Monday, 25 May 2015
Tuesday, 19 May 2015
ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స
ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స!
పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు, గుజరాత్‌లోని సర్డా కృషినగర్ హోమియో కళాశాలలో విజయవంతమైన పరిశోధన.‘ఒక జాతి గొప్పతనం జంతువులతో ఆ జాతి వ్యవహరించే తీరులోనే వ్యక్తమౌతుంది’ అంటారు జాతిపిత మహాత్మగాంధీ. మూగజీవుల ఆర్తిని అర్థం చేసుకోగలిగేవారే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారన్నది ఆయన మాటల్లో వ్యక్తమయ్యే భావన. మన చుట్టూ జంతువులు లేని లోకాన్ని ఉహించనే లేం. పెంపుడు జంతువులు విశ్వసనీయ సహచరుల్లా, రక్షకులుగా ఒకానొక సందర్భంలో పోషకులుగా వ్యవహరిస్తాయి. వాటి సంరక్షణలోనే రైతు సౌభాగ్యం ఇమిడి ఉందంటే అతిశయోక్తి లేదు.
మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింప జేస్తే.. వాటి పోషణ, రక్షణలలో మరింత భరోసా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్స చేస్తున్నారు. అనేక యూరోపియన్, ఆసియా దేశాల్లో హోమియో ఔషధాలతో పశుగణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అక్కడక్కడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశంలో పాడి పశువులపై జరిగిన ఓ పరిశోధన ఫలితాలను పాఠకుల అవగాహన కోసం అందిస్తున్నాం..
పశువులో పునరుత్పత్తి శక్తి సాధారణంగా ఉంటేనే రైతుకు పాడి, దూడ దక్కేది. ఎదకు రాని పశువులకు మేపు, కాపు రెండూ దండగే అంటారు పాడి రైతులు. పశువైద్యులు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేక పెదవి విరిచినప్పుడు.. రైతులు మనసు చంపుకొని పశువులను కబేళాలకు అమ్ముకునే దృష్టాంతాలున్నాయి. ఈ సమస్యకు ఇంగ్లిషు వైద్యవిధానంలో పరిష్కారం అందని సందర్భాల్లో హోమియో వైద్య విధానం దారి చూపించింది.
పశువు గొడ్డుపోవడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి. ఒకటి సక్రమంగా అండం విడుదల కాకపోవడం, రెండు గర్భవిశ్ఛితి జరగడం. ఇలాంటి పశువులను రైతు పూర్తిగా గొడ్డుపోయిన వాటిగా భావించలేడు. అలా అని వాటిని పొలం పనుల్లో వినియోగించనూ లేడు. వదులుకోలేక.. సాదుకోలేక.. ఇబ్బంది పడే పరిస్థితిలో రైతులకు కమ్మని కబురందిస్తోంది హోమియో వైద్య విధానం. హోమియో మందులు వాడడం వలన పశువు పునరుత్పత్తి క్రమం సాధారణ స్థాయికి వస్తుందని గుజరాత్‌లోని సర్డాకృషినగర్ పశు వైద్య కళాశాలలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. రాబర్ట్స్, పేంద్‌ల్రు సర్డా కృషినగర్ పశు వైద్య కళాశాల సహకారంతో 100 సంకర జాతి ఆవులు, 85 గేదెలపై అధ్యయనం చేశారు. వీటిలో పది ఆవులు, పది గేదెలకు ఎలాంటి మందులు ఇవ్వలేదు. 90 ఆవులు, 75 గేదెలకు హోమియో మందులతో చికిత్స చేశారు. వీటికి వరుసగా 21 రోజుల పాటు అల్టేరీస్ ఫరినోసా-30, ఆరమేట్-30, ఎపిస్‌మెల్-30, బోరెక్స్-30, కల్కేరియాఫాస్-30, కోలోసెంథిస్-30, ఫోలికులినమ్-30, ఐయోడిన్-30, మూరెక్స్-30, ఓఫోరియమ్-30, పల్లాడియం-30, ప్లాటీనియం-30, పల్సాటిల్లా-30, సెపియా-200ల సమ్మేళనంతో తయారు చేసిన మాత్రలిచ్చారు.
చికిత్స మొదలు పెట్టిన తరువాత 16 రోజుల్లోనే 50 ఆవులు ఎదకు వచ్చాయి. వీటికి 2 నెలల తర్వాత గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా గర్భం నిలిచినట్లు నిర్ధారణ అయింది. తక్కిన 40 ఆవుల్లో 30 ఆవులు చికిత్స పూర్తయిన వారం రోజుల్లో ఎదకు వచ్చాయి. మిగిలిన పదింటికి మరోసారి ఇదే మందు వాడారు. వాడడం ప్రారంభించిన 15 రోజుల్లో ఎనిమిది ఆవులు ఎదకొచ్చినట్లు గుర్తించారు. వీటన్నిటికీ గర్భం నిలిచి చక్కటి దూడలను ఈనాయి. ఇక హోమియో మందులు ఇవ్వని 10 ఆవుల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు.
పరీక్షలు నిర్వహించడానికి ఎంపిక చేసుకున్న సంకరజాతి గేదెలకు జరిపిన చికిత్సల్లో తొలి విడత ఔషధ వినియోగం తర్వాత 65 ఎదకు వచ్చాయి. తక్కిన 10 రెండోసారి చికిత్స ప్రారంభించిన తర్వాత ఎదకు వచ్చాయి. గేదెలన్నిటికీ గర్భం నిలిచి దూడలను ఈనాయి. అసలు ఏ మందూ ఇవ్వని 10 గేదెల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు.
పశువుల్లోని ఎండ్రోకైన్ గ్రంధిని ఉత్తేజపర్చడం ద్వారానే పునరుత్పత్తి చక్రం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు రాబర్ట్, పేంద్‌ల్రు నిర్ధారణకు వచ్చారు. పేంద్‌ల్రు అప్పటికే హోమియో వైద్య విధానంలో ఎం.డీ. కోర్సు ఉత్తీర్ణుడు. డెయిరీ ఆవుల పునరుత్పత్తి సమస్యలపై చేసిన పరిశోధనలకుగాను బుడాపెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాపుచ్చుకున్నారు. రాబర్ట్స్ పశువుల గర్భధారణ సమస్యల మీద పరిశోధన చేశారు.
జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి( నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ):
జాతీయ అత్యవసర విపత్తులు ఎదుర్కొనడానికి ఈ నిధి ఏర్పాటు చేసారు.జాతీయ అత్యవసర పన్నుల విధానం కింద వివిధ రకాలైన దిగుమతులపై వేసిన పన్నుల ద్వారా ఈ నిధి ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ పరిదిలోనున్న రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధులు పూర్తిగా ఖర్చుచేసిన తరువాత లేదా కేటాయించిన నిధులు చాలనప్పుడు రాష్ట్రంలో సంభవించిన విపత్తులపై నివేదిక సమర్పించడం ద్వారా జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోరవచ్చు.
పశుసంపద నష్టపోయిన సన్న మరియు చిన్నకారు రైతులకు /వ్యవసాయ కూలీలకు సహాయం.
