Monday, 13 July 2015
Sunday, 12 July 2015
పొదుగువాపు
పొదుగువాపు వ్యాధి అంటే ఏమిటి ?
ఎక్కువ పాలను ఉత్పత్తి చేయు పాడి పశువులలో ఇది సాధారణంగా వస్తుంది. పొదుగు లోనికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఈ వ్యాధిని కలుగచేస్తాయి. ఇది అన్ని పశువులలోను ముఖ్యముగా సంకర జాతి పశువులలోను, అధిక పాలు ఉత్పత్తి చేయు గేదలలోను. ఈనిన 1-2 నెలలలో కనిపిస్తుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది.చికిత్స చేయకపోయినట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగా మారి పొదుగు పూర్తిగా పాడైపోతుంది. రైతు ఆర్థికంగా చాలా నష్ట పడతాడు. కావున ఈ పొదుగు వాపు వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స చేయాలి.
పొదుగు వాపువ్యాది ఎన్నిరకాలుగా వస్తుంది ?
పొదుగు వాపు వ్యాధి మూడు రకాలుగా వస్తుంది
1. వ్యాధి లక్షణాలు కనిపించకుండా వచ్చు వ్యాధి ( సబ్ క్లినికల్ )
2. వ్యాధి లక్షణాలు కనిపించుతూ వచ్చు వ్యాధి (క్లినికల్ )
3, దీర్ఘకాలిక వ్యాధి ( క్రానిక్ )
పైన తెలిపిన మూడింటిలో మొదటి వ్యాధి అతి ప్రమాద కరమైన వ్యాధి. ఈ వ్యాధిని గుర్తించుట చాలా కష్టము. ఈ దశలో చికిత్స చేయక పోయినట్లయిన వ్యాధి రెండవ దశ లోకి పోయి తీవ్రతరమైనదిగా మారిపోతుంది.రెండవ దశలో లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయ వచ్చు. . మూడవ దశలో చికిత్స చేయుట చాలా కష్టము. కాబట్టి వ్యాధిని ప్రధమ దశలోనే గుర్తించి చికిత్స చేయాలి.
పోడుగువాపు వ్యాది రెండవ దశలో లక్షణాలు .
· పాలు విరుగుట
· తెల్లటి ముక్కలు కనిపించుట
· పాలు నీరు లాగ అయి పోతాయి
· పొదుగు వాపు
· నొప్పి
పొదుగు వాపు వ్యాది మూడవదశలో లక్షణాలు :
· పొదుగు గట్టిబడి రాయిలాగ మారుతుతుంది
· పాలు పూర్తిగా పోతాయి
· చనుకట్లు గట్టిబడతాయి
· మిగతా చనుకట్లకు వ్యాధి వ్యాపిస్తుంది
వ్యాధిని మొదటిదశలో గుర్తించుట ఎలా ?
ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించుటకు ఒక సులువైన పద్దతి కలదు. దీనిని అనేక దేశాలలో ఉపయోగించి మంచి పలితాలు సాదించారు. దీనిని రైతులే స్వయంగా ఇంటివద్దనే చేయగల పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించుటకు వీలు కలుగుతుంది.
చేయు విధానము: (ఇళ్ళలో వాడుకునే సుర్ఫ్ తో చేయుట )
ముందుగా సుర్ఫ్ ఎక్సెల్ 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్ సీసాలో బద్ర పరచుకోవచ్చును. 3 నెలల వరకూ నిలువ వుంచుకొన వచ్చును. సీసాను వెలుతురు తగలని చోట జాగ్రత్త చేయాలి.
పరీక్ష చేయవలసిన పాడిపశువు నుండి పాలను సేకరించాలి. నాలుగు చనుకట్లనుండి పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో 10 మి.లీ పాలను తీసుకొని 10 మి.లీ . సుర్ఫ్ నీళ్ళను కలపాలి.1 0 సెకండ్ల సేపు నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని కలపాలి. పోడుగువాపు వ్యాధి ఉన్నట్లయితే ఆ మిశ్రమము ముద్దగా అయిపోతుంది. వ్యాదిలేనట్లయితే ఏమి మార్పు రాదు.
