళ్ళు సులభంగా వ్యాధులకు గురి అవుతాయి. కుందేలు పిల్లల పెంపకం నిర్వాహణ కూడా ఈ పెంపక (లిట్టర్) విధానములో కష్టం.
బోను విధానము
కుందేళ్ళను పెంచడానికి అవసరమైన నేల
  • పెద్ద మగ కుందేలు – 4 చదరపు అడుగులు
  • ఆడ కుందేలు – 5 చదరపు అడుగులు
  • పిల్ల కుందేళ్ళు – 1.5 చదరపు అడుగులు
పెద్ద కుందేలు బోనుః
పెద్ద కుందేలు బోను 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు కలిగి ఉండాలి. ఇటువంటి
బోను ఒక పెద్ద కుందేలుకు గాని లేక రెండు పెరుగుచున్న కుందేళ్ళకు గాని సరిపోతుంది.
పెరుగుచున్న కుందేలు బోనుః
  • పొడవు – 3 అడుగులు
  • వెడల్పు- 1.5 అడుగులు
  • ఎత్తు – 1.5 అడుగులు
పైన చెప్పిన కొలతలు గల బోను 4-5 కుందేళ్ళు మూడు నెలల వయస్సు వరకు సరిపోతుంది.
పిల్ల కుందేళ్ళను సాకడానికి బోనులు:
పెరుగుతున్న కుందేళ్ళను సాకడానికి ఉంచే బోనులే, పిల్ల కుందేళ్ళను సాకడానికి పనికి వస్తాయి.
కాని బోను అడుగుభాగాన మరియు చుట్టూ ఉన్న అన్ని ప్రక్కలు 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి. దీని వల్ల కుందేలు పిల్లలు బోను బయటికి రాకుండా అరికట్టబడతాయి.
గూడు పెట్టె :
కుందేలు పిల్లలను సాకే కాలంలో సురక్షితమైన ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం ఈ గూడు పెట్టెలు చాలా అవసరం. ఈ గూడు పెట్టెలు జింకు పూతఉన్న ఇనుముతో గాని, చెక్కతో గాని తయారుచేయాలి. ఈ గూడు పెట్టెల పరిమాణం, బోనులో పట్టే విధంగా ఉండాలి.
గూడు పెట్టె కొలతలు :
  • పొడవు – 22 అంగుళాలు
  • వెడల్పు-12 అంగుళాలు
  • ఎత్తు – 12 అంగుళాలు





గూడు పెట్టెలు పై భాగము తెరచి ఉండేలా రూపొందించాలి. గూడు పెట్టె అడుగు భాగము 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి. పదిహేను సెంటీమీటర్ల వ్యాసము కల్గిన గుండ్రని రంధ్రాన్ని గూడు పెట్టె పొడవుగా నున్నభాగంవైపు అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో చేయాలి. ఆడ కుందేలు బోనులో నుండి గూడు పెట్టెలోనికి వెళ్ళుటకు ఈ రంధ్రం సహాయకారిగా ఉంటుంది. గూడు పెట్టె అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో రంధ్రాన్ని రూపొందించడం ద్వారా కుందేలు పిల్లలు గూడు పెట్టెలోనుండి బయటకు రావడాన్ని నివారిస్తుంది.
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు బోనులు :
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు, తెమ్మ చారని పదార్థంతో తయారుచేయాలి.
ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలుః
కుందేళ్ళ ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి. ఆహారపు తొట్టెలు ‘J ‘(జె) ఆకారంలో బోనులకు బయటి వైపున బిగింపబడి ఉండాలి. ఆహారానికి, నీటికి అయ్యే పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి వీటిని కప్పులలో కూడా పెట్టవచ్చు.

కుందేళ్ళ మేత యాజమాన్య పద్ధతులు

కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి మరియు చిక్కుళ్ళు, పచ్చిరొట్ట రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి మరియు వంటింటి వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు, ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి.
కుందేళ్ళ మేతలో ఉండవలసిన పోషకాలు:
పోషకాల వివరాలు
పెరుగుదల కొరకు
పోషణ కొరకు
గర్భాధారణ కొరకు
స్తన్యము కొరకు
జీర్ణమయ్యే శక్తి(కిలో కేలరీలు)
2500
2300
2500
2500
మాంసకృత్తులు (%)
18
16
17
19
పీచు పదార్థాలు (%)
10-13
13-14
10-13
10-13
కొవ్వు (%)
2
2
2
2
కుందేళ్ళ మేతలో యాజమాన్యం గుర్తుంచుకోవలసిన విషయాలు
  • కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయిఅందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం.
  • కుందేళ్ళకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి.
  • ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.
  • పౌష్టికాహారాన్ని చిన్న గుళికల రూపంలో ఇవ్వాలి. ఇలా చిన్న గుళికల రూపంలో ఇవ్వడం వీలుకాక పోయినట్లయితే పౌష్టికాహారానికి నీటిని కలిపి చిన్న ఉండల రూపంలో కుందేళ్ళకు ఇవ్వాలి.
  • ఒక కిలో బరువున్న కుందేలుకుః రోజుకు 40 గ్రాముల పౌష్టికాహారం మరియు 40 గ్రాముల పచ్చిరొట్ట ఇవ్వాలి.
  • కుందేళ్ళకు ఎల్లప్పుడూ తాజాగా ఉండే పచ్చిరొట్టను మేతగా ఇవ్వాలి. పచ్చిరొట్టను బోనులో నేల మీద వేయకూడదు కాని వాటిని బోనులో ప్రక్క భాగాలలోపలకు ఉంచవచ్చు.
  • కుందేళ్ళకు రోజంతాపం శుభ్రమైన, నీటిని ఇవ్వాలి.
కుందేలు రకం
దాదాపు శరీరం బరువు
మేతపరిమాణం రోజుకి (గ్రాములలో)
పౌష్టికాహారం మేత
పచ్చి రొట్ట
మగ కుందేలు
4 - 5 కిలో గ్రాములు
100
250
ఆడ కుందేలు
4 - 5 కిలో గ్రాములు
100
300
పాలిచ్చే మరియు గర్భస్థ కుందేలు
4- 5 కిలో గ్రాములు
150
150
కుందేలు పిల్లలు
0.6-0.7 కిలో గ్రాములు
50-75
150
పౌష్టకాహారం మిశ్రమము యొక్క పాళ్ళు :
చేర్చబడిన పదార్థములు
మొత్తం
మొక్కజొన్న రవ్వ (నూక)
30 భాగాలు
సజ్జల రవ్వ
30 భాగాలు
వేరుశనగ చెక్కపిండి
13 భాగాలు
గోధుమ పొట్టు
25 భాగాలు
ఖనిజ మిశ్రమం (లవణమిశ్రమం )
1.5 భాగాలు
ఉప్పు
0.5 భాగం