ఎ) పశువులు, పాడి పశువులు లేక పనులకు ఉపయోగించే పశువులు కోల్పోయినప్పుడు
పాడి పశువులు:
1.గేదె /ఆవు/ఒంటె-రూ.16,400/-
2.గొర్రె,మేక-రూ.1,650/-
ఒక పెద్ద పాడి పశువు లేక నాలుగు చిన్న పాడి పశువులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తారు.(సంభందిత రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఆ పశువుల నష్టాన్ని ధృవీకరించాలి.)
పశు శిబిరాలకు పశుగ్రాసం/దాన సరఫరా రూ.32/-లకు, పశు శిబిరాలకు నీటిని మరియు మందులు/మాత్రలు/వ్యాక్సిన్, పశు శిబిరాల్లో లేని పశువులకు పశుగ్రాసం సరఫరా అదేవిధంగా రాష్ట్ర స్తాయి కమిటి అంచనాల ఆధారంగా కేంద్ర బృందం సూచన మేరకు వాస్తవ ఖర్చు చెల్లిస్తారు.
పేడ వలన లాభాలు!
పేడ వలన లాభాలు
ఆల మందను చూసి ఆడపిల్లని ఇవ్వాలి అనేది పెద్దల మాట. పాడి ఉన్న చోట పంట ఉంటుందని, ఇవి ఉన్న ఇంటిలో ఆడపిల్ల హాయిగా బతుకుతుందని నాటి పెద్దల భరోసా. పాడికి పంటకు ఉన్న సంబంధం దండలో దారం లాంటిది.. ఒక్కమాటలో.. పంటకు పేడే పెన్నిధి!
పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి.
ఇంతకూ పేడలో ఏముంది?
మనిషిని, అతని చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు శాసిస్తుంటాడనేది కొందరి విశ్వాసం. జీవుల మనుగడ వెనుక కంటికి కనిపించకుండా అంతటా ఆవరించిన శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్ధారిత నిజం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయమే శక్తి. ఆవు పేడ, మూత్రాలలో హితోపకారులైన ఈ సూక్ష్మజీవుల సముదాయాలు కోటాను కోట్లున్నాయి. ఒక గ్రాము పేడలో మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులున్నాయని అంచనా. ఇవి తమ జీవనక్రియ ద్వారా మనిషి మనుగడకే కాదు.. నేల మీద ఉనికిలో ఉన్న అన్ని రకాల జీవజాలం మనుగడకు అవసరమైన వనరులను అందిస్తున్నాయి. ప్రధానంగా పంటల విషయానికి వస్తే.. ఇవి నేల, గాలి, నీరులో ఉన్న అన్ని రకాల పోషకాలను సంగ్రహించి మొక్కలకు అందజేస్తున్నాయి.
సూక్ష్మజీవులే పంటకు పోషణ, రక్షణ!
పేడ ఎరువు ద్వారా పొలం మట్టిలోకి చేరిన ‘మేలు చేసే’ సూక్ష్మజీవులే మన పంటలకు పోషకాలను అందిస్తున్నాయి. కీడు చేసే ఇతర రకాల బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలను నియంత్రించే కాపాలాదారులుగా కూడా వ్యవహరిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టుకునే సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఇదే. ఇవి విరామమెరుగక చెమటను చిందించే రైతు కంటే ఎక్కువగా అనుక్షణం శ్రమిస్తుంటాయి. ఇవే కాకుండా మొక్కల మనుగడకు, ఎదుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నాయి. వీటికి తోడు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, రాగి, సల్ఫర్, మాంగనీస్, మల్బేడినమ్, వనాడియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు పంటలకు అత్యవసరమైన అమినో ఆమ్లాలు పేడలో ఉన్నాయి. తొలి వ్యవసాయ సమాజాలు ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన అనుభవాలను క్రోడీకరించి పూర్వీకులు ప్రాచీన భారతీయ వ్యవసాయ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ‘కృషి పరాశర’, ‘వృక్షాయుర్వేద’, ‘కృషివల్లభ’, ‘కాష్యపీయ కృషి సూక్తి’, ‘లోకోపకార’ తదితర ప్రాచీన భారతీయ వ్యవసాయ విజ్ఞాన గ్రంథాలన్నిటిలోనూ పశువుల పేడ, పశువుల మూత్రంను వివిధ పద్ధతుల్లో వ్యవసాయానికి ఎలా వాడేదీ వివరించారు. పేడ, మూత్రంలను ఎరువులుగా, చీడపీడల నివారిణులుగా ఉపయోగించడం గురించి విశదపరిచారు.
ఏభయ్యేళ్ల క్రితం వచ్చిపడిన పారిశ్రామిక వ్యవసాయ విధానంతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మజీవరాశికి నిలయమైన పేడ తదితర సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యం తగ్గి.. వివిధ రకాల రసాయనాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం అభివృద్ధి మాటెలా ఉన్నా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాలం అకాలమై, రుతువులు గతి తప్పాయి. ఈ విషయాన్ని వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలు సాధారణ వ్యవసాయ కూలీల వరకు అందరూ గుర్తించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం తిరిగి తన మూలాలను శోధించుకోవాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి. కృత్రిమ రసాయనిక ఎరువుల స్థానంలో.. పేడ, మూత్రంలతో తయారైన సహజ ఎరువులు, పంటల వ్యర్థాలతో తయారయ్యే కంపోస్టులే భూమికి బలిమిని, రైతుకు కలిమిని ఇస్తున్నాయి. ఎందరో రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు.
ఆవు పేడతో ఉపయోగాలెన్నో!
ఆవు పేడ ఉపయోగాలేమిటి? అని అడగటం అంటే.. సూర్యుడి ప్రయోజనం ఏమిటి? అని అడగటం వంటిదే!
రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం.
వ్యవసాయానికి దిబ్బ ఎరువు, పంచగవ్య, బీజామృతం, జీవా మృతం, అమృత్‌పానీ తయారీలో ఆవు పేడ వాడకం తప్పనిసరి.
పంచగవ్యను మనుషులకూ ఔషధంగా వాడుతున్నారు.
కిలో పేడతో ‘నాడెప్’ పద్ధతిలో 20 కిలోల ఎరువును చేయొచ్చు.
సేంద్రియ పురుగుమందులతోపాటు సౌందర్య సాధనాలు, కాగితం, దోమల కాయిల్స్, ధూప్ స్టిక్స్ తయారీలో ఉపయోగ పడుతోంది.
గ్రామస్థాయిలో గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసు కోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేడ ప్రయోజనాలు ఇంకెన్నో..
మెట్ట ప్రాంతాల ఆవుల పేడ శ్రేష్టం
సాధారణంగా పశువుల పేడలో నత్రజని 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1% ఉంటాయి. అయితే, జంతువును బట్టి, జాతిని బట్టి, మేతను బట్టి పేడలో పోషకాల శాతం మారుతుంటుంది. మెట్ట ప్రాంతాల్లో గడ్డి మేసే ఆవుల పేడలో అన్ని రకాల (స్థూల, సూక్ష్మ) పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. - డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు,
అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థ, పటాన్‌చెరు, హైదరాబాద్
పాశ్చాత్యులకూ పేడంటే ప్రేమే!