దీనిని కనీసం వారానికి ఒక సారిఅయినా చెస్తూ ఉన్నట్లయితే పొదుగు వాపు వ్యాధిని ఆది లోనే గుర్తించి సరిఅయిన సమయంలో చికిత్స చేసుకోవచ్చును,మనయొక్క పాదిపశువులను ఈ వ్యాది బారి నుండి కాపాడుకోవచ్చును.
ప్రయోగశాల పరీక్ష : యాంటిబయోటిక్(రోగక్రిమి నాశకం) ప్రతిస్పందన పరీక్ష
యాంటీబయాటిక్ గ్రహణశీలత పరీక్ష (ABST) సాధారణంగా బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్స యొక్క యాంటీబయాటిక్ గుర్తించడానికి అత్యంత విజయవంతమైన పరీక్షగా నిర్వహిస్తారు. కిర్బీ-బాయర్ పద్ధతి న యాంటిబయోటిక్ ప్రతిస్పందన కోసం టెస్టింగ్ తరచుగా ప్రయోగశాల లో జరుగుతుంది.యాంటీబయాటిక్స్ కలిగిన చిన్న పొరలు బాక్టీరియా పెరుగుతున్నా ఒక ప్లేట్ లోకి ఉంచుతారు. బాక్టీరియా ఉంటే, యాంటిబయోటిక్, స్పష్టమైన రింగ్, లేదా నిరోధం పెరుగుదల సూచిస్తూ పొర కనపడతాయి. ఇది ప్రయోగశాల ఆదర్శ యాంటీబయాటిక్ చికిత్స మరియు దాని సంబంధిత యాంటిబయోటిక్ ప్రతిస్పందన ఆధారంగా. చికిత్స కారణంగా వ్యాధి తీవ్రతను ఆలస్యం చేయకుండా ప్రయోగశాల సూక్ష్మక్రిమి నివేదికలు ప్రవేసపెట్టి చికిత్స మొదలుపెడతారు.
నివారణ పద్ధతులు
గేదెలను వీలైనంత పొడిగా, పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. పాలు పితికే ముందు పొదుగును గోరు వెచ్చని నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడువాలి. పాలు పితికేవాళ్ల చేతికి గోళ్లు పెరగకుండా జాగ్రత వహించాలి. పొదుగులో పాలు మిగలకుండా పూర్తిగా పిండాలి. గర్భకోశ వ్యాధుల పీడిత పశువుల, ఈనిన పశువుల మాసం నుంచి కారే స్రావాలు పొదుగులకు తగలకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. పాలు పితికిన తర్వాత పొదుగును అంటిసెప్టిక్ లోషన్‌తో కడిగి శుభ్రపర్చాలి. అనుమానిత పశువులను చివరగా పాలు పితికేందుకు వేరు చేయాలి. పాలు పితికిన తరువాత చేతులను నీళ్లతో తర్వాత అంటిసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఒకే పశువులో పొదుగు వాపు వ్యాధి సోకినటువంటి వాటికి చివరగా పాలు పితకాలి. ఒకే ఈతలో పొదుగు వాపు వ్యాధికి గురైన పశువు తిరిగి చూడిదై వట్టిపోయిన తర్వాత అవసరం మేరకు పశువైద్యుల సలహా అనుసరించి డ్రై తెరపిని అమలు చేయాలి. గేదెల్లో పొదుగు వాపు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. పొదుగు వాపు వ్యాధి చికిత్స చేయించిన తర్వాత 72 గంటల వరకు పాలను మానవ అవసరాలకు వినియోగించరాదు.
పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాల్సి ఉంటుంది. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు పొదుగు,పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి.
డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగకుండా కతిరించాలి. పొదుగును శుభ్రపరచి బట్టతో తుడవాలి. ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం(ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటరు నీటికి 2మి.లీ.కలపాలి)తో కడగాలి.అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి.
పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనియవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకొని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి.
పశువుల షెడ్‌లో
పశువుల షెడ్‌లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపల గడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బరు షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్‌లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి.
పాలు తీసే వ్యక్తి
పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు,చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగించవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పాడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేక పోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడి నీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Friday, 10 July 2015
Monday, 6 July 2015
Saturday, 4 July 2015
Subscribe to:
Posts (Atom)