కుందేలు జాతి పెంపకంలో యాజమాన్య పద్ధతులు

సంతానోత్పత్తి వయస్సు
  • ఆడ కుందేలు - 5-6 నెలలు
  • మగ కుందేలు - 5-6 నెలలు (మగ కుందేలు - 5-6 నెలలు వయస్సు వచ్చినప్పటికీ ఒక సంవత్సరము తరువాత మాత్రమే సంతానోత్పత్తి కొరకు .వినియోగించాలి దిని వల్ల నాణ్యతగల కుందేళ్ళను పొందవచ్చు.
సంతానోత్పత్తి కొరకు కుందేళ్ళ ఎంపిక
  • సంతానోత్పత్తికై కుందేళ్ళను 5 - 8 నెలలు తరువాత పూర్తిగా బరువును సంతరించుకున్న తరువాత ఎంపిక చేయాలి.
  • ఎక్కువ సంతతి పరిమాణంఉన్న కుందేళ్ళనుంచి, మగ మరియు ఆడ కుందేళ్ళును సంతానోత్పత్తి కొరకు ఎంపికచేయాలి.
  • ఆరోగ్యవంతమైన కుందేళ్ళను మాత్రమే సంతానోత్పత్తికి ఎంపికచేయాలి. ఆరోగ్యవంతమైన కుందేళ్ళు చురుకుగా ఉంటాయి. మేత మరియు నీటిని మమూలుగా తీసుకుంటాయి. వీటన్నిటికీ మించి అవి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాయి.ఆరోగ్యకరమైన కుందేళ్ళ బొచ్చు పరిశుభ్రంగా , మెత్తగా మరియు మెరుపు గలిగి ఉంటాయి.
  • సంతానోత్పత్తికై ఉపయోగించే మగ కుందేళ్ళుకు పైన పేర్కొన్న లక్షణాలతో పాటు స్పష్టమైన బాగా క్రిందికి దిగిన రెండు వృషణాలు బీజకోశములో ఉంటుది .
  • మగ కుందేళ్ళను ఎంపిక చేసేటప్పుడు, వాటి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తెలుసు కోవడానికి మగ కుందేళ్ళను ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తారు.
ఆడకుందేళ్ళ జతకావడాన్కి లేదా ఎద సంకేతాలు
కుందేళ్ళలో ప్రత్యేకంగా గర్భధారణ సమయము అంటూ ఏదీలేదు. ఎప్పుడైతే ఆడ కుందేలు మగ కుందేలుతో జత కట్టనిస్తుందో అప్పుడు ఆడ కుందేలుకి గర్భధారణ సమయమని భావించాలి. ఒక్కొక్కప్పుడు ఆడ కుందేలు యోని ఎర్రగా ఉబ్బితే అది యదలు ఉన్నదని భావించాలి. ఎప్పుడైతే మగ కుందేలును యదలో ఉన్న లేదా గర్భధారణ కాంక్షలో నున్న ఆడ కుందేలు వద్దఉంచినపుడు ఆడ కుందేలు వీపుని నొక్కిపెట్టి వెనక భాగాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆడ కుందేలు యదలో లేక పోయి నట్లయితే, బోను మూలకు పోయి మగ కుందేలుపై దాడి చేస్తుంది.
కుందేళ్ళ గర్భధారణ
కుందేళ్ళ గర్భధారణ వివరములు
మగ, ఆడ కుందేళ్ళ నిష్పత్తి
1 :10
మొదటి కలయిక వయస్సు
5 – 6 నెలలు . మంచి సంతానోత్పత్తి కొరకు మగ కుందేళ్ళు ఒక సంవత్సరము వయస్సు వచ్చిన తరువాత మొదటిసారి ఆడ కుందేళ్ళతో జత కట్టిస్తే లిట్టర్ సైజు పెరుగుతుంది .
జతకట్టే సమయంలో ఆడ కుందేళ్ళ శారీరక బరువుః
2.25 -2.50 కిలో గ్రాములు
గర్భధారణ సమయం
28 -31 రోజులు
తల్లిపాలు త్రాగుట మాన్పించబడే వయస్సు
6 వారాలు
కాన్పు తరువాత జతకట్టే సమయం
కాన్పు లేదా కుందేలు పిల్లలు తల్లి పాలు త్రాగుట మానిన 6 వారాల తరువాత.
అమ్మదగిన వయస్సు
12 వారాలు
అమ్మకము సమయంలో ఉండవలసిన శరీరము బరువు
సుమారుగా రెండు కిలోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ
ఆడ కుందేలు యద లేదా గర్భధారణ సూచనలు వెల్లడించినప్పుడు, మగ కుందేళ్ళ బోను లోకి ప్రవేశపెడతారు. ఆడ కుందేలు జతకట్టే సరైన సమయంలో ఉంటే తోక ఎత్తి మగ కుందేలును జతకట్టడానికి ఆహ్వానిస్తుంది. జతకట్టే ప్రక్రియ విజయవంతగా పూర్తవగానే మగ కుందేలు ఒక ప్రక్కకు పడిపోతుంది మరియు ఒక నిర్ధిష్టమైన ధ్వనిని చేస్తుంది. ఒక మగ కుందేలును వారంలో మూడు లేదా నాలుగు రోజులకి మించి జత కట్టే కార్యక్రమంలో ఉపయోగించకూడదు. అదే విధంగా మగ కుందేలును రోజుకు రెండు లేదా మూడు సార్లుకి మించి జతకట్టు కార్యక్రమంలో ఉపయోగించ కూడదు. జతకట్టు కార్యక్రమంలో పాల్గొన్న మగ కుందేళ్ళకు సరిపడినంత విశ్రాంతి మరియు మంచి పోషకాహారము ఇవ్వాలి. కుందేళ్ళ సమూహంలో ప్రతి పది ఆడ కుందేళ్ళకు ఒక మగ కుందేలుని ఉంచాలి. ఒకటి లేదా రెండు మగ కుందేళ్ళని అదనంగా కుందేళ్ళ ఫారంలో పెంచవచ్చు. ఏదైనా కుందేలు వ్యాధి బారినపడినప్పుడు అదనంగా పెంచబడిన మగ కుందేళ్ళను జతకట్టే కార్యక్రమంలో ఉపయోగించవచ్చు.
బ్రాయిలర్ కుందేళ్ళ గర్భధారణ సమయం 28 – 31 రోజులు. ఆడ కుందేలు మగ కుందేలుతో జతకట్టిన 12-14 రోజుల తర్వాత మన చేతివేళ్ళతో వాటి ఉదరాన్ని తాకడం ద్వారా అవి గర్భంతో ఉన్నదీ లేనిదీ మనము తెలుసుకొనవచ్చును. గర్భనిర్ధారణను మన రెండువేళ్ళతో వాటి వెనుక కాళ్ళ మధ్యనగల పొత్తికడుపును స్పర్శించుటద్వారా తెలుసుకొనవచ్చును. ఒక గుండ్రటి గడ్డ వంటిది వ్రేళ్ళకు తగిలితే ఆ కుందేలు గర్భం ధరించిందని భావించాలి. జతకట్టిన 12-14 రోజుల తర్వాత కూడా ఆడ కుందేలు గర్భం ధరించకపోతే వాటిని తిరిగి మగ కుందేలుతో జతకట్టిస్తారు. ఆ విధంగా ఆడ కుందేలు మూడుసార్లు మగ కుందేలుతో జతకట్టించిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే ఆ కుందేలుని ఆ పెంపక కేంద్రం నుండి వేరు చేయాలి .