సూక్ష్మజీవులు, వానపాములు వ్యవసాయం లో అంతర్భాగమని తొలుత గుర్తించి, ప్రకటించిన మహానుభావుడు జీవపరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన స్ఫూర్తితో.. బాలలకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయులను అమెరికాకు చెందిన ఎఫ్‌ఎఫ్‌ఎ సంస్థ సన్మానిస్తోంది. ఎండిన ఆవు పేడ ముద్దకు బంగారు పూతపూసి బహుమతిగా ఇస్తోంది. 2013లో బెట్టీకూన్ అనే ఉపాధ్యాయినికి ఈ అవార్డు దక్కింది.
ప్రాణ రక్షక ఔషధం పేడ!
పేడ సజీవమైన ఎరువు. మట్టిలోని జీవులకు పేడ ప్రాణ రక్షక ఔషధం వంటింది. భూసారాన్ని పెంపొందించడంలో పేడ పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ, తండ్రులు, తాతల నాటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలో చాలా వరకు వదిలేశాం. కర్నాటక, మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఇప్పటికీ పట్టుదలగా సేంద్రియ సాగు కొనసాగిస్తున్నారు. పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం, బీజామృతం వంటి వాటిల్లో పేడను విరివిగా వాడుతున్నారు
వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీతసమయాలు
వరుససంఖ్య
|
వయసు
|
టీకా
|
1.
|
*నాలుగవ
నెల
*రెండు నుంచి నాలుగు నెలల తర్వాత
*సంవత్సరానికి
మూడుసార్లు(వ్యాధి
ప్రబలంగా ఉన్న
ప్రాంతాలలో)లేదా
సంవత్సరానికి రెండు
సార్లు
|
ఫుట్ అండ్
మౌత్ (యఫ్
యమ్ డి
) వ్యాధినిరోధక టీకా
మొదటి డోసు
యఫ్ యమ్ డి రెండో డోసు యఫ్ యమ్ డి బూస్టర్ |
2.
|
ఆరు నెలలు
|
ఆంత్రాక్స్ టీకా
|
3.
|
ఆరు నెలలతర్వాత
|
హెమరాజిక్ సెప్టికెమియా
(హెచ్ యస్)టీకా |
4.
|
సంవత్సరానికి ఒక్కసారి
|
బి క్యు,హెచ్
యస్,ఆంత్రాక్స్
|
దేశవాళి ఆవులే మేలు
దేశంలోని గోజాతిని దేశవాళి, విదేశీ, సంకర జాతులుగా విభజించవచ్చు. మిగిలిన రెండు జాతుల కంటే స్వదేశీ ఆవులు ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన అధిక ఉష్ణ పరిస్థితుల్లో కూడా పాల దిగుబడులలో తేడా లేకుండా ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను తట్టుకోగలిగిన సామర్థ్యం ఎక్కువగా ఉండడం వలన వీటికి ఆరోగ్య సమస్యలు తక్కువ. ఈ లక్షణాలు సంకర, విదేశీ జాతి ఆవుల్లో దాదాపు కనిపించవంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి చెందిన ఏడీఏలు డాక్టర్ విజయకుమార్ శర్మ, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఇది. ఇందులో స్వదీశీ జాతుల విశిష్టత, వివిధ రాష్ట్రాల్లో పేరొందిన జాతుల గురించి వివరిస్తున్నారు...
దేశీయ ఆవులు స్థానికంగా లభించే తక్కువ పోషక విలువలు కలిగిన గడ్డిని సమర్థవంతంగా వినియోగించుకుని విదేశీ, సంకరజాతి ఆవులు అందించే వెన్న శాతం కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాయి (4-5 శాతం). దీనికి విరుద్ధంగా విదేశీ, సంకరజాతి ఆవులు ఎక్కువ దాణా, ఎక్కువ పోషకాలున్న గడ్డిని మేపినపుడు మాత్రమే ఎక్కువ పాల దిగుబడినిస్తాయి. అంతేకాక వీటి పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. 1995, 2007లలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో స్వదేశీ జాతుల్లో దూడల మరణాలు కేవలం ఐదు శాతం కాగా అదే విదేశీ హెచ్‌ఎఫ్ జాతి దూడల్లో 31 శాతం, జెర్సీ దూడల్లో 28.3 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.
జాతీయ పశు జన్యు సంపద సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్) వారు ప్రకటించిన భారతీయ గోజాతుల సంఖ్య 30. ఇందులో కొన్ని పాల ఉత్పత్తికి, ఎక్కువ భాగం వ్యవసాయ, రవాణా పనులకు పేరొందాయి. మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరు, కర్నాటకలోని హాలీకార్, ఖిల్లారి, క్రిష్ణవేలీ, మల్నాడ్‌గిడ్డ, కేరళలోని వేచూర్, కాసరగడ్, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరీ, గుజరాత్‌లోని గిర్, రాజస్థాన్‌లోని రెడ్‌సింధీ, థార్‌పార్కర్, కాంక్రెజ్, రాథీ, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, పంజాబ్‌లోని సాహివాల్ జాతి ఆవులు, ఎద్దులు పాడికి, ఆయా పనులకు ప్రముఖంగా పేరొందాయి. వీటిలో ఇప్పటికే ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకున్నాం. మరికొన్ని జాతుల వివరాలు..
వేచూర్
కేరళ రాష్ట్రానికి చెందిన వేచూర్ జాతి ఆవులు, గిత్తలు పొట్టి జాతిగా పేరొందాయి. మన పుంగనూరు, కేరళ వేచూర్ జాతుల్లో ఏది ఎక్కువ పొట్టి అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వేచూరి జాతి ఆవుల సగటు ఎత్తు 80-90 సెంటీమీటర్లు. గిత్తల ఎత్తు 85-95 సెంటీమీటర్లు కాగా పుంగనూరు జాతి పశువులు 60-100 సెంటీమీటర్ల ఎత్తుంటాయి. వేచూర్ జాతి పశువులు ఎక్కువగా లేత ఎరుపు లేదా నలుపు రంగులో ఉంటాయి.
శరీర నిర్మాణ పరంగా చిన్నవైనప్పటికీ వ్యవసాయ పనులకు ఈ గిత్తలు ప్రసిద్ధి. ఈ జాతి దూడలలో సహజ మరణాలు దాదాపు శూన్యం. ఆవులు శ్వాసకోశ, గాలికుంటు, పొదుగువాపు వ్యాధులను సమర్థవంతంగా తట్టుకోగలవు. రోజుకు సగటున 2.5 లీటర్ల నుంచి 3.5 లీటర్ల పాల దిగుబడినిస్తాయి. వేచూర్ జాతి ఆవు పాలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు.
కాసరగడ్
కేరళకు చెందిన కాసరగడ్ జాతి పశువులు అధిక ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఇవి కూడా వేచూర్ జాతి మాదిరే పొట్టి రకం. వీటిలో ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువ. కాసరగడ్ జాతి దూడలు సంవత్సరం వయసునాటికి అవి పుట్టిన నాటి బరువు కంటే 7-8 రెట్లు అధిక బరువు కలిగిఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ జాతి పశువులు పాల దిగుబడి కంటే వ్యవసాయ పనులకు బాగా పేరొందాయి.
మాల్వీ
మధ్యప్రదేశ్‌లోని మాల్వీ ప్రాంతంలో గుర్తించిన ఈ జాతికి ఆ ప్రాంతం పేరిట మాల్వీ అనే పేరు వచ్చింది. ఈ జాతి ఎద్దులు ప్రధానంగా బరువులు లాగే వ్యవసాయ పనులకు ప్రసిద్ధి. ఒండ్రు నేలలు, బంక మట్టి నేలల్లో పెద్ద పెద్ద నాగళ్లను లాగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆవులు తక్కువ పాలదిగుబడినిస్తాయి.
పుంగనూరు ఆవులు
మన రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు ప్రపంచ గోజాతుల్లో అతి చిన్నదిగా పేరొందింది. ఈ జాతి ఆవుల కన్నా మగ పశువులు మెతక స్వభావము కలిగి ఉంటాయి. చక్కని ముఖంతో, బూడిద రంగుతో బాగా వృద్ధి చెందిన మెడ, మూపురంతో ఉంటాయి. కురచకాళ్ళతో, గట్టి గిట్టలు కలిగి ఉంటాయి. వీటి విశిష్ట శరీర నిర్మాణం వలన కొండలు, గుట్టలు, వాలు ప్రాంతాలను సులువుగా ఎక్కి దిగగలవు. ఈ జాతి పశువులు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి కరువు పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉంది.
వీటి ఎత్తు 60 -100 సెంటీమీటర్లు, బరువు 130-200 కిలోలు. ఇవి కొత్త వారిని చూడగానే బెదురుతాయి. పుంగనూరు ఆవులు ఒక ఈతలో 1100 లీటర్ల వరకు (రోజుకు మూడు నుంచి మూడున్న లీటర్లు) పాలు ఇస్తాయి. చిన్నపాటి శరీరాకృతి కారణంగా వీటిని రైతులు వ్యవసాయ పనులకు తక్కువగా వినియోగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేని ప్రత్యేకత దానిదే
గోజాతికి మన దేశం పెట్టింది పేరు. ఏ జాతి ప్రత్యేకత దానిదే. సామర్థ్యాన్ని బట్టి పాల ఉత్పత్తికి ఉపయోగపడేవి కొన్నయితే పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపకరించేవి మరి కొన్ని.కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగపడే జాతులు కూడా ఉన్నాయని చెబుతున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఏడీఏలు డాక్టర్ విజయ కుమార్ శర్మ, డాక్టర్ ఖదీర్ బాషా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 28 నుంచి దేశీయ ఆవుల పాల పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వారు అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోది...
మన రాష్ట్రంలోని ఒంగోలు, పుంగనూరు, మధ్యప్రదేశ్‌లోని మాల్వీ, కేరళలోని వేచూర్, కాసరగడ్ జాతుల ఆవుల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ వారం కర్ణాటకలోని కృష్ణావ్యాలీ, మల్నాడుగిడ్డ, అమృతమహల్, హల్లికార్, ఖిలారీ, తమిళనాడులోని కంగాయం, ఉంబ్లాచెరి జాతుల విశిష్టతల గురించి తెలుసుకుందాం.
పాల దిగుబడి స్థిరంగా ఉండదు
కృష్ణావ్యాలీ జాతిని ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఒండ్రు, నల్లరేగడి నేలల్లో వ్యవసాయాధారిత పనుల కోసం అభివృద్ధి చే శారు. గిర్, ఒంగోలు, కాంక్రెజ్, హల్లికార్ జాతుల్ని సంకరపరచి వీటిని అభివృద్ధి చేశారు. వీటి శరీరంపై బూడిద తెలుపు, తెలుపు, గోధుమ, నలుపు రంగులు కలగలసిన మచ్చలు ఉంటాయి. గిర్, ఒంగోలు జాతుల్ని సంకరపరచి అభివృద్ధి చేసిన కృష్ణావ్యాలీ ఆవు సగటున రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల పాల దిగుబడి ఇచ్చినప్పటికీ అది స్థిరంగా ఉండదు. గిట్టలు మెత్తగా ఉండడం వల్ల ఈ జాతి గిత్తలు, ఎడ్లు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో మంచి పనితనాన్ని ప్రదర్శిస్తాయి.
పనిలో దిట్ట
మల్నాడుగిడ్డ ఆవులు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనులకు ప్రసిద్ధి చెందినవి. పొట్ట, డొక్కల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల తక్కువ మేత తింటాయి. అయితే పనిలో మాత్రం మంచి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. గాలికుంటు వ్యాధిని, వలసల కారణంగా సంక్రమించే వ్యాధుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. రోజుకు 1.5 లీటర్ల నుంచి నాలుగు లీటర్ల పాల దిగుబడి ఇస్తాయి.
మైసూర్ రాజుల కాలం నుంచి...
మైసూర్ రాజుల కాలంలో అమృతమహల్ జాతి ఆవులు బాగా వృద్ధి చెందాయి. అప్పట్లో సైనిక వాహనాల్ని నడిపేందుకు వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాతి కాలంలో మైసూర్ సంస్థానాధీశుడు టిప్పుసుల్తాన్ ఈ జాతి ప్రత్యేకతను గుర్తించి మరింత అభివృద్ధి చేశాడు. వీటి విశిష్టతకు తగినట్లు అమృతమహల్...అంటే అమృత (పాలు) భాండమనే అర్థం వచ్చేలా పేరు పెట్టాడు. ఈ జాతి ఆవులు కొంత తెలుపు రంగులో ఉంటాయి. రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి. ఇవి పాల దిగుబడికి, వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయి.
దక్షిణాది ఆవులకు మాతృ జాతి
దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ గోజాతులకు హల్లికార్‌ను మాతృ జాతిగా చెప్పవచ్చు. వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల నిర్వహణలో దీనికి మంచి పేరు ఉంది. దీని శరీరం ప్రధానంగా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. తల పొడవుగా, మూతి భాగం మొనదేలినట్లు ఉంటుంది. నుదుటి నుంచి ముక్కు భాగం వరకూ కాలువ లాంటి గాడి కలిగి ఉంటుంది.
రవాణాకూ ఉపయోగపడతాయి
ఖిలారీ జాతి ఆవులు వ్యవసాయ, వ్యవసాయాధారిత పనుల్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తాయి. ఇవి గోధుమ, తెలుపు రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. తల సన్నగా ఉండి, పొడవైన కొమ్ముల మొదలు వద్ద ఇరు వైపులా ఉబ్బినట్లు ఉంటుంది. కొమ్ముల మొదలు నుంచి ముక్కు వరకూ గాడి ఉంటుంది. గిట్టలు దృఢంగా ఉండి వ్యవసాయ, రవాణా పనులకు బాగా ఉపయోగపడతాయి.