జతకట్టిన 25 రోజుల తర్వాత గర్భస్థ కుందేళ్ళ శారీరక బరువు 500-700గ్రాములు పెరుగుతుంది. ఈ పెరిగిన బరువును ఆ కుందేళ్ళను పైకెత్తుట ద్వారా గమనించవచ్చు. గర్భస్థ కుందేలును మగ కుందేళ్ళ వద్దకు పంపినట్లయితే అవి జతకట్టవు.
గర్భం దాల్చిన ఆడకుందేళ్ళ సంరక్షణ
గర్భనిర్ధారణ జరిగిన తర్వాత వాటికి ఎక్కువ మొత్తంలో అధిక పోషణగల మేతను 100 నుండి 150 గ్రాముల సాధారణ మేత కంటే అధికంగా ఇవ్వాలి. ఆ గర్భం దాల్చిన కుందేళ్ళను 25 రోజుల తర్వాత పిల్లలను కనే బోనులోకి మార్చాలి. కాన్పుకు ఐదు రోజుల ముందు గూడు పెట్టెను బోనులోకి చేర్చాలి. ఎండు కొబ్బరి పీచు లేదా వరిగడ్డిని మెత్తగా బోను క్రింది భాగంలో పేర్చాలి . గర్భస్థకుందేలు తన పొట్టపై నున్న వెంట్రుకలను పీక్కొని, ఒకటి లేదా రెండు రోజులలో ఈనుటకు ముందు,వాటి పిల్లలకు గూడులా ఏర్పాటు చేస్తాయి. ఈ సమయంలో కుందేళ్ళ ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరిని బోను వద్దకు అనుమతించరాదు.
మామూలుగా ఉదయం వేళలో కుందేళ్ళు ఈనడం జరుగుతుంది. ఈనడానికి 15 నుండి 30 నిమిషములు పడుతుంది. ఆ తల్లి కుందేలు ఉదయమే తన పిల్లలను తానే శుభ్ర పరుస్తుంది. ప్రతి రోజు ఉదయమే గూడు పెట్టెను పరిశీలించాలి. చనిపోయిన పిల్లలను గూడు పెట్టె నుంచి తొలగించాలి. గూడు పెట్టెను పరిశీలిస్తున్నపుడు తల్లి కుందేలు కలతచెందుతుంది. అందువల్ల తల్లి కుందేలును గూడు పెట్టె పరిశీలనకు ముందే అక్కడనుంచి తొలగించాలి.
క్రొత్తగా ఈనబడిన కుందేళ్ళ పిల్లలు మరియు వాటి సంరక్షణ యాజమాన్య విధానాలు :
పుట్టిని కుందేలు పిల్లల కళ్ళు మూసుకుని ఉంటాయి. వాటి శరీరంపై ఏ విధమైన బొచ్చు ఉండదు. చిన్న కుందేలు పిల్లలు వాటి తల్లి ప్రక్కనే ఆ తల్లిచే తయారుచేయబడిన పడుకపై పడుకొని ఉంటాయి. మామూలుగా తల్లి కుందేలు తన పిల్లలకు రోజుకు ఉదయం ఒక్కసారి పాలిస్తుంది. కాని మనం తప్పనిసరిగా పిల్లలను తల్లి కుందేలు పాలను త్రాగుటకు ప్రయత్నం చేస్తే ఏ విధమైన పాలు తల్లి కుందేలు నుండి రావు.తల్లి కుందేలు నుండి సరిపడు పాలును త్రాగుచున్న పిల్ల కుందేళ్ళ శరీరము మెరుస్తూ ఉంటుంది. కాని తల్లి కుందేలు నుండి సరిపడ పాలు త్రాగని పిల్ల కుందేళ్ళ శరీరము పొడిగాను మరియు ముడతలు పడి ఉంటుంది. మరియు వాటి శారీరక ఉష్ణోగ్రత తక్కువగా వుండి అవి బద్ధకంగా ఉన్నట్లు కనిపిస్తాయి.
మారు తల్లి కుందేలుచే పెంపక విధానము
మామూలుగా ఆడ కుందేలు పొదుగులో 8 – 12 చను మొనలుంటాయి. ఒక కాన్పులో ఈనబడిన పిల్లల సంఖ్య కంటె పొదుగులో చనుమొనల సంఖ్య తక్కువగా ఉంటే క్రొత్తగా ఈనబడిన పిల్లలకు సరిపడు ప్రమాణంలో పాలను పొందలేవు కనుక దాని ఫలితంగా పిల్లలు చనిపోతాయి. దీనికి అదనంగా పలురకాల పరిస్థతులు అనగా తల్లి కుందేలు చనిపోవటం, తల్లి సంరక్షణ లేకపోవడం, బోనులోనుండి పిల్లలు బయటకు పడిపోవడం వల్ల తల్లికుందేలు తన పిల్లలను గుర్తించలేకపోవడం వల్ల మారు తల్లికుందేలును పిల్లల పోషణలో ఉపయోగిస్తారు.
క్రొత్తగా ఈనబడిన కుందేలు పిల్లలు మారు తల్లి కుందేళ్ళ సంరక్షణలో మార్పు చేసినపుడు గుర్తించుకోవలసిన విషయాలు
  • క్రొత్తగా ఈనబడిన కుందేలు పిల్లల వయస్సు మరియు వాటిని సంరక్షణ చేసే మారుతల్లి యొక్క పిల్లల వయస్సు వ్యత్యాసము 48 గంటలు మించి ఉండరాదు.
  • ఒకేసారి మనము మూడు కంటే ఎక్కువ కుందేలు పిల్లలను ఒక మారుతల్లి దగ్గర కు మార్చరాదు.
తల్లిపాలు మానేసిన పసి కుందేళ్ళు లేక చిన్న కుందేళ్ళు
పిల్ల కుందేళ్ళు మొదటి మూడు వారాల వయస్సు వచ్చు వరకు గూడు పెట్టెలో ఉంచబడతాయి. ఆ తర్వాత గూడు పెట్టెలను బోనులో నుండి తీసివేస్తారు. పసి కుందేళ్ళకి తల్లిపాలు 4 – 6 వారాల వరకు ఇవ్వవచ్చు. తల్లిపాలు మాన్పించుచున్న సమయంలో మొదట తల్లి కుందేలును బోను నుంచి తప్పిస్తారు. పిల్లకుందేళ్ళను 1-2 వారాలు అదే బోనులో ఉండనిస్తారు. ఆ తరువాత కుందేళ్ళ లింగ నిర్ధారణ చేసి వాటిని వేరువేరుగా విడివిడి బోనులలో పెంచుతారు. మనం తల్లిపాలు మానిన పిల్లకుందేళ్ళ ఆహారము లేక మేతను ఒకేసారి మార్చకూడదు.
పిల్ల కుందేళ్ళలో తగ్గిన మృతసంఖ్య
పదిహేను రోజులు వచ్చువరకు పిల్లకుందేళ్ళను తల్లి వద్దే ఉండనిస్తారు. ఈ సమయంలో తల్లిపాలే పిల్లలకు ఆహారం. ఈ సమయంలో పిల్లకుందేళ్ళ మరణం తన తల్లిద్వారానే సంభవిస్తుంది. పదిహేను రోజుల వయస్సు తరువాత పిల్లకుందేళ్ళు వాటి కోసం సమకూర్చిన నీటిని స్వయంగా త్రాగటం మరియు మేతను తినడం చేస్తాయి. ఈ కాలంలో అవి ఎక్కువగా అనారోగ్యానికి గురౌతాయి. అందువల్ల వాటికి మరిగించి చల్లార్చిన వేడి మంచి నీటిని తల్లి కుందేలుకి దాని పిల్లలకు ఏర్పాటు చేయ్యాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఒక లీటరు నీళ్ళలో ఒక మిల్లీ లీటరు వంతు చొప్పున కలిపి ఇరవై నిమిషాల తర్వాత కుందేళ్ళకు ఏర్పాటుచేయాలి.

ఆరోగ్యకరమైన కుందేళ్ళ లక్షణాలు

  • ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు
  • చాలా చలాకీగా ఉండడం
  • పూర్తిగా మరియు తొందరగా ఆహారాన్ని తినడం
  • కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఏ విధమైన స్రావాలు లేకుండా ఉండడం
  • క్రమేణా బరువు పెరుగుట

అనారోగ్యముగా ఉన్న కుందేళ్ళ లక్షణాలు

  • నిస్తేజంగా మరియు నీరసించి ఉండడం
  • శారీరక బరువు కోల్పోవడం మరియు కృశించిపోవడం
  • ఎక్కువగా బొచ్చు ఊడిపోవడం
  • చలాకీగా లేకపోవడం. కాని మామూలుగా,ఎప్పుడూ బోనులో ఒక నిర్ధష్టప్రదేశంలోనే గడపడం
  • నీరు మరియు శ్లేష్మంలాంటి స్రావాలు కంటి నుండి, ముక్కు నుండి, మలద్వారం మరియు నోటి నుండి స్రవించట.
  • శారీరక ఉష్ణోగ్రతలో మరియు శ్వాసలో పెరుగుదల