ప్రతికూల వాతావరణంలోనూ...
పొలం పనులకు, రవాణాకు కంగాయం జాతి పశువులు బాగా పేరు తెచ్చుకున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంది. మధ్యస్త పరిమాణంలో ఉండే ఈ పశువులు కేవలం పనికి మాత్రమే ఉపయోగపడతాయి. చురుకుగా, చలాకీగా ఉంటూ వేగంగా నడవడం వీటి సహజ స్వభావం. పనికి ఉపయోగపడే జాతిగా దక్షిణ భారతదేశంలో పేరు పొందాయి. శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తల, మెడ, మూపురం, భుజాలు, మణుగుల వద్ద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ జాతి ఆవులు ప్రతి 15 నెలలకు ఒకసారి ఈనతాయి. తేలికపాటి పొలాల్లో ఆవులతో సేద్యం చేస్తారు.
పాడికి పనికిరావు
తంజావూరుకు చెందిన స్థానిక గోజాతితో కంగాయం జాతిని సంకరపరచి ఉంబ్లాచెరి జాతిని అభివృద్ధి చేశారు. ఈ జాతి ఆవుల శరీర పరిమాణం మధ్యస్తంగా ఉంటుంది. పొట్ట చిన్నదిగా ఉంటుంది.ఈ ఆవులు బూడిద రంగు, బూడిద నలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పాడికి పనికిరావు. ఎద్దులు చక్కగా పనికి ఉపయోగపడతాయి. వ్యవసాయ, వ్యవసాయాధారిత, రవాణా పనులకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
సంకర జాతి పశువులకు కావాల్సిన వసతి స్థలం
వయస్సు
- తరగతి
పశువుల
కొట్టం స్థలం
(మీ)
షెడ్డు
ఉన్న స్థలం
(చ.మీ.)
ఖాళీ
స్థలం (చ.మీ.)
4-6 నెలలు
0.2-0.3
0.8-1.0
3.0-4.0
6-12 నెలలు
0.3-0.4
1.2-1.6
5.0-6.0
1-2 సంవత్సరాలు
0.4-0.5
1.6-1.8
6.0-8.0
ఆవులు
0.8-1.0
1.8-2.0
11.0-12.0
చూడి ఆవులు
1.0-1.2
8.5-10.0
15.0-20.0
ఆబోతులు *
1.0-1.2
9.0-11.0
20.0-22.0
సంకర జాతి పశువులకు కావాల్సిన వసతి స్థలం
వయస్సు
- తరగతి
|
పశువుల
కొట్టం స్థలం
(మీ)
|
షెడ్డు
ఉన్న స్థలం
(చ.మీ.)
|
ఖాళీ
స్థలం (చ.మీ.)
|
4-6 నెలలు
|
0.2-0.3
|
0.8-1.0
|
3.0-4.0
|
6-12 నెలలు
|
0.3-0.4
|
1.2-1.6
|
5.0-6.0
|
1-2 సంవత్సరాలు
|
0.4-0.5
|
1.6-1.8
|
6.0-8.0
|
ఆవులు
|
0.8-1.0
|
1.8-2.0
|
11.0-12.0
|
చూడి ఆవులు
|
1.0-1.2
|
8.5-10.0
|
15.0-20.0
|
ఆబోతులు *
|
1.0-1.2
|
9.0-11.0
|
20.0-22.0
|
పశువులలో గొడ్డు మోతుతనానికి (వంధ్యత్వం) గల కారణాలు మరియు చికిత్సా పద్ధతులు
- పశువులలో గొడ్డు మోతుతనం వలన విపరీతమైన ఆర్ధిక నష్టం వాటిల్లి భారత దేశంలో పాడి పరిశ్రమ కుంటుపడుతోంది. గొడ్డుపోయిన పశువుల పోషణ ఆర్ధికపరంగా భారమౌతుంది. చాలా దేశాలలో అలాంటి పశువులను కబేళాలకు తరలిస్తారు.
- పశువులలో గొడ్డు మోతు తనం వలన, ఇతర పునరోత్పత్తి సమస్యల వలన పాల ఉత్పత్తి 10-30 శాతం వరకూ తగ్గిపోతోంది. పశువులలో సంతానోత్పత్తి పెరగడానికి ఆడ పశువులకు, మగ పశువులకు మేతను బాగా ఇచ్చి, రోగాలేవీ లేకుండా చూసుకోవాలి.
పశువులలో వంధ్యతకు గల కారణాలు
- గొడ్డు మోతుతనానికి గల కారణాలు అనేకం మరియు సంక్లిష్టమైనవి. సంతానోత్పత్తి జరుగకపోవడానికి పోషకాహార లోపం, అంటువ్యాధులు, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాలు, యాజమాన్య దోషాలు మరియు ఆడ పశువులలో అండోత్సర్గం లేక హార్మోను సమతుల్యత లేకపోవడం కారణాలు కావచ్చు.
- ఋతు చక్రం
- ఆవులు, గేదెలు కూడా 18-21 రోజులకొకసారి 18-24 గంటల పాటు ఎదకు వస్తాయి. అయితే గేదెలలో మూగ ఎద ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని తెలుసుకోవటం రైతులకు పెద్ద సమస్యగా మారుతుంది. తెల్లవారు ఝాము నుండి రాత్రి పొద్దు పోయేంత వరకూ 4 -5 సార్లు పశువులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పశువులు ఎదకు రావడాన్ని పసికట్టలేక పోయినట్లయితే వంధ్యత్వం పెరుగుతుంది. కంటికి కనిపించే లక్షణాలను బట్టి ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి మంచి నైపుణ్యం కావాలి. రికార్డులను సరిగా పెట్టుకుని పశువులను పరికించడంలో ఎక్కువ సమయం గడిపిన రైతులు మరింత మంచి ఫలితాలు సాధించారు.
గొడ్డు మోతుతనం నివారించడానికి చిట్కాలు
• గర్భధారణ ఎద సమయంలో జరిగేటట్లు చూసుకోవాలి.• పశువులు ఎదకు రాకపోయినా లేక ఋతుచక్రం సరిగా లేకపోయినా వాటికి పరీక్ష చేయించి, చికిత్స ఇప్పించాలి.
• పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి ఆరు నెలలకొకసారి కడుపులోని ఏలికపాములను అరికట్టడానికి మందు ఇప్పించాలి. క్రమం తప్పకుండా కడుపులోని ఏలికపాములను నివారించడం మీద పెట్టిన చిన్న పెట్టుబడి, పాల సరఫరాలో పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించి పెడుతుంది.
• పశువులకు శక్తి నిచ్చే, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు మరియు విటమిన్ అనుబంధంతో కూడుకున్న సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. దీని వలన గర్భధారణ శాతం పెరిగి, గర్భం ఆరోగ్యకరంగా నిలిచి, ప్రసవం సురక్షితంగా జరిగి, అంటువ్యాధులు రాకుండా ఉండి దూడ ఆరోగ్యంగా ఉంటుంది.
• దూడలకు / పెయ్యలకు మంచి పోషణ ఇచ్చి సంరక్షిస్తే 230 -250 కిలోల వరకూ బరువు పెరిగి సకాలంలో యుక్త వయస్సుకు వచ్చి, గర్భధారణకు అనువుగా తయారై సంతానోత్పత్తికి అవకాశాలు మెరుగుపడతాయి.
• చూడి పశువులకు సరిపడినంత పచ్చి మేత మేపితే పుట్టిన దూడలకి అంధత్వం రాకుండా ఉంటుంది. దూడ పుట్టగానే మాయ కూడా సులభంగా పడిపోతుంది.
• సహజంగా జరిగే గర్భాదారణలో, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలు మరియు అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఆబోతు (లేక దున్నపోతు) యొక్క పునరుత్పత్తి చరిత్ర తెలిసి ఉండడం చాలా ముఖ్యం.
• పశువుల పునరుత్ర్పత్తి ప్రక్రియ మరియు ప్రసవం పరిశుభ్రమైన పరిస్థితులలో జరిపించినట్లయితే చాలావరకూ గర్భసంచికి అంటువ్యాధులు సోకకుండా నివారించుకోవచ్చు.
• కృత్రిమ సంపర్కం జరిపించిన 60-90 రోజులకు, పశువులు చూలు కట్టిందీ లేనిదీ పశు వైద్యులతో పరీక్ష చేయించి ధ్రువపరచుకోవాలి.
• చూలు కట్టిన పక్షంలో ఇంక ఆవు (లేక గేదె) గర్భధారణ కాలంలో ఎదకు రాదు. ఆవుకి గర్భావధి కాలం 285 రోజులు, మరి గేదెలకు 300 రోజులు.
• గర్భధారణ చివరి దశలలో అనవసరమైన ఆందోళన కలిగించ కూడదు మరియు అనవసరంగా ఎక్కడికీ తీసుకొని వెళ్ళరాదు.
• మెరుగైన పోషణకు, ప్రసవ సమయంలో సంరక్షణ కొరకు చూడి పశువును మిగతా పశువులతో బాటు కాకుండా దూరంగా ఉంచాలి.
• ప్రసవానికి రెండు నెలల ముందు చూడి పశువులను ఎండ గట్టి, తగినంత పోషణ మరియు వ్యాయామం ఇవ్వాలి. దీని వలన తల్లి పశువుకు ఆరోగ్యం మెరుగుపడి సగటు బరువు కల్గిన ఆరోగ్యవంతమైన దూడను ప్రసవిస్తుంది. అంతే కాకుండా వ్యాధులు సోకకుండా ఉండి తొందరగా ఋతు చక్రం తిరిగి మొదలౌతుంది.
• డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ టెన్షన్, TANUVAS ప్రకారము ఈనిన నాలుగు నెలలలోపు లేక 120 రోజుల తరువాత మళ్ళీ గర్భధారణ మొదలైతే ఏడాదికి ఒక దూడ అన్న లక్ష్యం నెరవేరి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది.
గేదెల పెంపకం
గేదె దూడల నిర్వహణ
పుట్టిన వెంటనే ముక్కులో, నోటిలో ఉన్న మావి పొర లేదా జిగురు పదార్ధాన్ని (శ్లేష్మం) తుడిచి వేయాలి.
· సాధారణంగా పుట్టిన వెంటనే దూడను ఆవు నాకుతుంది. దీనివలన దూడ పొడిగా అయి, శ్వాసక్రియకు మరియు రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. ఆవు అలా నాకని పక్షంలో కానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, దూడను పొడి బట్టతోనో, గోనె సంచీ బట్టతోనో రుద్ది పొడిగా తుడవాలి. ఛాతీ భాగాన్ని చేత్తో ఒత్తి వదిలిపెడుతూ కృత్రిమ శ్వాసను అందివ్వాలి.
· బొడ్డును శరీరానికి 2 – 5 సెం.మీ దిగువన దారంతో కట్టి ముడి దిగువ భాగంలో 1 సెం.మీ. దూరంలో కత్తిరించి టించర్ అయోడిన్ లేక బొరిక్ ఆమ్లం కానీ లేదా ఏదైనా ఆంటీబయాటిక్ కానీ అద్దాలి.
· పశువుల దొడ్డిలో నేల మీద తడిగా ఉన్న గడ్డి గాదం తీసివేసి షెడ్డును చాలా శుభ్రంగానూ, పొడిగానూ ఉంచాలి.
· దూడ యొక్క బరువును తూచి నమోదు చేయాలి
· ఆవు యొక్క పొదుగును, వీలయితే క్లోరిన్ ద్రావణంతో కడిగి ఆరనివ్వాలి.
· దూడ మొదటిగా తల్లి పాలు ( జున్ను పాలు) తాగడానికి వదలాలి
· ఒక గంటలో, దూడ నిల్చుని పాలు తాగడానికి ప్రయత్నిస్తుంది. దూడ బలహీనంగా ఉంటే అందుకు సహాయం చెయ్యాలి.
దూడలకి ఆహారాన్నివ్వడం
అప్పుడే పుట్టిన దూడకు మొట్టమొదటి సారిగా ఇచ్చే అతి ముఖ్యమైన ఆహారం జున్నుపాలు. దూడ పుట్టిన తర్వాత 3 నుండి 7 రోజులవరకూ తల్లికి జున్నుపాలు వుంటాయి. జున్ను పాలు దూడకి పోషకాలను, ద్రవాలను అందిస్తాయి. అంతే కాక జున్ను పాలు వ్యాధి నిరోధక ఆంటీబాడీలను కూడా అందిస్తాయి. ఈ ఆంటీబాడీలు దూడను అంటురోగాల బారి నుండి పోషక లోపాల సమస్య నుండి కాపాడతాయి. పాలు ఉండడం బట్టి, దూడకు మొదటి మూడు రోజులూ జున్నుపాలను ఇవ్వాలి.
పుట్టినప్పుడు ఇచ్చే జున్నుపాలతో బాటు దూడలకు మొదటి 3-4 వారాల పాటు పాలు ఇవ్వడం అవసరం. అటు తర్వాత దూడలు కొద్ది కొద్దిగా గడ్డిలోని పిండి పదార్ధాలనూ, చెక్కెరనూ అరిగించుకోగలుగుతాయి. ఆ పైన కూడా పాలు తాగిస్తే పోషక పరంగా మంచిదే కానీ, గింజ ధాన్యాలను మేపడం కన్నా ఖరీదు ఎక్కువ పడుతుంది. అన్ని ద్రవ పదార్ధాలనూ మామూలు (గది లేక శరీర ) ఉష్ణోగ్రత లోనే ఇవ్వాలి.
దూడలకు మేత నిచ్చే పాత్రలను చాలా శుభ్రంగా కడగాలి. సంబంధిత సామగ్రిని శుభ్రంగానూ పొడిగానూ ఉన్న చోట దాచాలి.
నీరు ముఖ్యం:
ఎల్లప్పుడూ పరిశుభ్రమైన మంచి నీరు అందుబాటులో ఉండేలా చూడాలి. దూడ ఒకేసారి ఎక్కువగా నీళ్ళు తగేయకుండా ఉండడానికి, నీటిని వేరొక పాత్రలో పోసి, దూడ పాలు తాగే ప్రదేశానికి దూరంగా ఉంచాలి.