కుందేళ్ళలో వ్యాధులు

పాస్ట్యురెల్లోసిస్
స్వచ్ఛమైన గాలిరాని, పరిశుభ్రతలేని పౌష్టికాహార లోపాలు ఈ రకమైన వ్యాధులు రావడానికి కారణం. ఈ వ్యాధి తల్లి కుందేలు నుంచి పిల్లలకు సోకుతాయి.
రోగలక్షణాలు :
నిరంతరం తుమ్మడం మరియు దగ్గుట వలన కుందేళ్ళు ముందు కాళ్ళతో ముక్కును రుద్దుకుంటాయి. శ్వాస తీసుకొన్నప్పుడు గలగలమని శబ్ధం వస్తుంది . అదే కాకుండా జ్వరం మరియు అతివిరేచనములు కూడా ఉంటాయి. ఈ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు శరీరంపై పొక్కులులాగ రావడానికి కారణమయి మరియు మెడ వంకర పోవడం కూడా జరుగుతుంది.
చికిత్స :
పాస్ట్యురెల్లోసిస్ వ్యాధి చికిత్స అంత ప్రభావితం చూపదు. చికిత్స ద్వారా ఈ వ్యాధి నుంచి కోలుకొన్నా ఈ వ్యాధికి గరైన కుందేళ్ళ ద్వారా ఆరోగ్యవంతమైన కుందేళ్ళకు ఈ వ్యాధి సోకుతుంది. ఆందువల్ల ఈ వ్యాధికి గురైన కుందేళ్ళను ఫారం నుండి బయటకు వేరుచేయడమొక్కటే మార్గము.
ప్రేగులకు సంబంధిత రోగం (ఎంటిరైటిస్) :
వివిధ రకాలైన సూక్ష్మజీవుల ద్వారా కుందేళ్ళకు ప్రేగులకు సంబంధించిన వ్యాధులకు గురౌతాయి. మేతలో ఒకసారిగా మార్పు, మేతలో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు,క్షీణించిన రోగనిరోధక శక్తి, మేతలో మరియు త్రాగునీటిలో పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలు మరియు రోగకారక సూక్ష్మజీవుల ద్వారా ముందుగానే ఈ వ్యాధికి కుందేళ్ళు గురౌతాయి. అతిసారము, ఉదరం వ్యాకోచించడం, బొచ్చు తగ్గిపోవడం మరియు శరీరంలో నీరు లేకపోవడం, ఈ వ్యాధి లక్షణాలు. శరీరంలో నీటిని, అతిసారము వల్ల కోల్పోవడం ద్వారా చురుకుదనం కోల్పోతాయి.
మెడ వాల్చు రోగము
పాస్ట్యురెల్లోసిస్ ప్రభావము వలన కుందేళ్ళు ఈ మెడ వాల్చు రోగమునకు గురౌతాయి. ఇది మధ్య చెవి మరియు మెదడు మీద ప్రభావమును చూపుతుంది. ఈ వ్యాధి మధ్యచెవి పొరపై ప్రభావము చూపుట వలన కుందేలు చెవి నుండి చీము కారుతుంది. దీని వలన కుందేలు తలను ఒక వైపుకు వాల్చివేస్తుంది.తక్షణ పూర్తి పాస్ట్యురెల్లోసిస్ చికిత్స ద్వారా కుందేళ్ళలో మెడ వాల్చు రోగమును అదుపు చేయవచ్చును.
స్తనముల వాపు రోగము (మాన్ టైటిస్) :
పాలిచ్చే తల్లి కుందేళ్ళు ఈ రోగమునకు గురౌతాయి. ఈ వ్యాధికి గురైన కుందేళ్ళ పొదుగు ఎర్రగా, స్పర్శకు నొప్పిగా ఉంటాయి. సరిపోయే వ్యాధినిరోధక మందులనివ్వడం ద్వారా కుందేళ్ళలో ఈ వ్యాధిని అదుపుచేయవచ్చును.
ఫంగస్ వలన అంటువ్యాధులుn
డెర్మటోఫైసిస్ అనే ఫంగస్ ద్వారా కుందేళ్ళలో చర్మవ్యాధులు కలుగుతాయి. దీని వలన ముక్కు మరియు చెవుల చుట్టూ ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయి. దురద వలన కుందేళ్ళు వ్యాధి సోకిన ప్రాంతాలను బాగా రుద్దడం వలన ఆ ప్రాంతాలలో పుండ్లు పడతాయి. తర్వాత రెండవ దశ సూక్ష్మ క్రిముల వలన ఈ ప్రదేశాలలో చీము తయారౌతుంది.
చికిత్స
వ్యాధి సోకిన ప్రాంతాలలో గ్రిసోఫల్విన్ లేక బెన్జైల్ బెన్జోయేట్ మలామును పూయాలి. కిలో గ్రాము మేతలో 0.75 గ్రాముల గ్రిసోఫల్విన్ ను కలిపి రెండు వారాలకు వరకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని అదుపుచేయవచ్చు.
కుందేళ్ళఫారంలో కుందేళ్ళు వ్యాధిగ్రస్తం కాకుండా పాటించవలసిన పరిశుభ్రతా ప్రమాణాలు

  • కుందేళ్ళ ఫారం మంచి గాలి, వెలుతురు ఉన్న ఎతైన ప్రదేశంలో ఉండాలి.
  • బోనులు చాలా శుభ్రంగా ఉంచాలి.
  • కుందేలు షెడ్ చుట్టూ చెట్లను పెంచాలి.
  • సంవత్సరానికి రెండు సార్లు సున్నం వేయాలి.
  • వారానికి రెండు సార్లు బోను అడుగున సున్నపు నీటిని చల్లాలి .
  • వేసవి కాలంలో వేడి గాల్పుల వలన కుందేళ్ళ మరణాలు అరికట్టడానికి నీటిని కుందేళ్ళపై చల్లుతూ ఉండాలి.
  • ప్రత్యేకంగా తల్లికుందేళ్ళకు మరియు పిల్లకుందేళ్ళకు త్రాగడానికి నీటిని ఇచ్చేటప్పుడు నీటిని మరిగించి, చల్లార్చి ఇవ్వవలెను.
  • వ్యాధికారకాలైన సూక్ష్మక్రిములను అరికట్టడానికి కుందేళ్ళకు లీటరు నీటిలో 0.5 గ్రాముల టెట్రాసైక్లిన్ ను కలిపి నెలకి మూడుసార్లు ఇవ్వవలెను.

pig farming

పందుల పెంపకం

వాణిజ్య సరళిలో పందుల పెంపకం

లాభాలు :
  • ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
  • కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
  • అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
  • దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
  • మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.

పంది జాతులు:

  • పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350
  • 400 కి. గ్రా. బరువు
  • బెర్షైర్‌ సగటున 275 కి. గ్రా.
  • లాండ్రాస్‌
  • తామ్‌వర్త్‌
  • చెస్టర్‌ వైట్‌
  • హాంప్‌షైర్‌ (నలుపు)
  • పోలాండ్‌ చీనా
  • స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా
  • గృహ వసతి
  • మేత
  • వాణిజ్య సరళి
  • పందుల పెంపకం
  • అమ్మకం
ఈ వివరాలకు వ్యవసాయ శాఖ కార్యాలయం గానీ, పశువుల ఆసుపత్రి గానీ సంప్రదించవచ్చు.

పందుల పెంపకంతో ప్రయోజనాలు

  • పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
  • పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
  • పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
  • భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
  • పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా పనికొస్తుంది.

పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?