దూడలకు ఆహారాన్నిచ్చే పద్ధతులు
దూడలను మేపే పద్ధతి వాటికి పెట్టే మేత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ పద్ధతులను పాటిస్తారు:
· వెన్న తీయని పాలను ఇవ్వడం
· వెన్న తీసిన పాలను ఇవ్వడం
· పాలు కాకుండా తాజా మజ్జిగ, తాజా పాల విరుగు నీరు, గంజి వంటి ద్రవ పదార్ధాలు ఇవ్వడం
· పాలకు బదులుగా వాడే పదార్దాలనివ్వడం
· దూడలకి ప్రత్యేకంగా మార్కెట్లో లభ్యమయ్యే మేతను ఇవ్వడం
· పాలిచ్చే ఆవుల పాలతో పెంచడం
వెన్న తీయని పాలను ఇవ్వడం
· పుట్టిన నాటి నుండి మూడు నెలల మధ్య వయసు, 50 కిలోల సగటు శరీర బరువు కల దూడ యొక్క పోషక అవసరాలు ఈ విధంగా ఉంటాయి:
డ్రై మాటర్ (శుష్క పదార్ధం) - డి. ఎం. 1.43kg
టోటల్ డైజస్టిబుల్ న్యూట్రియంట్స్ (మొత్తం జీర్ణమయ్యే పోషకాలు) - టి.డి. ఎన్. 1.60kg
క్రూడ్ ప్రోటీన్స్ (ముడి ప్రాణ్యాలు) 315g
· డి.ఎం. అవసరం కన్నా టి.డి.ఎన్. అవసరం ఎక్కువ ఉన్నట్లు గమనించాలి. దీనికి కారణం దూడకు ఇచ్చే ఆహారంలో కొవ్వు నిష్పత్తి ఎక్కువగా ఉండడమే. ఒక పదిహేను రోజులైతే దూడలు మెల్ల మెల్లగా గడ్డిని తినడం మొదలు పెట్టి రోజుకు ఒక అర కేజీ గడ్డి వరకూ తింటాయి. ఒక పదిహేను రోజులైతే దూడలు మెల్ల మెల్లగా గడ్డిని తినడం మొదలు పెట్టి రోజుకు ఒక అర కేజీ గడ్డి వరకూ తింటాయి. క్రమంగా మూడు నెలలయ్యే సరికి అది 5 కేజీ ల వరకూ పెరుగుతుంది.
· ఈ సమయంలో దూడకు పచ్చ గడ్డికి బదులుగా 1-2 కేజీల మంచి ఎండు గడ్డిని ఇవ్వచ్చు. 15 రోజుల వయసున్నప్పుడు అర కే.జీ.తో మొదలు పెట్టి 3 నెలలు వచ్చేటప్పటికి దాన్ని 1.5 కే.జీ.ల వరకూ పెంచవచ్చు.
· మూడు వారాల నుండి, వెన్న తీయని పాలు ఎక్కువగా లేని పక్షంలో దానికి బదులుగా కొంత వరకూ, వెన్న తీసేసిన పాలనూ, మజ్జిగానూ లేదా మరేదైనా పాలకు బదులుగా వాడే ద్రవ పదార్ధాన్ని ఇవ్వచ్చు.
దూడల దాణా
· పాలు లేక మరేదైనా ద్రవ పదార్ధంతో బాటు దూడకి ఒక ఘన పదార్ధాన్ని కూడా అదనంగా (సప్లిమెంట్ గా) ఇస్తారు. ఈ దాణాలో ముఖ్యంగా మొక్క జొన్నలు మరియు యవలు ఉంటాయి.
· బార్లీ, గోధుమ మరియు జొన్న వంటి ధాన్యాలు కూడా ఈ పోషక మిశ్రమంలో చేర్చవచ్చు. ఈ మిశ్రమంలో 10 % వరకూ చెరుకు పిప్పిని కూడా చేర్చవచ్చు.
· ఒక మంచి పోషక మిశ్రమం 80 % టి.డి.ఎన్.ను మరియు 22 % సి.పి.ని కలిగి ఉంటుంది.
దూడకు ఇచ్చే పీచు పదార్ధం
· సన్నని కాండాలూ, బాగా ఆకులూ ఉన్న కాయ జాతి పశు గ్రాసాలు దూడకు ఇవ్వడం చాలా మంచిది. రెండు వారాల వయసు నుంచి ఎండు గడ్డిని ఇవ్వచ్చు. ఒక కాయ జాతి పశుగ్రాసం మరియు గడ్డి జాతి పశుగ్రాసం కలిపి ఇస్తే మరీ మంచిది.
· తాజా ఆకు పచ్చ రంగును కలిగి ఉన్న, ఎండలో ఎండ బెట్టిన గడ్డిలో విటమిన్ ఏ మరియు డీ, ఇంకా బీ కాంప్లెక్స్ విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి.
· ఆరు నెలల వయసులో ఒక దూడ 1.5 నుండి 2.25 కే.జీ.ల ఎండు గడ్డిని తింటుంది. ఇది వయసుతో బాటు పెరుగుతుంది.
· దీనికి తోడు 6, 8 వారాలు మొదలు, కొద్ది కొద్దిగా పాతర గడ్డి కూడా పెట్టవచ్చు. ఐతే మరీ చిన్న వయసులో పాతర గడ్డి పెట్టడం వలన దూడకు విరోచనాలు అవుతాయి.
· నాలుగైదు నెలలు వచ్చే వరకూ దూడకు పాతర గడ్డి ఇవ్వడం అంత మంచిది కాదు.
· సర్వ సాధారణంగా ఇచ్చే మొక్క జొన్న, జొన్న, నిజానికి అంత ఎక్కువగా ప్రోటీన్లను, కాల్షియం ను కలిగి ఉండవు. విటమిన్ డీ కూడా తక్కువే ఉంటుంది
వేరొక ఆవుతో పాలు ఇప్పించడం
· పాలలో కొవ్వు తక్కువగా ఉండి పాలు పితకడానికి ఇబ్బందిగా ఉన్న ఆవులతో 2 నుండి 4 దూడలకు మొదటి వారం నుంచీ పాలు ఇప్పించవచ్చు.· గడ్డితో బాటుగా ఘన పదార్ధాన్ని కూడా వీలైనంత త్వరగానే మొదలు పెట్టాలి. రెండు మూడు నెలల వయసులో దూడలని తల్లి నుండి వేరు చేసి పెంచాలి.
దూడలను గంజితో పెంచడం
గంజి ద్రవ రూపంలో ఇచ్చే కాఫ్ స్టార్టర్ (తొలి రోజుల్లో దూడకు ఇచ్చే ఆహారం). ఇది పాలకు ప్రత్యామ్నాయం కాదు. నాలుగు వారాల వయసు నుండీ పాలు తాగించడం మెల్లిగా తగ్గించి, అంత మేరకూ గంజిని ఇవ్వాలి. ఇరవై రోజుల తర్వాత పాలను పూర్తిగా మానిపించాలి.