  • చిన్న మరియు భూమిలేని పేదలు
  • వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
  • నిరక్షరాస్య యువత
  • వ్యవసాయ కూలీ మహిళలు

జాతులు

పందుల ఉత్పత్తికి ఎంతో కాలంగా దేశవాళీ పందులనే వాడుతున్నారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు పందుల ఉత్పత్తికి మెరుగైన జాతులను వాడుతున్నారు.
భారతదేశంలో ఇప్పుడు పెంచే విదేశీ పంది జాతుల వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్ద తెల్ల యార్కషైర్ రకం
  • భారతదేశంలో ఎక్కువగా పెంచుతున్న విదేశీ పంది జాతి
  • శరీర రంగు తెల్లగా ఉంటుంది...అక్కడక్కడా నల్లరంగు మచ్చలు ఉంటాయి.
  • చెవులు నిక్కబొడుచుకుని ఉంటాయి...ముట్టె మధ్యస్థమైన పొడుగు ఉంటుంది...ముఖం పళ్ళెంలాగా ఉంటుంది.
  • సంకర ఉత్పత్తి జరపడానికి పనికొచ్చే అద్భుతమైన జాతి
  • ఎక్కువ పిల్లలు పెట్టే జాతి
  • పెరిగిన మగపంది 300-400 కిలోల బరువు తూగుతుంది
  • పెరిగిన ఆడపంది 230-320కిలోల బరువు తూగుతుంది
ల్యాండ్ రేస్
నల్లటి మచ్చతో తెల్లటి రంగులో ఉంటుంది
  • పొడుగైన శరీరం, వాలిపోయిన పెద్ద చెవులు మరియు పొడుగైన ముట్టె
  • అధిక సంతానాన్ని ఉత్పత్తి చేసే జాతి మరియు మేతను వినియోగించడంలో సమర్ధవంతమైనది
  • కళేబరం నాణ్యత యార్క్ షైర్ తో సమానంగా ఉంటుంది
  • సంకర ఉత్పత్తి జరపడానికి పనికొచ్చే శ్రేష్ఠమైన జాతి
  • బాగా పెరిగిన మగపంది 270-360 కిలోల బరువు తూగుతుంది
  • బాగా పెరిగిన ఆడపంది 200-320 కిలోల బరువు తూగుతుంది
మిడిల్ వైట్ యార్క్ షైర్
  • భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వాడతారు
  • త్వరగా పెరుగుతుంది, మాంసం కూడా ఎక్కువ శాతం ఇస్తుంది
  • లార్జ్ వైట్ యార్క్ షైర్ జాతి స్థాయిలో సంతానోత్పత్తి జరపలేదు
  • మగవి 250-340కిలోలు తూగుతాయి
  • ఆడవి 180-270కిలోలు తూగుతాయి
ఘుంగ్రూ పంది: గ్రామీణ రైతులకు పనికివచ్చే దేశవాళీ పంది జాతి
ఘుంగ్రూ అన్న దేశవాళీ పంది జాతి మొట్టమొదట ఉత్తర బెంగాల్ ప్రాంతంలో కనుగొనబడింది. ఇది పిల్లలను బాగా పెట్టడం వలన, తక్కువ ఖర్చుతో పెంచదగినది కావడం వలన ఇది స్థానికంగా బాగా ఆదరణ పొందింది. వ్యవసాయ ఉపఉత్పత్తులను, వంటింటి వ్యర్ధాలను వినియోగించుకుని ఈ జాతి పంది మంచి నాణ్యమైన పంది మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పందులు ఈతకు 6-12 పరకూ పిల్లలను పెడతాయి. ఒక్కో పంది పిల్ల పుట్టగానే షుమారు ఒక కిలో బరువుండి వీనింగ్ (తల్లి పాలు మాని ఆహారం స్వీకరించడం) సమయానికి 7 నుండి 10 కేజీల బరువుంటాయి. ఆడ, మగ పందులు రెండూ మచ్చిక చేసుకోవడానికి వీలుగా సాధు స్వభావం కలిగి ఉంటాయి. ఈ పందుల పెంపకం చేపట్టే ప్రదేశాలలో వీటిని `స్కావెంజర్ పద్ధతి"లో, అంటే ఈ పందులను వదిలిపెట్టేస్తే వాటికవే ఏదో ఒక ఆహారాన్ని వెతుక్కుని తినే పద్ధతిలో, పెరగనిస్తారు. దీనివలన వర్షాధార వ్యవసాయంలో ఇవి కొంత చేతికి అందివస్తాయి.
జాతీయ పందుల పరిశోధనా కేంద్రం, రానీ, గౌహతిలో ఘుంగ్రూ పందులు ప్రామాణికమైన బ్రీడింగ్ (సంతానాన్ని వృద్ధి చెయ్యడం), ఫీడింగ్ (ఆహారాన్నివ్వడం) మరియు నిర్వహణ పద్ధతులతో ఇంటేన్సివ్ గా పెంచడం జరుగుతోంది. బ్రీడింగ్ కార్యక్రమాలలో ఈ జాతి పందులు జన్యు పరంగా ఎంతవరకూ పనికివస్తాయన్న నిర్ధారణ ఇంకా జరుగుతోంది. కాగా ఉత్పత్తిలోనూ, ప్రత్యుత్పత్తిలోనూ ఈ దేశవాళీ పంది జాతి మంచి ఫలితాలను కనబరుస్తోంది. ఈ సంస్థ ఫారంలో ఉన్న ఇతర దేశవాళీ పంది జాతులతో పోలిస్తే ఈ ఘుంగ్రూ జాతిలోని కొన్ని ఎంపిక చేసిన పందులు తడవకు 17 పంది పిల్లలను పెడ్తున్నాయి.

సంతానోత్పత్తికోసం మంచి జాతిని ఎంపికచేసుకోవడం

సంతానోత్పత్తికోసం మంచి ఆడపందులను తయారుచేసుకోడానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి
  • ఒక ఈతలో పెట్టే పిల్లల సంఖ్య
  • పుట్టిన పిల్లల బలం మరియ శక్తి
  • పాలిచ్చే సామర్ధ్యం
  • స్వభావం
ఒక ప్రత్యేకమైన జాతిని ఎంపిక చేసుకోవడంకంటే కూడా పరిగణించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటంటే...ఎంత మాంసం వస్తుంది, ఎంత సామర్ధ్యం ఉంది, ఎన్ని పిల్లలను పెట్టగలదు, మందలోని మిగిలినవాటికంటే ఏ విధంగా మెరుగ్గా ఉంది...వంటి విషయాలు. మందను తయారు చేసుకునే ప్రతి రైతు కూడా కొనుగోలు చేసు కునే ముందు వాటిని వ్యాధులు లేని విశ్వసనీయమైన మందనుంచి ఎంపికచేసుకోవాలి మరియు వాటి గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించాలి. మందను తయారుచేసుకున్న తర్వాత సామర్ధ్యం, రకాలను బట్టి సంతానోత్పత్తి జరపడానికి ఆడపందులను, మగపందులను ఎంపికచేసుకోవాలి.
ఆడపందుల ఎంపిక
యార్క్ షైర్ ఆడపంది
  • సంతానోత్పత్తికి తొలిచూలు ఆడపందుల ఎంపికను మార్కెట్ బరువును బట్టి...అంటే సుమారు 90కిలోల బరువు తూగేపందిని తీసుకోవాలి.
  • ఎక్కువసార్లు క్రమంగా ఈనిన, పెద్ద ఆడపందు లో ఎక్కువ పీల్లులను పెట్టిన సంతతి నుండి తీసుకోవాలి
  • ఎంపిక చేసుకున్న ఆడపందులు...తక్కువసమయంలో మార్కెట్ చేరినవి, మార్కెట్ కు కావాల్సిన రకానివి అయి ఉండాలి
  • రోజువారి బరువు పెరుగుదలలో, మేతవినియోగ సామర్ధ్యంలో...ఎంపిక చేసుకున్న ఆడపందుల తోడబుట్టినవాటి పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మగపందుల ఎంపిక
యార్క్ షైర్ మగపంది
  • మగపంది ఎంపిక చాలా కీలకమైన అంశం... ముఖ్యంగా చిన్న మందలు నడిపేవారికి.
  • మగపందిని కొనేముందు అమ్మకందారువద్ద దానిగురించి తగిన సమాచారం ఉందోలేదో తెలుసుకోవాలి
  • ఎంపిక చేసుకునే మగపంది తల్లి వరసగా ఎన్నోసార్లు ఈని, ఎక్కువ సంఖ్యలో పిల్లలను పెట్టినదై ఉండాలి
  • 5-6 నెలల్లోనే 90కిలోల బరువుకు చేరిన మగపంది మంచి రకానిదై ఉంటుంది...కాళ్ళు, పాదాలు బలంగా ఉంటాయి.
  • తిండి తినడం ప్రారంభించడంనుంచి 90కిలోల బరువుకు చేరడానికి తీసుకునే సమయం తక్కువగా ఉండాలి.
సంతానోత్పత్తి చేసే మగపందులను, ఆడపందులను మార్చేటపుడు చూడాల్సిన అంశాలు
  • ఎంపిక చేసుకున్న పంది తల్లి, ఎక్కువ పిల్లలను అంటే 8, అంతకంటే ఎక్కువ సంఖ్యలో పెట్టి ఉండాలి. ఆడపందిపిల్ల తిండి తినడం ప్రారంభించే సమయానికి(56రోజులు) దాని తల్లి తొలిచూలుదయితే 120కిలోల బరువు, మలి చూలుదయితే 150కిలోలకు తక్కువకాకుండా ఉండాలి.
  • ఆడపందిగానీ, మగపందిగానీ సుమారు ఆరునెలల్లోనే 90కిలోల బరువుకు చేరాలి.
  • పంది శరీరం తగిన పొడవు, లావు కలిగి ఉండాలి... వెనుక తొడల కండరాలు పటిష్ఠంగా, గట్టిగా ఉండాలి
  • పంది కాళ్ళు, పాదాలు బలంగా ఉండాలి.
  • ఆడ పంది వారు మందం 4సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఉండాలి...మగపంది వారు మందం 3.2సెం.మీ. లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.
  • ఆడపందికి పొదుగులో చక్కగా అమరిన చన్నులు కనీసం 12 అయినా ఉండాలి. పాలివ్వని చన్నులున్న పంది నుంచి, పాలు తక్కువగాగానీ, అసలు రాకుండాగానీ ఉంటాయి, పైగా అది వంశపారంపర్యంగా వస్తుంది కనుక అలాంటి పందిని తీసుకోకూడదు.
  • బ్రూసెల్లోసిస్ మరియు లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో తెలుసుకోడానికి ఎంపిక సమయంలోనే రక్తపరీక్షలు చేయించాలి...స్వైన్ ఫీవర్ వ్యాధి టీకాలు వేయించాలి.
  • ఇతర వ్యాధులు, శరీర అవకరాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి.