దూడలకు కాఫ్ స్టార్టర్స్ (మార్కెట్లో లభ్యమయ్యే కృత్రిమ ఆహారాలు) ఇవ్వడం
ఈ పద్ధతిలో దూడలకు తొలుతగా వెన్న తీయని పాలు ఇస్తారు. పొడిగా ఉండే కాఫ్ స్టార్టర్ మరియు మంచి ఎండు గడ్డి లేదా పచ్చి గడ్డి తినడం నేర్పిస్తారు. 7 నుంచి 10 వారాల మధ్యలో దూడలకు పాలు మాన్పిస్తారు.
దూడలకు పోత పాలు ఇవ్వడం
పోషక విలువల పరంగా పాలకు ఏదీ సాటి రాదు. కానీ పాలు లేక ఇతర ద్రవ పదార్ధాల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు పాలకు ప్రత్యామ్నాయాలు వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
పోత పాలు కూడా మామూలు పాల మొతాదులోనే ఇవ్వాలి. అంటే పాలు కలిపిన తరువాత శరీరం బరువులో 10% ఉండేటట్లు. కలిపిన ద్రవ పదార్ధంలో మొత్తం ఘన పదార్ధం 10-12% వరకూ ఉండాలి.
వీనింగ్ లేదా దూడను వేరు చేసి పెంచే పద్ధతి
· వీనింగ్ లేదా దూడను వేరు చేసి పెంచడం ఇంటెన్సివ్ పశు పోషణ పద్ధతిలో అవలంభిస్తారు. వీనింగ్ ద్వారా యాజమాన్యంలో ఎకరూపతను సాధించ వచ్చు. పాలు వృధా పోకుండా, లేదా దూడలు అవసరానికి మించి ఎక్కువ పాలు తాగేయ కుండా ప్రతి దూడకు అవసరమైన పాలు లభ్యమయ్యేలా చూడవచ్చు.
· అవలంభించిన పద్ధతిని బట్టి దూడను పుట్టిన వెంటనే కానీ, 3 వారాల తరువాత కానీ, లేదా 8 -12 వారాల మధ్యలో కానీ లేక 24 వారాలప్పుడు కానీ వేరు చేస్తారు. సాధారణంగా రైతులు 12 వారాలప్పుడు దూడను వేరుచేస్తారు. ఆబోతుగా ఎదగనిచ్చే కోడె దూడలను ఆరు నెలల వయసు వరకూ తల్లితోనే ఉంచుతారు.
· పశువుల మందను క్రమ పద్ధతిలో పోషిస్తున్నప్పుడు, అంటే అధిక సంఖ్యలో దూడలు ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే దూడను వేరు చెయ్యడం లాభదాయకం.
· పుట్టిన వెంటనే దూడను వేరు చెయ్యడం వలన, దూడలకు చిన్న వయస్సులోనే పోత పాలు, దూడ దాణాలు అలవాటవుతుంది. ఆవు పాలు మనుషుల వినియోగానికి మిగులుతాయి.
దూడను వేరు చేసిన తరువాత
దూడను వేరు చేసిన తరువాత నుండి మూడు నెలల వరకూ కాఫ్ స్టార్టర్ ను కొద్ది కొద్ది గా పెంచుతూ వెళ్ళాలి. రోజంతా తినడానికి దూడలకు మంచి నాణ్యమైన ఎండుగడ్డిని అందుబాటులో ఉంచాలి. తేమ శాతం అధికంగా ఉన్న పాతర గడ్డి, పచ్చి గడ్డి మేత, పచ్చిక బయళ్ళలో మేత వంటివి దూడ శరీరం బరువులో 3% వరకూ ఇవ్వచ్చు. అయితే వీటి మూలంగా పోషకాలు తీసుకోవడం కుంటు పడే అవకాశం ఉంది కాబట్టి, ఇవి మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
దూడ ఎదుగుదల
పెరుగుదల సరిగా ఉందో లేదో చూడడానికి మధ్య మధ్యలో బరువు చూస్తూ ఉండాలి.
· మొదటి మూడు నెలలలో దూడల పోషణ అత్యంత కీలకమైనది
· ఈ దశలో పోషణ సరిగా లేకుంటే 25 -30 శాతం వరకూ దూడలు మరణిస్తాయి.
· చూడి పశువుకు నాణ్యమైన పశుగ్రాసాన్ని ఇవ్వాలి. చూడి కాలం చివరి 2 -3 నెలల్లో సాంద్ర దాణాలను పెట్టాలి.
· సాధారణంగా, పుట్టినప్పుడు దూడ బరువు 20-25 కిలో లు ఉంటుంది.
· క్రమం తప్పకుండా నులిపురుగుల మందు ఇప్పిస్తూ ఉంటే దూడలు నెలకి 10-15 కిలో లు చొప్పున పెరుగుతాయి.
తగినంత వసతి ముఖ్యం
దూడలను తల్లి నుంచి వేరు చేసే వయసు వచ్చే వరకూ విడి విడి దొడ్లలో ఉంచాలి. ఇలా విడి విడి గా ఉంచడం వలన అవి ఒకదాన్నొకటి నాకకుండా ఉండి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. దూడల దొడ్లు పరిశుభ్రంగానూ, పొడిగానూ ఉండి గాలీ వెలుతురూ బాగా రావాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన గాలి తగిలేలా ఉండాలే కానీ గాలి సరాసరి దూడలకు విసురుగా తగల కూడదు. దూడలను పొడిగా, హాయిగా ఉంచడానికి దూడల దొడ్డిలో నేల మీద గడ్డి గాదం పరవాలి. సాధారణంగా రంపపు పొట్టు కానీ గడ్డి కానీ వాడతారు. అధికంగా ఉన్న ఎండ నుంచి, శీతల వాతావరణం నుంచి, వర్షం నుండీ, గాలి నుండీ రక్షణకి వెలుపల ఉన్న పశువుల కొట్టాలను పైన సగం వరకూ మూసి ఉంచి, చుట్టూరా గోడను కట్టాలి. తూర్పున తెరుచుకుని ఉన్న దూడల దొడ్లలో పొద్దున్న పూట సూర్య రశ్మి వచ్చి, కొంచెం ఎండగా ఉన్న సమయాలలో నీడగా ఉంటుంది. తూర్పునుండి అరుదుగా వర్షాలు పడతాయి.
దూడలను ఆరోగ్యంగా ఉంచడం
పుట్టిన దూడలకు వ్యాధులు సోకకుండా చూడడం చాలా ముఖ్యం. ఇందు మూలంగా దూడ పెరుగుదల ఆరోగ్యంగా మొదలై పశు మరణాల వల్ల నష్టాలు సంభవించ కుండా ఉంటుంది. రోగాల బారిన పడిన పశువులకు వైద్యం చేయించడం కన్నా ఇది చవకైన పద్ధతి. దూడలను క్రమం తప్పక పరిశీలిస్తూ, వాటికి సరైన పోషణనిస్తూ వాటికి పరిశుభ్రమైన పరిసరాలను ఏర్పరచాలి.
Subscribe to:
Posts (Atom)