మేత వ్యవహారం

మేత తయారీలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
  • బాగా చవకైన పదార్ధాలతో మేతను తయారుచేసుకోవాలి.
  • మొక్కజొన్న, జొన్నలు, ఓట్లు, ఇతర తృణధాన్యాలు, గోధుమలు, బియ్యం వంటి వాటితో మేత తయారుచేయొచ్చు.
  • ప్రోటీన్ అందించే...తవుడు,చెక్క, చేప వ్యర్ధాలు, మాంసం వ్యర్ధ పదార్థాలను ఉపయోగించాలి.
  • పందులను పొలంలో వదిలితే ప్రత్యేకంగా వైటమిన్ ప్రత్యామ్నాయాలనేమీ అందించనవసరంలేదు... లేనిపక్షంలో తాజా చిక్కుడుజాతి గింజలను కూడా పెట్టాల్సి ఉంటుంది. జంతు సంబంధిత ప్రోటీన్ తక్కువగా పెట్టినా, అసలు పెట్టకపోయినా వైటమిన్ బి 12 ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిఉంటుంది.
  • కిలో మేతకు 11మి.గ్రా. యాంటీబయాటిక్ ను ప్రత్యామ్నాయంగా అందించాలి.
  • ఖనిజలవణాల ప్రత్యామ్నాయాలను కూడా అందించాలి.
ఈ కింది పట్టీ...వివిధ దశలలో ఉండే పందులకు ఇచ్చే మేతలో ఉండాల్సిన పోషకాల వివరాలను అందిస్తుంది
పోషక పధార్ధాలు
పాకుతున్నదశలోఇవ్వాల్సిన మేత
మధ్యస్థదశలోఇవ్వాల్సినమేత (20-40 కిలో)
చివరలో ఇవ్వాల్సిన మేత(40-90 కిలో)
ప్రోటీన్ ప్రత్యామ్నాయంశాతం(%)
  1. నూనెచెక్క


16-18

14-16

13-14
  1. జంతుమాంసం
8-10
4
2
ఆహారధాన్యాలశాతం(మొక్కజొన్న, జొన్న, ఇతర తృణధాన్యాలు)(%)
60-65
50-55
40-50
గోధుమపొట్టు లేదా తవుడు(%)
5
10
20
ల్యూసిర్న్ మేత శాతం(దొరికితే)meal (%) if available
--
5-8
--
ఖనిజలవణాల మిశ్రమం శాతం(%)
0.5
0.5
0.5
యాంటీబయాటిక్ ప్రత్యామ్నాయం( మి. గ్రా)
40
20
10
వివిధ వయస్సులలో పందులకు ఇవ్వాల్సిన మేతలో ఉండాల్సిన పదార్ధాలు
పదార్ధాలు
పాకేదశ (14నుంచి56రోజులవరకు)
గ్రోయర్(40కిలోల బరువువరకు)
ఫినిషర్ (40-90 కిలో)
(40-90 k.g)
గర్భిణి, ఈనిన పంది
మొక్కజొన్నలులేదా జొన్నలు, గోధుమనూకలు, బియ్యం నూకలు, బార్లీ తగిన మిశ్రమాల్లో
65
50
50
50
నూనెచెక్క(వేరుశెనగచెక్క, సోయాబీన్ చెక్క, ఆవనూనె చెక్క, అవిశెనూనెచెక్క)
14
18
20
20
మొలాసెస్
5
5
5
5
గోధుమపొట్టు లేదా బియ్యపుపొట్టు
10
1.5
25
18
చేపవ్యర్ధాలు లేదా మాంసం వ్యర్ధాలు, మిగిలిపోయినవంటలు, చెడిపోయిన పాలఉత్పత్తులు
5
5
3
5
ఖనిజలవణాల మిశ్రమం
1
1.5
1.5
1.5
ఉప్పు
--
0.5
0.5
0.5
ఈ పందులకు మేతపెట్టడానికి అత్యంత సులభమైన మార్గమేమిటంటే...వివిధ రకాల పందులకు సూచింపబడిన సమగ్ర మేతను తయారుచేసుకోవడం, వృధా చేయకుండా అవి ఎంతయితే తినగలవో అంత మేతను వాటికి రోజుకు రెండు లేదా మూడుసార్లు పెట్టడం. పందులు రోజూ తినే ఎండుమేత పరిమాణం సుమారుగా ఈ క్రింది విధంగా ఉంటుంది.

పంది బరువు(కిలోల్లో)
ఒక్కొక్కటి రోజూ తినగలిగే మేత(కిలోల్లో)
25
2.0
50
3.2
100
5.3
150
6.8
200
7.5
250
8.3
మిశ్రమ దాణాలలో ఉపయోగించే ఆహారధాన్యాలనన్నిటినీ బాగా పిండిచేయాలి. సాధారణంగా మేతను గుజ్జుగా చేసి ఇవ్వడం కంటే ఎండు మేతగా గానీ, కుడితి గా గానీ ఇవ్వడమే మంచిది. కుడితి తయారు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది...పని కూడా ఎక్కువ. మేతలో పీచుపదార్ధం ఎక్కువగా ఉంటే దానిని గుళికలుగా చేసి మేపడం వలన పందులు త్వరగా పెరుగుతాయి. .బరువెక్కుతాయి. గుళికలుగా చేయడంవలన మేత వృధా అవడం కూడా తగ్గుతుంది. సూడి పందులకు మేత మరీ ఎక్కువగా ఇవ్వడం కూడా మంచిదికాదనే విషయం చాలా ముఖ్యం. బాగా బరువు పెరిగిన ఆడపంది తక్కువ పిల్లలను పెడుతుంది.. ఈనిన తర్వాత దానికిందబడి పిల్లలు చనిపోతాయి. సూడికట్టిన దగ్గరనుంచి ఈనేలోపు...మలిచూలు పందయితే 35కిలోలు, తొలిచూలుదయితే 55కిలోలు బరువు పెరగాలి.

నివాసము

మారుతుండే వాతావరణం, వ్యాధులు, సూక్ష్మక్రిములనుంచి పందులను రక్షించడానికి వాటికి తగిన ఆశ్రయం కల్పించాలి.
వివిధ వర్గాల పందులకు ఆశ్రయం కల్పించడానికి కావాల్సిన గది విస్తీర్ణం, నీరు, గాలిలో తిరగడానికి కావాల్సిన బహిరంగ ప్రదేశ విస్తీర్ణం వివరాలు ఇలా ఉంటాయి.
పందిరకం
ఒక్కోపందికి కనీసవిస్తీర్ణం (చ.మీ.)
ఒక్కోపందికి ఖాళీప్రదేశం (చ.మీ.)
కావాల్సిన నీరు (లీటర్లు)
మగపంది
6.25-7.5
8.8-12.0
45.5
సూడిపంది
7.5-9.0
8.8-12
18-22
ఈనినపంది
0.96-1.8
8.8-12
3.5-4
ఆడపంది
1.8-2.7
1.4-1.8
4.5-5
పందుల దొడ్డి
గచ్చు గరుకుగా ఉండాలి...నీరు ఇంకకుండా సిమెంటుతో గట్టిగా చేయించాలి. వ్యర్ధ పదార్ధాలు బయటకు పోవడానికి తూములు ఏర్పాటు చేయాలి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో పందుల దొడ్డిని 3మీ.x2.4మీ లేదా 3మీx3మీతో ఏర్పాటు చేస్తారు. ఆరుబయట ఏర్పాటు చేసే దొడ్డి కూడా ఇదే పరిమాణంలో, లేదా కొద్దిగా పొడవుగా ఉంటుంది. గోడలు నేలనుంచి 1.2-1.5మీ ఎత్తు ఉండాలి. ఈనబోతున్న పందులకోసం కొన్ని దొడ్లలను ప్రత్యేకంగా ఉంచాలి. వాటిగోడలకు 5సెం.మీ. వ్యాసమున్న జీఐ గొట్టాలు... నేలనుంచి 20-25సెం.మీ. ఎత్తున ఏర్పాటుచేయాలి. ఇది కాకుండా పంది పిల్లలు పాకడానికి ఆ దొడ్డిలోనే విడిగా కొంత స్థలాన్ని ఏర్పాటుచేయాలి. దీని విస్తీర్ణం 0.75మీ.X2.4మీగా ఉండాలి.
దిగుమతి చేసుకున్నరకం పందులు మామూలు వాతావరణంలో కూడా ఎక్కువసేపు ఎండలో ఉండలేవు. ఒకవేళ అలా ఉంచితే అవి వేడెక్కిపోతాయి. వాతావరణం వేడిగా ఉన్నపుడు వాటికి నీడను ఏర్పాటుచేయడం వలన చనిపోకుండా నివారించవచ్చు...ఉత్పత్తి సామర్ధ్యం పెంచవచ్చు. పందుల దొడ్ల పక్కన చెట్లను పెంచడంద్వారా ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. అయితే దొడ్లపైన నీడకోసం చెట్లను పెంచడం మంచిదికాదు....దీనివలన సూక్ష్మజీవుల బెడద వస్తుంది.
పందులు ఈనడానికి దొడ్డి-నమూనా
నీటికయ్యలు
పందులకు చాలా కొద్ది స్వేదగ్రంధులు ఉంటాయి. వేడి వాతావరణంలో...ఎండాకాలంలో ఈనే పందులు, లావెక్కుతున్న పందులకు దొర్లడానికి నీటికయ్యలు అవసరం. మామూలు అపరిశుభ్రంగా ఉండే బురదకయ్యలు కాకుండా చక్కగా మురుగునీరు పోవడానికి వీలుగా తాపీమేస్త్రీతో నీటికయ్యలు ఏర్పాటు చేయించాలి. పందుల సంఖ్య, వాటి సైజులను బట్టి దాని పరిమాణాన్ని లెక్కవేసుకోవాలి.

ఈనడానికి ఏర్పాట్లు

ఆడపంది ఈనే వయసు
8 నెలలు
సూడిపంది బరువు
100-120 కిలోలు
వేడి ఇవ్వాల్సిన సమయం
2-3 రోజులు
ఈనడానికి పట్టే సమయం
తొలిచూలుపంది-మొదటిరోజు
మలిచూలుపంది-రెండోరోజు
ఆడపందికి ఎన్నిసార్లు పరీక్ష చేయించాలి
12-14గంటల తేడాతో రోజుకు రెండుసార్లు
రుతు చక్రం
18-24 రోజులు (సగటున21 రోజులు)
ఈనిన తర్వాత వేడి ఇవ్వాల్సిన సమయం
2-10 రోజులు
గర్భధారణ సమయం
114 రోజులు
ఈనడానికి తగిన వయస్సు
బాగా తయారయిన ఆడపందులు 12-14 నెలలవయస్సుకు ఈనడానికి తయారవుతాయి. ఇది వయస్సుపై కాక వాటి శరీరం ఏ మేరకు పెరిగిందనేదానిపై ఆధారపడి ఉంటుంది. సూడికట్టడానికి ముందు వాటి బరువు కనీసం వందకిలోలు ఉండాలి.దీనివల్ల రుతుక్రమం త్వరగా గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు లేదా మూడు రుతుకాలాల వరకు పందిని సూడికట్టించడం నిలిపితే మంచిది. ఐదు లేదా ఆరు ఈతల వరకు వరసగా పెట్టే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉండటంవల్ల ఆ ఆడపందిని మందనుంచి వేరు చేయడం మంచిది.
వేడి గుర్తింపు
పందుల్లో రుతుక్రమం 21రోజులకు ఒకసారి వస్తుంది. ఇది ఐదునుంచి ఏడురోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో అవి ఎక్కువగా మూత్రాన్ని పోస్తాయి...ఆకలి తగ్గుతుంది...లేచి నిలబడుతుంటాయి...నడుముమీద సవరదీసినపుడు చెవులు నిక్కబొడుచుకుంటాయి. సూడికట్టే సమయాన్ని పసిగట్టడానికి ఆడపంది నడుము సవరదీస్తారు. రుతుక్రమం సరిగా లేని ఆడపందులను మగపందుల దగ్గరకు తీసుకొస్తారు.
రుతుక్రమం మొదటిరోజు చివరకానీ, రెండవరోజు ప్రారంభంకానీ మగపందితో కలయికకు అనువైనది. ఒక్కోసారి ఆడపందులను 12-14గంటల తేడాతో రెండోరోజు మరలా మగపందితో కలపాలి. దీనివలన గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి.
ఆడపంది సూడికట్టిన 1-4 రోజుల తర్వాత రుతుక్రమానికి లోనవుతుంది. అయితే వాటిని ఆ సమయంలో మగపందితో కలపకూడదు. ఈనిన తర్వాత2-10రోజుల తర్వాత కూడా అవి వేడెక్కుతాయి.... అప్పుడు వాటిని మగపందితో కలపవచ్చు. అయితే ఈనిన తర్వాత రెండోసారి వచ్చే రుతుక్రమం సమయంలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. మగపందితో కలిపిన తర్వాత ఆడపందులకు రుతుక్రమం ఎప్పుడు వస్తుందో గమనిస్తుండాలి. రెండు రుతుక్రమాలలోనూ మగపందితో కలిపినా గర్భం ధరించకపోతే ఆ ఆడపందులను మందనుంచి వేరుచేయడం మంచిది.
సూడిపందులను మేపుట
కలయికకు ముందు ఆడపందులను మేపే విధానం చూస్తే... కలయికకు 7-10రోజుల ముందు మంచి మేత ఇవ్వడంవలన గర్భధారణ అవకాశాలు బాగా పెరుగుతాయి. కలయిక తర్వాత మేత పరిమితంగా ఇవ్వాలి. అయితే గర్భధారణలోని చివరి ఆరువారాలవరకు మంచి సమతుల్య ఆహారం ఇవ్వాలి....ఆ తర్వాత పూర్తి మేతను ప్రారంభించాలి.
సూడిపందులపై తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు
ఆడపందుల గర్భధారణ సమయం 109-120రోజుల వరకు ఉంటుంది...సగటున 114రోజులు. సూడిపందులను వేరే దొడ్లలో ఉంచాలి. లేకపోతే అవి మామూలు పందులతో గొడవపడటంవలన గర్భస్రావం జరుగుతుంది. తొలిచూలు పందులను, మామూలు సూడిపందులను కూడా విడివిడిగా ఉంచడం మంచిది. ఒక్కొక్క ఆడపందికీ సుమారు 3 చదరపు మీటర్ల విస్తీర్ణం స్థలం ఉండటం మేలు. సూడిపందులను ప్రతిరోజూ ఉదయం వేళ ఆరుబయటగానీ, పొలంలోగానీ తిరగనివ్వడం మంచిది. ఆ పొలంలో ఇంతకుముందు ఏదైనా పంట పండి ఉంటే అదంతా శుభ్రంగా ఖాళీ అయిఉండాలి
ఈనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పందుల ఉత్పత్తిలో ఈనేసమయం అత్యంత కీలకం. ఈనేటప్పుడు, ఈనిన మొదటివారంలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈనే పందులను గట్టిగా ఇనుపచువ్వలతో కట్టిన దొడ్లలో ఉంచాలి....ఈనడానికి తొట్టెలను ఏర్పాటుచేయాలి. పందిపిల్లలు మూడు, నాలుగురోజుల వయస్సువరకు 24-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఆ దొడ్డిలో ఉండాలి. ఆ తర్వాత వాటికి ఆరువారాల వయస్సు వచ్చేవరకు 18-22డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంచాలి. వేడికోసం నేలకు 45సెం.మీ. ఎత్తులో దీపాలు వేలాడతీయాలి...వాటిని జాగ్రత్తగా కాపాడాలి. పందులు ఈనే దొడ్లలోకి సూడిపందులను తీసుకురావడానికి ముందే ఆ దొడ్లను బాగా శుభ్రంచేయాలి. దీనివలన పందిపిల్లలను ఎన్నో జబ్బులనుంచి కాపాడవచ్చు. సూడిపందిని ఈనడానికి కనీసం ఒకవారం ముందు ఆ దొడ్డికి తీసుకురావడంవలన అది కొత్త పరిసరాలకు పరిచయం అవుతుంది. ఆ దొడ్డికి తీసుకువచ్చేముందు దానిని శుభ్రంగా కడగాలి. మేతలో మూడోవంతు గోధుమపొట్టుతో కూడి ఉండాలి. ఈనేవరకు దాని మేతను మూడోవంతు తగ్గించాలి. ఈనే సమయం నిర్ధారించడానికి సూడిపందిని జాగ్రత్తగా గమనిస్తూఉండాలి... ఈనడానికి 12గంటల ముందునుంచి దానికి మేతను ఆపివేయాలి.
ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆడపంది ఈనేసమయంలో సహాయానికి ఒక మనిషి తోడుండాలి. లేకపోతే చాలా పందిపిల్లలు చనిపోతాయి. ఈనడం పూర్తవడానికి సాధారణంగా రెండునుంచి నాలుగు గంటలు పడుతుంది. పిల్లలు పుట్టగానే వాటిని పక్కకు తీసి ఈనడం పూర్తయ్యేవరకు పక్కన వెచ్చని ప్రదేశంలో పెట్టాలి. ప్రతిపిల్లనూ శుభ్రంగా కడిగి తేలిగ్గా ఊపిరితీసుకునేటట్లు చేయాలి. బొడ్డుతాడును బొడ్డుకు 2-5 సెం.మీ. దూరంలో కట్టేసి శుభ్రమైన కత్తెరతో కత్తిరించాలి. కోసిన చోట అయోడిన్ పూయాలి. పుట్టిన పిల్లల అవసరాలు చూడాలి. రెండురోజుల్లో అవి తల్లిపాలు తాగడానికి ఒక చన్నును ఎంచుకుంటాయి. తొలిదశలో రోజుకు 8-10సార్లు తల్లిదగ్గర పాలు తాగుతాయి. మొదటి రెండు వారాల్లో అవి తల్లిపంది కిందపడి నలిగిపోకుండా చూస్తుండాలి.
సూదిదంతాల తొలగింపు
పందిపిల్లలు నాలుగు జతల పదునైన పళ్ళతో పుడతాయి... ఒక్కొక్క దవడకు రెండు జతల చొప్పున ఉంటాయి. ఈ పళ్ళ వలన ప్రయోజనం ఏమీ ఉండదు...పైగా అవి పాలుతాగేటప్పడు తల్లి పొదుగువద్ద చిరాకు కలిగిస్తాయి లేదా మిగిలిన పిల్లలకు గాయాలు కలగజేస్తాయి. పుట్టినవెంటనే వాటిని కత్తిరించడంవలన పొదుగువద్ద గాయాలవ్వకుండా నివారించవచ్చు.

పందిపిల్లల్లో రక్తహీనత

పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని(0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి

అనాధ పందిపిల్లలను పెంచడం

ఈనిన తర్వాత తల్లిపంది చనిపోవడం, ఒక్కోసారి తల్లి పంది పాలు ఇవ్వలేకపోవడం, ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు పాలు చాలకపోవడం వంటి సందర్భాలలో కొన్ని పిల్లలు అనాధలవుతాయి. అదేసమయంలో ఇంకో పంది ఈనితే ఈ పిల్లలను దానిదగ్గరకు మార్చవచ్చు. అయితే ఇలా మార్చడం ఈనిన వెంటనే జరగాలి. కొత్తపిల్లలను ఆ మరొక పంది అంగీకరింపచేయడానికిగానూ, దానిపిల్లలను కూడా కొంతకాలం పక్కనపెట్టాలి. ఆ తర్వాత కొత్తపిల్లలను, అసలు పిల్లలను కలిపి వాటన్నటిమీద ఏదైనా ద్రావణాన్ని చల్లడంద్వారా వాసనలను మరుగునపరచాలి.
అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో ఇనుము తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా ఫెర్రస్ సల్ఫేట్ కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.

పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు

పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో వృషణాలు తొలగించవచ్చు.

ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు

పాలిచ్చే ఆడపందులకు తదనుగుణంగా మంచి మేత ఇవ్వాలి. ఒక్కోపందిపిల్లకు అరకేజిచొప్పున తల్లిపందికి ఎన్ని పందిపిల్ల లుంటే అంత అదనపు మేత ఇవ్వాలి.

తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం

పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20పిల్లలను ఉంచాలి.

పందులకు వచ్చే వ్యాధుల నివారణ, నియంత్రణ


  • 2-4వారాల వయస్సులో ప్రతిపందికీ స్వైన్ ఫీవర్ టీకాలు వేయించాలి. గర్భందాల్చే పందులకు బ్రుసెలోసిస్, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో పరీక్షించాలి. మేత తినడం ప్రారంభించే పందిపిల్లలన్నిటికీ స్వైన్ ఫ్లూ టీకా తప్పనిసరిగా వేయించాలి.
  • పందులను కొనుగోలు చేసేటప్పుడు వ్యాధులు లేని మందలనుంచి కొనుగోలు చేయాలి. కొత్తగా కొనుగోలు చేసిన పందులను మూడు, నాలుగు వారాలదాకా పాత మందలో కలపకూడదు. దొడ్డిని చూడడానికి ఎవరినీ అనుమతించకూడదు. కొత్తవాటిని ఉంచే దొడ్లను మూడు, నాలుగు వారాలదాకా ఖాళీగా ఉంచితే అక్కడ సూక్ష్మక్రిములేమైనా ఉంటే అవి తొలగిపోతాయి.